AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ మహిళకు విచిత్రమైన వ్యసనం.. అందమైన పెదవుల కోసం 52 లక్షలు ఖర్చు

ప్రపంచంలో చాలా మంది స్త్రీలు తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి సర్జరీని కూడా ఆశ్రయిస్తారు. ఇందుకోసం ఎంత డబ్బులు ఖర్చు చేయడానికి అయినా వెనుకాడరు. అందంగా కనిపించాలని తృష్ణ.. సర్జరీలపై మనసు పారేసుకున్న వారు డబ్బుల ఖర్చు గురించి వెనుకాడరు. అలాంటి ఒక మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆమె అందంగా కనిపించాలని కోరుకుంది. ఇందు కోసం ఆమె అనేక రకాల సౌందర్య చికిత్సలు చేయించుకోవడం ప్రారంభించింది. లక్షల రూపాయలు ఖర్చు చేసింది.

Viral News: ఈ మహిళకు విచిత్రమైన వ్యసనం.. అందమైన పెదవుల కోసం 52 లక్షలు ఖర్చు
Austrian WomanImage Credit source: Instagram/hookedonthelookshow
Surya Kala
|

Updated on: Jul 01, 2024 | 12:54 PM

Share

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు వివిధ రకాల క్రీములు రాసుకుంటారు. మరికొందరు మహిళలు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తారు. అదే సమయంలో అందం పెంచుకోవడానికి సర్జరీ చేయించుకునే యువతలు కూడా ఉన్నారు. ప్రపంచంలో చాలా మంది స్త్రీలు తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి సర్జరీని కూడా ఆశ్రయిస్తారు. ఇందుకోసం ఎంత డబ్బులు ఖర్చు చేయడానికి అయినా వెనుకాడరు. అందంగా కనిపించాలని తృష్ణ.. సర్జరీలపై మనసు పారేసుకున్న వారు డబ్బుల ఖర్చు గురించి వెనుకాడరు. అలాంటి ఒక మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆమె అందంగా కనిపించాలని కోరుకుంది. ఇందు కోసం ఆమె అనేక రకాల సౌందర్య చికిత్సలు చేయించుకోవడం ప్రారంభించింది. లక్షల రూపాయలు ఖర్చు చేసింది.

సోషల్ మీడియాలో ‘ఫెటిష్ బార్బీ’గా పిలుచుకునే ఈ మహిళ ఆస్ట్రియా నివాసి. ఇటీవల ఆమె బొటాక్స్ , ఫిల్లర్‌లకు బానిసైనట్లు అంగీరించింది కూడా. ఆమె బోటాక్స్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల ఆమె పెదవులు వింతగా బొద్దుగా మారాయి. బుగ్గలు లోతుగా పోయాయి.

చిన్నవయసులోనే సర్జరీలకు బానిస

LadyBibleకి చెందిన నివేదిక ప్రకారం ఫెటిష్ బార్బీ చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే అందంగా కనిపించాలని సౌందర్య చికిత్స ఈ ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో ఆమె చాలా మేకప్ వేసుకునేది. అంతేకాదు ముక్కు, చెవులకు చాలా కుట్లు వేసుకుంది. అయితే దీని తర్వాత ఆమెకు ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా రూపాన్ని మార్చగల బొటాక్స్ , ఫిల్లర్స్ గురించి తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘హుక్డ్ ఆన్ ది లుక్’ షోలో ఫెటిష్ బార్బీ తన బుగ్గలు, గడ్డం, ముక్కు, పెదవులపై ఫిల్లర్లు వేసుకున్నట్లు అంగీకరించింది. అంతేకాదు స్కిన్ ముడుతలను తొలగించడానికి తన మొత్తం ముఖంపై బొటాక్స్ అప్లై చేసినట్లు కూడా ఆమె చెప్పింది.

ఇవి కూడా చదవండి

మూడు రెట్లు పెద్దవిగా మారిన పెదవులు

ఫెటిష్ బార్బీ మాట్లాడుతూ తనకు ఎప్పుడూ పెద్ద పెదవులు కావాలని కోరిక అని.. అందుకే ఫిల్లర్ల సహాయం తీసుకుని తన పెదవులను సాధారణం కంటే మూడు రెట్లు పెద్దదిగా, మందంగా మార్చుకున్నానని చెప్పింది. తన లుక్‌ని మెయింటైన్ చేయాలంటే ప్రతి మూడు నెలలకోసారి ఫిల్లర్లు తీసుకోవాల్సిందేనని చెప్పింది. ఇలా ఫిల్లర్లు, బొటాక్స్ కోసం ఇప్పటివరకు దాదాపు 50 వేల పౌండ్లు అంటే మన దేశ కరెంసిలో దాదాపు 52 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..