పాకిస్తాన్-బంగ్లాదేశ్ ఒక్కటవుతున్నాయా? అదే జరిగితే భారత్ పరిస్థితేంటి?

ఆగస్టులో బంగ్లాదేశ్ జాతి పితగా భావించే షేక్ ముజ్మీర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూలదోసినప్పటి నుంచే... ఆయన నినాదాలు, ఆయన ఆశయాలు, ఆయన మార్గం అన్నింటినీ బంగ్లాదేశ్ మర్చిపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు ఏ పాకిస్తాన్‌ను కాదని భారత్ సాయంతో స్వతంత్రం సంపాదించుకుందో.. ఇప్పుడు

పాకిస్తాన్-బంగ్లాదేశ్ ఒక్కటవుతున్నాయా? అదే జరిగితే భారత్ పరిస్థితేంటి?
Bangladesh–Pakistan relations
Follow us
Ravi Panangapalli

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 02, 2024 | 7:53 PM

సరిగ్గా ఈ డిసెంబర్ 16 నాటికి బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడి 53 ఏళ్లు పూర్తవుతాయి. పాకిస్తాన్‌ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత్ కారణం అన్న సంగతి బహుశా చరిత్ర చదువుకున్న ఈ తరానికి లేదా చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి తప్ప 3 పదులు నిండిన వాళ్లకు పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ భారత్‌ను పక్కన పెట్టేసి… పొరుగునున్న వారి పాత శత్రువు.. మనకు చిరకాల శత్రువు అయిన పాకిస్తాన్‌తో చేతులు కలుపుతోంది. దేశంలో 11 శాతం మంది ఉన్న హిందూ మైనార్టీలపై దాడులు చేస్తూ వారిని భయకంపితుల్ని చేస్తోంది. అలాంటిదేం లేదని… హిందువులకు పూర్తి రక్షణ ఇస్తున్నామని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ చెబుతున్నప్పటికీ ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ దాస్ అరెస్ట్.. ఆ తర్వాత పరిణామాలు చూస్తున్న వారికి ఆయన మాటలు వట్టి గాలి మాటలే అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతోంది.

పాక్ పంచన చేరేందుకు తహతహ

ఆగస్టులో బంగ్లాదేశ్ జాతి పితగా భావించే షేక్ ముజ్మీర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూలదోసినప్పటి నుంచే… ఆయన నినాదాలు, ఆయన ఆశయాలు, ఆయన మార్గం అన్నింటినీ బంగ్లాదేశ్ మర్చిపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు ఏ పాకిస్తాన్‌ను కాదని భారత్ సాయంతో స్వతంత్రం సంపాదించుకుందో.. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో పాక్ పంచన ఉంటేనే సుఖంగా ఉంటుందని భావిస్తున్నట్టు అర్థమవుతోంది. కొద్ది వారాల క్రితం జరిగిన ఓ సంఘటన అందుకు సాక్ష్యం అని చెప్పొచ్చు. 53 ఏళ్ల బంగ్లాదేశ్ చరిత్రలో తొలిసారిగా పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌లోని చిట్టగ్రామ్ పోర్టుకు ఓ కార్గో నౌక వచ్చింది. స్వతంత్ర బంగ్లాదేశ్ చరిత్రలో పాకిస్తాన్‌తో నేరుగా మారిటైం కనెక్షన్ ఏర్పడటం ఇదే తొలిసారి. 1971లో వేలాది మంది మరణాలకు ఏ దేశమైతే కారణమైందో ఇప్పుడు అదే దేశంతో గతాన్ని మర్చిపోయి చేతులు కలుపుతోంది యూనిస్ ప్రభుత్వం. ఇది బంగ్లాదేశ్-పాకిస్తాన్ సంబంధాల మధ్య ఇటీవల వచ్చిన స్పష్టమైన మార్పునకు నిదర్శనం. అంతే కాదు.. సెప్టెంబర్లో న్యూయార్క్‌లో జరిగిన UNGA సమావేశాలు జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యునిస్ స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాద్ షరీష్‌తో భేటీ అయ్యారు. భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా నిలిచిపోయిన సార్క్ ను మళ్లీ పునరుద్ధరించాలని కోరారు. అంతేకాదు ఈ భేటీ తర్వాత బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహ్మద్ తౌహిద్ హుస్సేన్ మరో అడుగు ముందుకేసి… రెండు దేశాల మధ్య సత్సంబంధాలను తాము కోరుకుంటున్నామని, 1971లో జరిగిన దారుణం పట్ల పాకిస్తాన్ క్షమాపణ చెప్పినట్టయితే అది సాధ్యమేనంటూ మరో అడుగు ముందుకేశారు. తాజా పరిస్థితుల్ని చూస్తుంటే నిన్న మొన్నటి వరకు షేక్ హసీనా ఇండియా పట్ల సానుకూలంగా ఉంటూ పాకిస్తాన్‌ను దూరం పెట్టగా.. ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న యూనిస్ సర్కారు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓ రకంగా భారత్‌కు సవాల్ విసురుతోంది. కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అతివాదుల్ని దగ్గర చేసుకోవడం, మిలటరీని మరింత శక్తిమంతగా చేసేందుకు ప్రయత్నిస్తుండటం, మైనార్టీలపై దాడులు ఇవన్నీ చూస్తున్న ఎవరికైనా బంగ్లాదేశ్ మళ్లీ గతానికి వెళ్లడానికి ప్రయత్నిస్తోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. జులైలో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసిన మేథావులే ఇప్పుడు తప్పు చేశామా.. అని భావిస్తున్నారు. చూస్తుంటే నాడు విద్యార్థుల ముసుగులో జరిగిన ఒక ప్లాన్ ప్రకారం ఇస్లామిక్ జిహాదిస్టులు, ఉగ్రవాదులు సృష్టించిన అలజడి అన్న సంగతి అర్థమవుతోందని అంటున్నాు.

