TV9 Ismart News: గణపతి మెడలో ఆరు తులాల బంగారుచైన్.. మర్చిపోయి నిమజ్జనం! | యూత్ అంటే ఇట్లుండాలే !

TV9 Ismart News: గణపతి మెడలో ఆరు తులాల బంగారుచైన్.. మర్చిపోయి నిమజ్జనం! | యూత్ అంటే ఇట్లుండాలే !

Anil kumar poka

|

Updated on: Sep 13, 2024 | 8:08 PM

ఇండ్లల్ల వెట్కున్న గణపతులకు గూడ గల్లీల్ల వెట్టిన గణేషులకి తీశిపోని తీర్ల గ్రాండుగ నిమజ్జనాలు చేస్తుంటరు. బ్యాండ్ బాజాలతోటి బారాత్లు తీస్తరు. గట్లనే అందర్లెక్క ఓతాన ఓ ఇంటోళ్లు కూడ మాసంబురంగ ఇంట్ల పెట్టిన గణ్పతిని నిమజ్జనం చేసోచ్చినంక నెత్తినోరు కొట్కుంట నిమ్మజ్జనం కాడికి మల్ల ఉర్కిండ్రట.. మరీ ఎందుకు ఏందన్నది ఈ ముచ్చటింటే సమజైతది.

