AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Ganesh: విఘ్నాలు తొలగించే గణనాధునికి కరెన్సీ నీరాజనం..  మనీ సహిత రమణీయ వేడుక

Lord Ganesh: విఘ్నాలు తొలగించే గణనాధునికి కరెన్సీ నీరాజనం.. మనీ సహిత రమణీయ వేడుక

Ram Naramaneni
|

Updated on: Sep 14, 2024 | 8:57 AM

Share

మంగళగిరిలో మనీ వినాయక్‌. పాల్వంచలో కరెన్సీ గణేష్‌. ఆ ఇద్దరే కాదు కాంపిటేషన్‌లో ఇంకా చాలా మంది విఘ్నేష్‌లున్నారు. మరి కౌన్‌ బనేగా కరోడ్‌పతి? . భక్తితో కొలిచి తృణమో ఫణమో కానుకులు ఇవ్వడం కాదు. శక్తి కొలదీ ఏకంగా కోట్లలో క్యాష్‌ నీరాజనం కొనసాగుతోంది.

అసేతుహిమాచలం వైభవంగా వినాయక  నవరాత్రి వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి.  పల్లె పట్నం..ఊరూవాడా ఎక్కడ చూడు గణేష్‌ సందడే. ఏకదంతుడు అనేక రూపాల్లో కొలువుదీరారు. భక్తి తో  కొలిచే వారు మాత్రమే కాదు శక్తికొలిది ఇలా  భక్తి చాటుకునే వారెందరెందరో..

ఫలం..పుష్పం…తోయం.. ఉండ్రాళ్లు మాత్రమే కాదండోయ్‌  …లంబోదరుడికి ఇలా మనీ దండలన్నా ఎంతో ప్రీతి మరి.  పార్వతీ పరమేశ్వరుల గారాల బిడ్డడయినా .. లక్ష్మీనారాయణులకు కూడా గణపతి అంటేఎంతో ముద్దు మురిపెం. విఘ్నేశ్వరుడికి కూడా  లక్ష్మీనారాయణులంటే ఎంతో గౌరవం,భక్తి.అంతెందుకు శివుడి ఆజ్ఞ మేరకు  నారాయణ మంత్రం  జపిస్తూ  అమ్మానాన్నల చుట్టు ప్రదక్షిణ చేసి..గణాధిపత్యం చేపట్టారు లంబోధరుడు. అల కైలపురం..వైకుంఠపురం ఘట్టాలను ఇలలో ఇలా కళ్లకు కట్టారన్న మాట.

లక్ష్మీ గణపతిని తలిచిన వాళ్లకు.. కొలిచిన వాళ్లకు కొంగు బంగారమే అనే విశ్వాసానికి ప్రతీక ఇది. వినాయక మండపంలో మనీ దండల అలంకరణ ఆర్భాటం కాదు.తాహతుకు దర్పం అంతకన్నా కాదు. ఈ వేడుక భక్తి విశ్వాసాలకు వేదిక.  ప్రతీయేటా భక్తుల క్రియేటివిటీకి.. వెరైటీ వెరైటీ విగ్రహాలకు కొదువే ఉండదు. ఈసారి మంగళగిరి విఘ్నేశ్వర వైభవం మరో లెవల్‌..

మంగళగిరి మెయిన్ బజార్ లో కొలువైన కరెన్సీ గణేష్‌  ఈసారి  స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. 2 కోట్ల 30 లక్షల కరెన్సీతో అలంకరించిన ఈ మండపం గురించి చెప్పతరమా.చూసి ముగ్దులవ్వాల్సిందే. మంత్రి నారా లోకేష్‌ మంగళగిరి కరెన్సీ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పాల్వంచలోని రాంనగనర్‌ వినాయక మండం కరెన్సీతో కళకళలాడిందిలా..నవరాత్రుల్లో భాగంగా ఏడో రోజు కోటి 10 లక్షల కరెన్సీతో ఇలా చక్కగా అలంకరించారు ఉత్సవ కమిటీ సభ్యులు. లక్ష్మీ గణపతి దర్శించి తరించారు భక్తులు.

సంకల్ప గణపతి…శక్తి కొలది కొలువుదీర్చి భక్తితో కొలిస్తే  కోరిన కోరికలు తీర్చే సులభ సాధ్యుడు వినాయకుడు. ఏ రూపాన కొలువుదీర్చినా.. ఏకాదంత.. లంబోదర.. విఘ్నవినాయక.. లక్ష్మీ గణపతి ..ఇలా ఏ పేరున పిలిచానా .. ఏ తీరునా కొలిచినా.. అంతర్ధారం భక్తి ప్రపత్తే. మంచి చేయమని మనసులో గట్టిగా కోరుకున్నది నిజం కావాలంటే విధిగా  మట్టి గణపయ్యను పూజించాలి. ప్రకృతి గణపయ్యను మనం ఆరాధిస్తే  ప్రకృతి మనల్ని కరుణిస్తుంది…జైబోలో మట్టి గణేశా.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Published on: Sep 14, 2024 08:56 AM