AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వేరొకరితో చనువుగా ఉంటుందనీ.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి!

ఇల్లీగల్ అఫైర్ మరో మహిళ హత్యకు కారణమైంది. తనతో చనువుగా ఉండే మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో.. రియల్ ఎస్టేప్ వ్యాపారి కారుతో గుద్ది మహిళను చంపేశాడు. మృతురాలిని కొమ్మవారి మంజుల(40)గా గుర్తించారు. నిందితుడ్ని చంద్రమౌళిగా గుర్తించారు. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నాం చంద్రమౌళి.. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ పేరుతో..

Hyderabad: వేరొకరితో చనువుగా ఉంటుందనీ.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి!
Uppal Real Estate Businessman Killed A Woman
Peddaprolu Jyothi
| Edited By: Srilakshmi C|

Updated on: Jul 01, 2024 | 3:27 PM

Share

ఉప్పల్‌, జులై 1: ఇల్లీగల్ అఫైర్ మరో మహిళ హత్యకు కారణమైంది. తనతో చనువుగా ఉండే మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో.. రియల్ ఎస్టేప్ వ్యాపారి కారుతో గుద్ది మహిళను చంపేశాడు. మృతురాలిని కొమ్మవారి మంజుల(40)గా గుర్తించారు. నిందితుడ్ని చంద్రమౌళిగా గుర్తించారు. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నాం చంద్రమౌళి.. ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ పేరుతో ఆఫీస్ నడుపుతున్నాడు.

అదే రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో రామంతపూర్‌కి చెందిన కొమ్మవారి మంజుల పనిచేస్తుంది. చంద్రమౌళికి మంజులతో మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పరిచయంతోనే చంద్రమౌళి దగ్గర నుంచి మంజులు రూ.28 లక్షలు తీసుకునట్టు సమాచారం.

అయితే గత 3 నెలల నుంచి మంజుల మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో చంద్రమౌళి ఆమెపై పగ పెంచకున్నాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. ఆపై హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం మద్యం సేవించి మహిళను కారులో ఎక్కించుకుని.. ఉప్పల్ ప్రాంతానికి తీసుకువచ్చాడు. అక్కడే కారుతో ఢీకొట్టి, హత్య చేసి అనంతరం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.