Gold chian
ఇండ్లల్ల వెట్కున్న గణపతులకు గూడ గల్లీల్ల వెట్టిన గణేషులకి తీశిపోని తీర్ల గ్రాండుగ నిమజ్జనాలు చేస్తుంటరు. బ్యాండ్ బాజాలతోటి బారాత్లు తీస్తరు. గట్లనే అందర్లెక్క ఓతాన ఓ ఇంటోళ్లు కూడ మాసంబురంగ ఇంట్ల పెట్టిన గణ్పతిని నిమజ్జనం చేసోచ్చినంక నెత్తినోరు కొట్కుంట నిమ్మజ్జనం కాడికి మల్ల ఉర్కిండ్రట.. మరీ ఎందుకు ఏందన్నది ఈ ముచ్చటింటే సమజైతది..
Bike birth day
యాపీ బర్త్ డే టు యూ. యాపీ యాపీ బర్త్ డే టూయూ. యాపీ బర్త్ డే టూయూ… ఏంది ఏమో గట్ల సూస్తరు. అర్రే ఏంది అట్ల సూస్తరు.. నాతోటి మీరు కూడ విష్షెస్ చెప్పుండ్రి.. నీ కథ మంచిగనే ఉన్నదమ్మ… ఎవలి పుట్టిన రోజో చెప్పవ్.. ఎన్నో పుట్టినరోజో తెల్వది. పాట వాడి, విష్సెస్ చెప్పు..దీవానార్తులు వెట్టంటే ఎట్లా అని గరమైతుండ్రా ఎట్లా..? అవ్ అది కూడ నిజమే గద. సరే లేండ్రి ఇగో బర్తుడే బాయిని సూయిస్తున్న .. మీరు కూడ నిండు పదిగేనేండ్లు సల్లగుండాలని దీవానార్తులు పెట్టుర్రి..
kmm chori
లీడర్లు ఏ వర్గానికి ఏం తాయిలాలిస్తే ఓట్లు మన బొచ్చెల పడ్తయి అని ఆలోచన చేశ్నట్టు .. దొంగలు కూడ యే దుక్నంల సొర్రి చోరీ చేస్తే ఏం పడ్తల్ పడ్తయ్యని శాన ఆలోచన చేస్తరు.. ఒక దుకాండ్లపడ్డమంటే మాలన్న మనకు అక్కెర్రాలే.. పైకమన్న పాయిదా రావాలని ప్లాన్లే స్కుంటరు.. గందుకే రెక్కీలు చేషి, టార్గెట్లు పెట్టి మార్కెట్ల దుక్నాలను హఫా చేస్తుంటరిట్ల
Milk ritulu’
మనకు ఇప్పుడు పాలు కావాల్నంటే దుకాండ్లకు పోతున్నం..ముప్పై రూపాలిస్తున్నం పాల ప్యాకిట్ దెచ్చుకుంటున్నం చాయలు..కాపీలు తాగుతున్నం. పెర్గుతోడు పెట్కుంటున్నం..కాని ఆ పాలు మనకాడికి అంత అల్కగొస్తున్నయ్యంటే ఎంతో మంది పాడి రైతుల కస్టమున్నది.. అయితే పాల ప్యాకిట్లు కొంటున్న కస్టమర్లు బాగనే ఉంటుర్రు.. నడ్మిట్ల అమ్ముకుంటున్న కంపినోల్లు మంచిగనే ఉంటుర్రుగాని ఆరుగాలం కస్టపడి, పాడి జీవాలను నమ్ముకోని పాలుతీస్తున్న మాకే శాపాలు తల్గినట్టైతుందని రోడ్డెక్కిండ్రు ఓకాడి పాడి రైతులు
NTR fan
చెట్టంత కొడ్కు ఆవుసు కండ్ల ముంగట కరిగిపోతుందని తెలుస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల బాదెట్లుంటది. కొడుకే ఊపిరి అని బతికిన తల్లిదండ్రులకు ఆ కొడ్కు ఊపిరి ఉండదని తెల్షినప్పుడు ఆ బాదను ఎవ్వలు తీరుస్తరు…గసోంటి కష్టమే అచ్చింది తి తమ్మున్కి.. శిన్న ఎన్టీఆర్ అన్నంటే ప్రాణమిడ్షే నా కొడ్కు దేవర సిన్మాదాక బత్కినా సాలు అని ఆతల్లిదండ్రులు ఏడ్సుకుంట చెప్తున్నది సూస్తుంటే కండ్లల్ల నీల్లు తిర్గవట్టినయి
School bill
శానమందికి గుండెలు గుబెల్లు మనేది ఎప్పుడో తెల్సా.?? ఒక్క తారీక్ రాంగనే కట్టాల్సిన బిల్లులు చూషి గుండే గుబెల్లుమంటది. అప్పుడప్పుడు అన్పిస్తుంటది ఈ బిల్లులు బిల్కుల్ లేని లోకమేదన్న ఉంటే మంచిగుండు అని.. కాని అది గాని పని గద.. బిల్లులంటే యాదొచ్చే ఓ కాంట్రక్టర్కు కూడ గిట్లనే ముందుగాలు బిల్లింగు కట్టుమన్నరట సర్కారోల్లు ..కాని బిల్లింగు కట్టినంక బిల్లులు అడ్గుతే బిన్ లాడెన్ను చూశ్నట్టు సూస్తుర్రట. అత్త మీద కోపం దుత్త మీద చూయించినట్టు ఆ కాంట్రాక్టరన్న ఏం చేషిండో సూడుర్రిగ
SP teaching
బల్లే పిల్లలకు టీచర్లంటే ఎట్ల బయముంటదో బైట పోలీస్ సార్లను సూస్తే పబ్లిక్కు అట్ల భయముంటది. పిలగాల్లు మంచి పౌరులుగా ఎద్గేతట్టు సార్లు నేర్పిస్తే.. ఆ పౌరులు పద్దతి తప్పకుంట క్రమశిక్షణల వెట్టేటోల్లు పోలీసోల్లు. రక్షక భటులుగా పబ్లిక్ను రక్షణిచ్చుడే కాదు.. తప్పుచేస్తే శిక్షిస్తరు కూడ.. అట్లనే ఖాకీలంటే చాకులు పట్టుకున్నోల్లను రాకుడే కాదు చాక్ పీసులు పట్టి పీస్‌ ఫుల్గ ఇట్ల పాఠాలు కూడ చెప్తుంటరు అన్పిచ్చిండు గీ వనపర్తి ఎస్పీ గిరిధర్ సారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.