Sunita Williams: ఆల్ ఈజ్ నాట్ వెల్.. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన..!
బోయింగ్ ఏం ప్రకటన చేస్తుందన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. 2025 ఫిబ్రవరి వరకు సునీతా విలియమ్స్, విల్ మోర్ రాకపోతే వాళ్ల ఆరోగ్యపరిస్థితిపైనే ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతోంంది. ముఖ్యంగా అక్కడ ఛాలెంజింగ్‌గా ఉండే వాతావరణంపై.. అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడ ఎదుర్కొనే సోలార్ రేడియేషన్ ప్రభావం ఆందోళనకు గురిచేస్తోంది.
ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం… అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు.. యావత్ ప్రపంచం కూడా సునితా, విల్ మోర్‌ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు .. ఈ రోజు వస్తారు.. రేపొస్తారని అని భావించినా.. చివరికి 2025 వరకు వచ్చే ఛాన్సే లేదన్న వార్త విన్నాక అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఈ కీలక మిషన్‌పై బోయింగ్.. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.30 నిమిషాలకు ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటనపైనే ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి పెట్టింది. ప్రధానంగా 2025 ఫిబ్రవరి వరకు వచ్చే అవకాశం లేదన్న ప్రకటన విషయంలో ఏదైనా మార్పు ఉంటుందా..? ఒక వేళ ఉంటే ఎప్పుడు భూమిపైకి వస్తారు..? ఒక వేళ అక్కడే ఉండాల్సి వస్తే… ఏం చెయ్యనున్నారు.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.
బోయింగ్ ఏం ప్రకటన చేస్తుందన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. 2025 ఫిబ్రవరి వరకు సునీతా విలియమ్స్, విల్ మోర్ రాకపోతే వాళ్ల ఆరోగ్యపరిస్థితిపైనే ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అక్కడ ఛాలెంజింగ్‌గా ఉండే వాతావరణం.. అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడ ఎదుర్కొనే సోలార్ రేడియేషన్ ప్రభావం వారి క్షేమం పట్ల తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
భూమి కంటే 30 రెట్ల అధిక రేడియేషన్ ప్రభావం..
నిజానికి భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్ దగ్గర భూమితో పోల్చితే సుమారు 30 రెట్లు అధికంగా రేడియేషన్ ఉంటుంది. అదే ఇప్పుడు ఆస్ట్రోనాట్స్‌ను ప్రధానంగా భయపెట్టే విషయమని చెబుతోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక్క వారం రోజుల పాటు రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్ అయితే శరీరంపై పడే ప్రభావం భూమిపై ఏడాది పాటు రేడియేషన్‌కు గురైతే పడే ప్రభావంతో సమానం.
సాధారణంగా రిస్క్ ఆఫ్ రేడియేషన్‌ను మిల్లీ సివర్ట్స్‌లో మెజర్ చేస్తారు. అంటే స్పేస్‌లో వారిపై పడే రేడియేషన్ ఎఫెక్ట్ సుమారు 50 నుంచి 20 వేల మిల్లీ సివర్ట్స్ ఉంటుందని అంచనా. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది 150 నుంచి 6000 ఎక్స్ రేలు తీయించుకోవడం వల్ల శరీరంపై పడే ఎఫెక్ట్‌తో సమానం. మనిషి శరీరంపై ఆ స్థాయిలో రేడియేషన్ ఎఫెక్ట్ పడటం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. శరీరంలోని కణజాలాలు దెబ్బతింటాయి. నరాల వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే ఆస్ట్రోనాట్స్ రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. రేడియేషన్ ప్రమాదం కారణంగా జబ్బుపడొచ్చు. క్యాన్సర్‌కి కూడా దారి తీయవచ్చు. ప్రధానంగా దీర్ఘ కాలిక అనారోగ్యం బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
మరో ఛాలెజింగ్ మైక్రో గ్రావిటీ..
