పవన్‌ను పదేపదే టార్గెట్ చేస్తోన్న ప్రకాశ్ రాజ్.. ఇంతకీ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది..?
Pawan Kalyan vs Prakash Raj: పవన్, ప్రకాశ్ రాజ్ ఇద్దరి మధ్య మాటల యుద్ధాలు ఇవాళే మొదటి సారి కాదు. అలాగని ఇద్దరు కలిస్తే కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం కూడా మన జనాలకు కొత్త కాదు. కానీ ఎప్పటికప్పుడు ఎక్కడో తేడా కొడుతుంటుంది. బహుశా పొలిటికల్ ఐడియాలజీ మాత్రమే దీనికి కారణం కావచ్చేమో... వ్యక్తిగత అంశాలు కారణం కాకపోవచ్చు కూడా.
పవన్ Vs ప్రకాశ్ రాజ్.. ఇదేం సినిమా కాదు.. హీరో వెర్సెస్ విలన్ అనుకోడానికి. రియల్ లైఫ్ .. రియల్ క్యారెక్టర్స్… రియల్ ఫైట్. అది కూడా మాటల వరకే పరిమితం. అది పర్సనల్లా.. ప్రొఫెషనల్లా అని మాత్రం మనం అడగొద్దు. అడిగినా వారు చెప్పరు కూడా. అయితే ఒక్కో టైంలో ఒక్కో ఇష్యూతో ఇద్దరూ మాటల యుద్ధం చేస్తుంటే… పైసా ఖర్చు లేకుండానే పవర్ ఫుల్ యాక్షన్ సినిమా చూస్తున్నట్టు ఉంటోంది ప్రేక్షకులకు..
పవన్, ప్రకాశ్ రాజ్ ఇద్దరి మధ్య మాటల యుద్ధాలు ఇవాళే మొదటి సారి కాదు. అలాగని ఇద్దరు కలిస్తే కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం కూడా మన జనాలకు కొత్త కాదు. కానీ ఎప్పటికప్పుడు ఎక్కడో తేడా కొడుతుంటుంది. బహుశా పొలిటికల్ ఐడియాలజీ మాత్రమే దీనికి కారణం కావచ్చేమో… వ్యక్తిగత అంశాలు కారణం కాకపోవచ్చు కూడా.
ప్రకాశ్ రాజ్ వెంట నిలిచిన మెగా ఫ్యామిలీ..
నిజానికి వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ కలిసినప్పుడల్లా బాగానే మాట్లాడుకుంటారు. అందుకు ఆ మధ్య వకీల్ సాబ్ మూవీయే సాక్ష్యం. ఆ తర్వాత కూడా అంటే ఓ దాదాపు రెండేళ్ల క్రితం విశ్వక్ సేన్ మూవీ వేడుకలో ఇద్దరూ కలిశారు.. కూర్చున్నారు… మాట్లాడుకున్నారు కూడా.. అంత వరకు ఎందుకు మా ఎన్నికల్లో పోటీ చేస్తానంటే.. మెగా ఫ్యామెలీ మొత్తం ప్రకాశ్ రాజ్ వెనుకే నిల్చొంది కదా. దాన్ని ఎలా మర్చిపోతాం. అయితే అప్పట్లో పవన్ ప్రకాశ్ రాజ్‌కే ఓటేశారా.. లేదా అన్నది క్లారిటీ లేని అంశంగానే మిగిలిపోయింది.
అయితే.. ఇద్దరూ ఎప్పటికప్పుడు టామ్ అండ్ జెర్రీలా మారిపోతుంటారు..? తాజాగా తిరుమల లడ్డూ వివాదం సందర్భంలో మరోసారి ఇద్దరి మధ్య రచ్చ రంబోలా నడుస్తోంది. పవన్ చేసిన ట్వీట్‌కి ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అవడం.. ఆ తర్వాత దానికి పవన్ కౌంటరేస్తే… అదే స్థాయిలో మళ్లీ ప్రకాశ్ రాజ్ కౌంటర్ వెయ్యడం మీడియాకు టన్నుల కొద్దీ ముడిసరుకు అందిస్తోంది. ప్రకాష్ రాజ్ గంటకో ట్వీట్ కౌంటర్‌తో టాలీవుడ్‌లో టెన్షన్ పెంచేస్తున్నారు.
ప్రకాశ్ పోస్టులపై పవన్ అసహనం..
ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా సినిమా వాళ్లు మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగానే ప్రకాశ్‌రాజ్ పోస్టులపై వవన్ అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆయనకు సంబంధం లేని అంశాల్లో ఆయన ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రకాశ్‌రాజ్‌నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్‌రాజ్ అంటే గౌరవం ఉందంటూనే సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు.
పవన్ చేసిన కామెంట్స్‌కి ఈ నెల 30 తర్వాత మాట్లాడతానని చెప్పిన ప్రకాశ్ రాజ్.. అంత వరకు ఆగలేకపోయినట్టున్నారు. అందుకే పరోక్షంగా ట్విట్టర్లో మళ్లీ మాటల యుద్ధం మొదలు పెట్టేశారు. బుధవారం జస్ట్ ఆస్కింగ్ అంటూ చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడం ఎందుకో అంటూ ఒక ట్వీట్..మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్? అంటూ ఇంకో ట్వీట్ చేసి… ఇన్ డైరక్ట్‌గా పవన్ కల్యాణ్‌ను కెలికేశారు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ వార్ మొదలయ్యింది.
చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్… #justasking
— Prakash Raj (@prakashraaj) September 25, 2024
గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్? #justasking
— Prakash Raj (@prakashraaj) September 26, 2024
గతంలో పవన్ నిర్ణయంపై ప్రకాశ్ విమర్శలు..
నిజానికి ప్రస్తుతం పవన్ కల్యాణ్-ప్రకాశ్ రాజ్ ఇద్దరూ రైలు పట్టాల్లా… ఒకరికొకరు కలిసి వెళ్లలేని ప్రయాణం చేస్తున్నారు. బీజేపీ అంటే చాలు ప్రకాశ్ రాజ్‌కి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఆయన ఎక్స్ ప్లాట్ ఫాంలో చూస్తే… బీజేపీని, ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ చేసే ట్వీట్లకు లెక్కే ఉండదు. ఎట్ ద సేమ్ టైం… జన సేన పార్టీగా పదేళ్లుగా పార్టీ నడుపుతున్న పవన్ కల్యాణ్ ప్రకాశ్ రాజ్‌కి ఏ మాత్రం నచ్చని బీజేపీకి సపోర్ట్ చేస్తూ.. కూటమిలో కలుపుకొని ఏపీలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో వీళ్లద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనడానికి ఓ రకంగా ఇదే కారణం. జనసేన బీజేపీ మద్దతిస్తామని ప్రకటించిన సమయంలో కూడా ప్రకాశ్ రాజ్ గట్టిగానే విమర్శించారు. ఏకంగా ఊసరవెల్లి అంటూ పవన్‌ను టార్గెట్ చేశారు.
పవన్ కల్యాణ్‌కు ఏమైందో నాకు నిజంగా అర్ధం కావండం లేదు. ఆయన నిర్ణయం నన్ను నిరుత్సాహానికి గురి చేసింది. మీరు నాయకుడు. మీకంటూ జనసేన పార్టీ ఉంది. మీరు ఇంకో నాయకుడికి మద్దతు ఎందుకు తెలుపుతున్నారు? మీ ఓట్ షేర్ ఏంటి? బీజేపీ ఓట్ షేర్ ఏంటి..? మీరు ఆయన భుజాలెక్కడం ఏంటి? 2014లో ఇంద్రుడు – చంద్రుడు అని మీరేనంటూ మద్దతు తెలిపారు. వారు ద్రోహం చేశారని గత ఎన్నికల్లో అన్నారు. మళ్లీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నారు. మీరు ఇన్ని సార్లు మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలంటూ అప్పట్లో ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో వైరల్ అయ్యింది.
అంతేకాదు… ఏపీలో టీడీపీ- బీజేపీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత మోదీ-చంద్రబాబు ఒకే వేదికపై కలిసి పలకరించుకున్న సందర్భంలోనూ ప్రకాశ్ రాజ్ అతి వినయం ధూర్త లక్షణం అంటూ ట్వీట్ చేశారు. అప్పట్లో అది కూడా బాగా వార్తల్లో వచ్చింది.
There is an apt saying :- “Athi Vinayam Dhoortha Lakshanam ”.. ಬಲ್ಲವರು ಹೇಳಿದ್ದಾರೆ.. “ ಅತಿ ವಿನಯಂ .. ಧೂರ್ತ ಲಕ್ಷಣಂ” #justasking https://t.co/JwHApO6mLr
— Prakash Raj (@prakashraaj) June 13, 2024
ఈ రచ్చ ఆగదా..?
మొదట నుంచి పాలిటిక్స్‌లో మతం విషయంలో ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూనే వచ్చారు. ముందే చెప్పినట్టు ఆ విషయంలో ఫస్ట్ టార్గెట్ బీజేపీనే. కన్నడ రాజకీయాల్లో ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్‌తో సత్సంబంధాలే నెరుపుతూ వచ్చారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేశారు కూడా. అదే ప్రకాశ్ రాజ్‌కి 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామెలీ మరీ ముఖ్యంగా నాగబాబు కంప్లీట్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదే నాగబాబు జనసేన పార్టీకి సెక్రటరీ జనరల్‌గా కూడా ఉన్నారు. అయినా ప్రకాశ్ రాజ్ లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది.
నిజానికి తిరుపతి లడ్డూ విషయంలో తొలిసారి పవన్ కల్యాణ్ ట్వీట్ చేసినప్పుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ మరీ అంత వైలెంట్‌గా ఏం లేదు.. అలాగని ఎత్తిపొడిచినట్టు లేదని కూడా చెప్పలేం. కానీ దానికి పవన్ కల్యాణ్ రియాక్ట్ అవడం… ఆ తర్వాత ఛాన్స్ దొరికింది కదా అని ప్రకాశ్ రాజ్ కూడా రియాక్టయ్యారు. అక్కడ నుంచి ఆయన కంటిన్యూ చేస్తునే ఉన్నారు. బహుశా ఆయన ముందే చెప్పినట్టు 30 తేదీన ఇండియాకి వచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఈ రచ్చ కొనసాగేలానే కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో పవన్‌ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా వైసీపీకి ప్రకాశ్ రాజ్ హెల్ప్ చేస్తున్నారని కూడా పవన్ అభిమానులు అనుకుంటున్నారు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి