AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోకి వచ్చి సీరియల్స్ చూస్తూ టైం మరచిపోయిన పాము.. ఆడపామే అంటూ కామెంట్స్

మహిళలు తమకు ఇష్టమైన సీరియల్స్‌ని ఆదరిస్తారు. వాటిని ఎంతో ప్రేమగా చూస్తారు. అయితే సీరియల్స్ విషయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇంట్లోకి వచ్చిన ఓ పాము ఓ వైపున కూర్చుని జీ కన్నడ ఛానెల్‌లో ప్రసారమవుతున్న సీరియల్స్‌ని వరుసగా రెండు గంటల పాటు కదలకుండా చూసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా..

ఇంట్లోకి వచ్చి సీరియల్స్ చూస్తూ టైం మరచిపోయిన పాము.. ఆడపామే అంటూ కామెంట్స్
Snake Watched Tv Serial
Surya Kala
|

Updated on: Jul 01, 2024 | 5:14 PM

Share

బుల్లి తెరపై ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ వచ్చినా సరే సీరియల్స్ కు ఉండే ఆదరణ ఎప్పటికీ చెక్కుచెదరదు. ముఖ్యంగా స్త్రీలకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మహిళల ఆదరణను సొంతం చేసుకున్న సీరియల్స్ ఎప్పుడూ టాప్ రేటింగ్ తో దుసుకుపోతూ ఉంటాయి. సీరియల్స్ చూస్తుంటే ప్రపంచం మునిగిపోయినా మహిళలకు తెలియదని సరదా కామెంట్ చేస్తూ ఉంటారు కూడా. మహిళలు తమకు ఇష్టమైన సీరియల్స్‌ని ఆదరిస్తారు. వాటిని ఎంతో ప్రేమగా చూస్తారు. అయితే సీరియల్స్ విషయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇంట్లోకి వచ్చిన ఓ పాము ఓ వైపున కూర్చుని జీ కన్నడ ఛానెల్‌లో ప్రసారమవుతున్న సీరియల్స్‌ని వరుసగా రెండు గంటల పాటు కదలకుండా చూసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఇది ఆడ పాము అయి ఉంటుందని, అందుకే సీరియల్ చూస్తూ కూర్చుందని ఫన్నీ కామెంట్స్  చేస్తున్నారు నెటిజన్లు

స్నేక్ శివుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు. దీనికి జీ టీవీ అభిమాని అని క్యాప్షన్ ఇచ్చాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఇంట్లోకి ప్రవేశించిన పాము .. తన తల ఎత్తి శరీరం అంతా చుట్టూ కూర్చుని సీరియల్ చూస్తున్నట్లు కనిపిస్తుంది. దాదాపు గంటన్నర పాటు పాము కదలకుండా అక్కడే కూర్చుని టీవీ చూస్తున్నదని ఇంటి యజమాని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

View this post on Instagram

A post shared by Snakeshivu (@snakeshivu)

మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ తో పాటు రకరకాల కామెంట్లు వచ్చాయి. ఈ సీరియల్ ఆడిషన్ కు నాగిని తప్పక వచ్చిందంటూ ప్రేక్షకులు ఫన్నీ కామెంట్స్ రాశారు. అంతేకాదు ఖచ్చితంగా ఈ పాము ఆడపామే అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి