కేవలం రూ. 5లక్షలతోనే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హోమ్.. సొంత ఇంటి కల నెరవేర్చుకున్న దంపతులు

యూట్యూబ్ ద్వారా ఈ ఇంటి గురించి తెలుసుకున్నామని.. స్థానిక మర్పడగ గ్రామంలో ఇదే మాదిరిగా కట్టిన ఇంటిని సందర్శించి కంటైనర్ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు మాత్రమే ఇచ్చామని.. ఫ్యాన్లు, టాయిలెట్ లతో సహా మిగతా పనులు మొత్తం గృహ నిర్మాణ సంస్థ వారే పూర్తి చేసి ఇస్తారని తెలిపారు. దశాబ్దాల కాలం పాటు ఇల్లు చెక్కుచెదరకుండా ఉంటుందన్నారు.

కేవలం రూ. 5లక్షలతోనే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హోమ్.. సొంత ఇంటి కల నెరవేర్చుకున్న దంపతులు
Container House
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 01, 2024 | 3:24 PM

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత నిజమే అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టాలి అంటే కష్టమే. దీనికి తోడు ఈ మధ్యకాలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీనితో మధ్య తరగతి, పేద ప్రజలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. ఈ నేపధ్యంలో ఓ వ్యక్తి అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించి తక్కువ ఖర్చులో అద్భుతమైన ఇంటిని నిర్మించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం సిద్ధిపేట. ఇక్కడ ఒక చిన్నపాటి ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే రూ 30 నుంచి రూ 40 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే సామాన్య, మధ్యతరగతి పేదలు అంత డబ్బును ఖర్చుపెట్టి సొంతింటిని నిర్మించుకోవడం చాలా కష్టతరమని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగింది ఇంటి నిర్మాణంలో కొత్త పోకడలు సంతరించుకుంటున్నాయి. సరికొత్త టెక్నాలజీని ఉపయోగిన్చుకుని పట్టణ పరిధిలోని పారుపల్లివీధిలో గట్టు ప్రవీణ్ కుమార్, గీత అని దంపతులు కంటైనర్ లో ఇంటిని నిర్మించుకున్నారు.

130 గజాల స్థలంలో ఓ కంటైనర్ హోమ్ నిర్మించు కున్నారు. కంటైనర్ హోమ్ లో డబుల్ బెడ్ రూమ్, కిచెన్, బాత్ రూమ్ లను నిర్మించుకున్నట్లు ఇంటి యజమాని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తాను ఓ ప్రైవేటు టీచర్ గా పని చేస్తున్నానని.. తక్కువ ఖర్చుతో ఓ ఇంటిని నిర్మించుకోవాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే కంటైనర్ హోమ్. దీంతో రూ 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి కంటైనర్ హోం ను నిర్మించుకున్నామని ప్రవీణ్ కుమార్ దంపతులు తెలిపారు. ఎందుకంటే కాంక్రీట్ తో ఇల్లు నిర్మించుకోవాలంటే 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే అంత ఖర్చు చేసే స్తోమత మాకు లేదని అందుకే అతి తక్కువ ఖర్చులో అన్ని వసతులతో ఈ కంటైనర్ ఇల్లు నిర్మించుకున్నామని ప్రవీణ్ గీత లు చెప్పారు. ఇప్పుడు తమ ఇల్లు చూస్తే తమకు చాలా సంతోషంగా ఉందని దంపతులు తెలిపారు.

చిన్న కుటుంబం ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ కంటైనర్ హోమ్ లో నివసించవచ్చని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తన భర్త నిర్ణయం మేరకు ఈ ఇంటి నిర్మాణం చేపట్టినట్లు గీత తెలిపారు. యూట్యూబ్ ద్వారా ఈ ఇంటి గురించి తెలుసుకున్నామని.. స్థానిక మర్పడగ గ్రామంలో ఇదే మాదిరిగా కట్టిన ఇంటిని సందర్శించి కంటైనర్ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు మాత్రమే ఇచ్చామని.. ఫ్యాన్లు, టాయిలెట్ లతో సహా మిగతా పనులు మొత్తం గృహ నిర్మాణ సంస్థ వారే పూర్తి చేసి ఇస్తారని తెలిపారు. దశాబ్దాల కాలం పాటు ఇల్లు చెక్కుచెదరకుండా ఉంటుందన్నారు. 5 సంవత్సరాలకి ఒకసారి రంగులు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయన్నారు. తక్కువ బడ్జెట్లో అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఈ కంటైనర్ ఇల్లు బాగుంటుందని ప్రవీణ్, గీత దంపతులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..