మోదీకి మాటిచ్చిన యూనస్

బంగ్లాదేశ్‌ పరిణామాలు ఆ దేశ అంతర్గత వ్యవహారాలని ఇండియా వ్యాఖ్యానించినా, అక్కడి మైనారిటీల భద్రతపై మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో స్థానిక అల్పసంఖ్యాక వర్గాల రక్షణ బంగ్లాదేశ్‌ సర్కారీ బాధ్యత అని తాజాగా పార్లమెంటులో భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. వాస్తవానికి బంగ్లాలో మైనారిటీలను భద్రంగా చూసుకుంటామని లోగడ యూనస్‌ స్వయంగా మోదీకి ఫోన్‌ చేసి మరీ హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడం గురించి ఆయన పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. పైగా, యూనస్‌ బాధ్యతలు చేపట్టాక బంగ్లాలో మతఛాందసవాద శక్తులు బలం పుంజుకొంటున్నాయన్న విశ్లేషణలు మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి.

70 ప్రార్థనా మందిరాలపై అల్లరి మూకల దాడులు

బంగ్లాదేశ్‌ హిందూ బుద్ధిస్ట్‌ క్రిస్టియన్‌ యూనిటీ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నాలుగు నుంచి అక్కడ మైనారిటీలపై రెండు వేలకు పైగా దాడులు చోటుచేసుకున్నాయి. దాదాపు డెబ్భై ప్రార్థనా మందిరాలపైనా అల్లరి మూకలు విరుచుకుపడ్డాయి. ఇటీవల దుర్గాపూజ సైతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగింది. పాకిస్థాన్‌ మాదిరిగా బంగ్లాదేశ్‌ మత ఛాందసత్వంలో కూరుకుపోతే- ఆ దేశాభివృద్ధి స్తంభించిపోవడమే కాదు, ఇండియా భద్రతకూ అది ప్రమాదమే.

4,096 కిలోమీటర్ల సరిహద్దు

బంగ్లాదేశ్‌తో భారత్‌ 4,096 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. సంస్కృతి, సంప్రదాయాల పరంగా రెండు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ దేశానికి స్వతంత్రం రావడంలో భారత్ పాత్ర ఏంటన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ ఎలాంటి సంక్షోభం తలెత్తినా ఇండియాలోకి వలసలు పోటెత్తుతాయి. గత ఆగస్టులో వేలాది మంది సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను ప్రపంచమంతా చూసింది. బంగ్లాదేశ్‌లో మత శక్తులు విజృంభిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం కొత్త కోరలు తొడుక్కొంటుంది. ఇండియాను అస్థిరపరిచేందుకు కాచుక్కూర్చున్న చైనా- ప్రస్తుత అనిశ్చితిని ఆసరాగా చేసుకుని బంగ్లాపై పట్టుసాధిస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

పాక్ పంచన చేరేందుకు బంగ్లాదేశ్ తహతహ
పాక్ పంచన చేరేందుకు బంగ్లాదేశ్ తహతహ
'మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా'.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు
'మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా'.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు
మద్యం ప్రియులారా..!భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకుతెలుసా
మద్యం ప్రియులారా..!భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకుతెలుసా
ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం..
ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం..
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.. కట్‌చేస్తే.. 211 పరుగుల తేడాతో విజయం
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.. కట్‌చేస్తే.. 211 పరుగుల తేడాతో విజయం
రైలు చివ‌రి బోగి వెనుక ఇలాంటి X గుర్తు ఎందుకు రాసి ఉంటుందో తెలుస
రైలు చివ‌రి బోగి వెనుక ఇలాంటి X గుర్తు ఎందుకు రాసి ఉంటుందో తెలుస
'నేను కూడా ఎమ్మెల్యేనే సార్'.. బాలయ్య షోలో నవీన్, శ్రీలీల హంగామా
'నేను కూడా ఎమ్మెల్యేనే సార్'.. బాలయ్య షోలో నవీన్, శ్రీలీల హంగామా
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
సరికొత్తగా తెలంగాణ త‌ల్లి విగ్రహం తయారీ..ఆ రూపం వెనుక సిక్రేట్ ?!
సరికొత్తగా తెలంగాణ త‌ల్లి విగ్రహం తయారీ..ఆ రూపం వెనుక సిక్రేట్ ?!
ఆకట్టుకుంటున్న వరి కంకుల అలంకరణలు.. ఎలా చేశారో చూడండి
ఆకట్టుకుంటున్న వరి కంకుల అలంకరణలు.. ఎలా చేశారో చూడండి
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా