ek ped maa ke naam: తల్లితో కలిసి తల్లిపేరుతో మొక్క నాటే కార్యక్రమం మొదలు.. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి..

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారాన్ని ప్రారంభించారు. బుద్ధ జయంతి పార్కులో స్వయంగా ప్రధాని మోడీ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచారం నిర్వహించి మొక్కలు నాటడమే దీని లక్ష్యం.

ek ped maa ke naam: తల్లితో కలిసి తల్లిపేరుతో మొక్క నాటే కార్యక్రమం మొదలు.. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి..
Ek Ped Maa Ke Naam
Follow us
Surya Kala

|

Updated on: Jul 01, 2024 | 1:51 PM

తన మూడవ దఫా మొదటి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమ తల్లితో పాటు లేదా తల్లి పేరు మీద ఒక చెట్టును నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ మాట్లాడుతూ జూలై 1 నుంచి 15వ తేదీలోపు మధ్యప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అంటే అమ్మ పేరుతొ ఒక మొక్క అనే మెగా క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒక్క ఇండోర్‌లోనే 51 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సందర్భంగా భారతదేశంలో అతిపెద్ద ప్లాంటేషన్ ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని ప్రారంభించారు. బుద్ధ జయంతి పార్కులో స్వయంగా ప్రధాని మోడీ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచారం నిర్వహించి మొక్కలు నాటడమే దీని లక్ష్యం.

ఇవి కూడా చదవండి

ఒక రోజులో గరిష్టంగా ఎన్ని చెట్లు నాటరంటే

ఒక రోజులో అత్యధికంగా చెట్లను నాటిన రికార్డు మధ్యప్రదేశ్‌ పేరున ఉంది. 2017లో ఈ రికార్డ్ ను నెలకొల్పింది. అప్పుడు 15 లక్షల మంది వాలంటీర్లు కేవలం 12 గంటల్లో 6.6 కోట్లకు పైగా చెట్లను నాటారు. రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున మొక్కలు నాటడం జరిగింది. ఈ ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. 20 రకాల చెట్లను నాటింది.

మధ్యప్రదేశ్ కంటే ముందు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా చెట్లను నాటిన రికార్డు ఉంది. జూలై 2016లో దాదాపు 8 లక్షల మంది వాలంటీర్లు 24 గంటల్లో 5.04 కోట్ల చెట్లను నాటడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. 2013లో 847,275 చెట్లు నాటి పాకిస్థాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

చెట్లను నాటడం, సంరక్షించడంలో అస్సాం 9 గిన్నిస్‌ రికార్డులు

సెప్టెంబర్-అక్టోబర్ 2023 మధ్య నిర్వహించిన మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో అస్సాం ప్రభుత్వం ఇప్పటి వరకూ 9 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఈ ప్రచారానికి అమృత వృక్ష ఆందోళన అని పేరు పెట్టారు. దీనిని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు కోటి (1,11,17,781)కు పైగా వాణిజ్యపరంగా విలువైన చెట్ల జాతులకు చెందిన మొక్కలు నాటారు.

గౌహతిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్‌లోని పొడవాటి కుండీలలోని మొక్కలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాయి. దాదాపు 3 లక్షల (3,22,444) పాలీ మొక్కలు 22.22 కి.మీ పొడవునా కుండీల వరుసలో నాటారు. దీంతో 24 గంటల్లో ఒకే చోట అత్యధికంగా మొక్కలు పంపిణీ చేసి మూడో రికార్డు సృష్టించారు.

అమృత వృక్ష ఆందోళన కింద 1 కోటి మొక్కలు నాటారు. ఇది ప్రారంభం మాత్రమే.. వచ్చే ఏడాది 3కోట్ల మొక్కలు నాటేందుకు ప్లాన్‌ చేస్తున్నామని హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.

నాలుగో రికార్డు 24 గంటల్లో ఒక బృందం అత్యధిక చెట్లను నాటడం. ఉదల్‌గురి జిల్లా భైరబ్‌కుంద రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 24 గంటల్లో 100 హెక్టార్ల అటవీ భూమిలో 9,21,730 మొక్కలు నాటారు. ఇంతకుముందు 2013లో ఖరోచాన్‌లో పాకిస్థాన్‌ 8,47,275 మొక్కలు నాటి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు. 8,900 మంది బృందం ఒక గంట వ్యవధిలో మొత్తం 3,31,929 మొక్కలు నాటడం ద్వారా రికార్డు సృష్టించారు.

అంతేకాదు అస్సాంలో అతిపెద్ద మొజాయిక్ కుండీలు రికార్డు స్థాపించాయి. ఈ రికార్డు టిన్సుకియా జిల్లాలో 8,563.01 చదరపు మీటర్లలో కుండీలను తయారు చేసి రికార్డ్ సృష్టించారు. ఇందులో అస్సాం మ్యాప్ తయారు చేసి మొజాయిక్ మధ్యలో ఖడ్గమృగాన్ని అవిష్కరించారు.

శివసాగర్‌లో 1,229 మంది బాలికలు కేవలం 58 సెకన్లలో 1,229 అగరు మొక్కలు నాటడం రికార్డు సృష్టించారు. సెప్టెంబర్ 11న ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ , చీఫ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, అస్సాం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతపై ఆన్‌లైన్ లో పాఠాన్ని ప్రసారం చేశారు. దీనిని 70,490 మంది, తరువాత 10 లక్షల మంది ప్రజలు వీక్షించారు. ఇది మరో ప్రపంచ రికార్డు.

అమృత వృక్ష ఆందోళన పోర్టల్‌లో 71,82,358 మంది మొక్కలు నాటుతున్న ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఎనిమిదో రికార్డు సృష్టించారు. మొక్కలు నాటుతామని, వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయడం మరో రికార్డు. చెట్లను నాటడం మరియు రక్షించడం కోసం పర్యావరణ సుస్థిరత ప్రచారం కోసం ఒక నెలలో అత్యధిక సంఖ్యలో ఆన్‌లైన్ ప్రతిజ్ఞలు (47,28,898) చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..