ఇక తర్వాత సమస్య.. మైక్రో గ్రావిటీ వల్ల వచ్చేది. భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తి వేరు.. స్పేస్‌లో ఉండే గురత్వాకర్షణ శక్తి వేరు. అది మనం వారిని స్పేస్‌లో చూస్తున్నప్పుడే స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కువ కాలం అదే పరిస్థితిలో అంటే స్పేస్‌లో ఈ మైక్రోగ్రావిటీలోనే ఉంటే అది హ్యూమన్ బాడీపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా శరీరంలోని ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది. మజల్స్ మాస్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు నెలకు కనీసం 1 శాతం బోన్ మాస్ కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా హిప్స్ దగ్గర, బ్యాక్ బోన్ దగ్గర, అలాగే తొడ ఎముక దగ్గర ఇలా జరిగే ప్రమాదం ఉంది. అక్కడ ఎంత ఎక్కువ కాలం ఉంటే ఈ రిస్క్ అంత పెరిగే ప్రమాదం ఉంటుందని నాసా చెబుతోంది. . ఒక్కోసారి ఇది శారీరక వైకల్యానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. అలాగే మైక్రో గ్రావిటీ వల్ల ఫ్లూయిడ్స్ మన శరీరంలోని పై భాగాలకు చేరుకుంటాయి. అందుకే ఆస్ట్రోనాట్స్ ముఖాలు కాస్త ఉబ్బినట్టు కనిపిస్తాయి.పైకి చేరిన ఈ ఫ్యూయిడ్స్ వల్ల ఒక్కోసారి మాట తడబటం, రుచి, వాసన కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు . బాడీలోని ఫ్లూయిడ్స్ శరీరమంతా సరైన రీతిలో సరఫరా కాకపోతే కిడ్నీల్లో సమస్యలు తెలెత్తే ప్రమాదం ఉంది. స్పేస్‌లో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తే తట్టుకోవడం చాలా కష్టం.
8 రోజుల ప్రయాణమని బయలుదేరి..
అలాగే భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో… మన మాటల్లో చెప్పాలంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ఉంది ప్రస్తుతం సునీతా-విల్ మోర్‌ల పరిస్థితి. ఎప్పుడు తిరిగొస్తారో తెలీదు.. కుటుంబానికి, తమకు అలవాటైన ప్రాంతాలకు అందనంత దూరంలో ఉన్నారు. బయటకు ఎంత ధైర్యంగా మనకు కనిపిస్తున్నా… 8 రోజుల ప్రయాణానికని బయల్దేరి 8 నెలల తర్వాత కానీ వచ్చే అవకాశం లేదని తెలిస్తే… పక్క ఊరికెళ్లిన మనకి ఇలాంటి వార్త తెలిస్తేనే కంగారు పడిపోతాం. అలాంటిది భూమికి 400 కిలోమీటర్ల దూరంలో మరో 6 నెలల పాటు అక్కడే ఉండాలంటే మానసికంగా ఎంత దృఢంగా ఉన్న వ్యక్తులకైనా అంత సులభం కాదు . సో.. ఇది కచ్చితంగా వారిని మానసికంగా కుంగ దీసే ప్రమాదం లేకపోలేదన్నది మానసిక నిపుణుల మాట.
మరోవైపు సునితా విలియమ్స్ ఫ్యామెలీ కూడా ప్రస్తుత పరిస్థితిపై రియాక్ట్ అయ్యింది. భూమికి తిరిగి ఎప్పుడొచ్చే విషయంలో స్పష్టత లేనప్పటికీ సునీతకు ఇష్టమైన ప్లేస్ స్పేసేనని వాళ్లంటున్నారు. మరోవైపు విల్ మోర్ ఫ్యామెలీ మాత్రం వారి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందుతోంది. అయితే ప్రస్తుతం నాసా అందించిన సమాచారం ప్రకారం వాళ్లిద్దరూ చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నారన్నది కాస్త గుడ్ న్యూస్. బుధవారం రాత్రి 10.30 నిమిషాలకు నాసా నిర్వహించబోయే మీడియా సమావేశంలో వాళ్ల గురించి, వాళ్ల భవిష్యత్తు గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి