AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్వర్గంలో భూమిని అమ్ముతున్న ఫాస్టర్.. దేవుడిని కలిసి పర్మిషన్ తీసుకున్నానంటూ ప్రకటన

స్వర్గంలో కూడా భూమిని కొంటారని అమ్ముతారు అని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును అలాంటి వింత ఘటనకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రజలను షాక్‌కు గురి చేస్తుంది కూడా.. వాస్తవానికి మెక్సికోలోని ఒక చర్చి దీని ప్రత్యేక ఆఫర్‌తో ప్రస్తుతం వార్తల్లో చోటు చేసుకుంది. ఆ ఆఫర్ ఏమిటంటే స్వర్గంలో ప్లాట్లను విక్రయిస్తుంది.

Viral Video: స్వర్గంలో భూమిని అమ్ముతున్న ఫాస్టర్.. దేవుడిని కలిసి పర్మిషన్ తీసుకున్నానంటూ ప్రకటన
Land In HeavenImage Credit source: Pixabay
Surya Kala
|

Updated on: Jul 01, 2024 | 3:06 PM

Share

స్వర్గానికి, నరకానికి సంబంధించిన ఎన్నో విషయాలు గురించి వినడమే కాదు.. కొందరు స్వర్గం నరకం ఉన్నాయని నమ్ముతాయి కూడా.. చెడు పనులు చేస్తే నరకానికి వెళ్లాల్సి వస్తుందని, కాగిన నూనెలో వేయించడం వంటి రకరకాల శిక్షలు విధిస్తారని నమ్మకం.. అదే సమయంలో పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్లి సుఖంగా జీవించవచ్చని చెబుతూనే ఉంటారు. అయితే స్వర్గంలో కూడా భూమిని కొంటారని అమ్ముతారు అని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును అలాంటి వింత ఘటనకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రజలను షాక్‌కు గురి చేస్తుంది కూడా..

వాస్తవానికి మెక్సికోలోని ఒక చర్చి దీని ప్రత్యేక ఆఫర్‌తో ప్రస్తుతం వార్తల్లో చోటు చేసుకుంది. ఆ ఆఫర్ ఏమిటంటే స్వర్గంలో ప్లాట్లను విక్రయిస్తుంది. ఈ చర్చి పేరు ‘ఇగ్లేసియా డెల్ ఫైనల్ డి లాస్ టైంపోస్.. దీనిని ‘చర్చ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ టైమ్స్’ అని కూడా పిలుస్తారు. ఈ చర్చిలోని పాస్టర్ 2017 సంవత్సరంలో దేవునిని వ్యక్తిగతంగా కలుసుకున్నాడట. అప్పుడు అతను స్వర్గంలో భూములను అమ్మడం, కొనడంపై దేవుడి నుంచి ఆమోదం పొందినట్లు పేర్కొన్నాడు. ఎవరైనా స్వర్గంలో స్థలం కొనాలనుకుంటే చదరపు మీటరుకు 100 డాలర్లు అంటే సుమారు 8 వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్ అవుతోంది

నివేదికల ప్రకారం పూజారి ప్రజలకు దేవుని ప్యాలెస్ సమీపంలోని ముఖ్యమైన ప్రదేశాలు, స్వర్గంలో ఒక నిర్దిష్ట స్థలాన్ని కూడా ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఆసక్తికరంగా చర్చి వివిధ మోడ్‌ల ద్వారా చెల్లింపులను కూడా అంగీకరిస్తుంది. వీటిలో PayPal, Google Pay, Visa, MasterCard, American Express వంటి అనేక ఇతర సౌకర్యవంతమైన యాప్స్ ద్వారా కూడా చెల్లింపు చేసి స్వర్గంలో భూమిని కొనుగోలు చేయవచ్చు అని వెల్లడించాడు.

మిలియన్ల డాలర్లు సంపాదించిన చర్చి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ముసుగు ధరించిన పాస్టర్ ను బంగారు కిరణాలతో అందంగా కనువిందు చేస్తున్న విలాసవంతమైన ఇల్లు కూడా కనిపిస్తోంది. ఈ ఇంటిలో నలుగురు కుటుంబ సభ్యులు సంతోషకరంగా జీవించబోతున్నట్లు కనిపిస్తుంది. 2017 నుంచి స్వర్గంలో భూములను విక్రయించడం ద్వారా చర్చి మిలియన్ల డాలర్లను సంపాదించినట్లు తెలుస్తోంది.

సెటైర్‌గా రూపొందించిన వీడియో

అయితే ఈ వీడియో నిజానికి సెటైర్‌గా తయారైందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇది మొదట ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయబడింది. ఇది హాస్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేయడంలో పేరుగాంచింది. అప్పటి నుండి వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడింది. మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు.

ఈ వీడియో ట్విట్టర్‌లో @chude__ అనే IDతో షేర్ చేశారు. నెటిజన్లు వివిధ రకాలైన కామెంట్స్ చేస్తున్నారు. తనకు ఎవరైనా 100 డాలర్లు అప్పుగా ఇస్తే తాను కూడా తన కోసం స్వర్గంలో భూమిని కొనుగోలు చేయాలనీ కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. మరొకరు ఇది ‘శతాబ్దపు అతిపెద్ద జోక్’ అని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..