AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide Attacks: నైజీరియాను వణికిస్తున్న వరుస ఆత్మహుతి దాడులు! గంటల వ్యవధిలోనే 4 పేలుళ్లు..18 మంది దుర్మరణం

ఈశాన్య నైజీరియాలో శనివారం ఘోరం జరిగింది. వరుస ఆత్మాహుతి దాడుల్లో ఏకంగా 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని బోర్నో స్టేట్‌లో మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్వోజా పట్టణంలో వరుసగా మూడు పేలుళ్లు సంభవించాయి..

Suicide Attacks: నైజీరియాను వణికిస్తున్న వరుస ఆత్మహుతి దాడులు! గంటల వ్యవధిలోనే 4 పేలుళ్లు..18 మంది దుర్మరణం
Suicide Attacks
Srilakshmi C
|

Updated on: Jun 30, 2024 | 6:30 PM

Share

నైజీరియా, జూన్‌ 30: ఈశాన్య నైజీరియాలో శనివారం ఘోరం జరిగింది. వరుస ఆత్మాహుతి దాడుల్లో ఏకంగా 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని బోర్నో స్టేట్‌లో మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్వోజా పట్టణంలో వరుసగా మూడు పేలుళ్లు సంభవించాయి. తొలుత ఓ ఆస్పత్రిపై ఆత్మాహుతి దాడి జరగా.. ఆ తర్వాత ఓ పెళ్లిలో ఓ మహిళ ఆత్మాహుతికి పాల్పడ్డారు. పెళ్లిలో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మరో మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఇలా మొత్తం మూడు ఆత్మాహుతి దాడులు గంటల వ్యవధిలోనే జరిగాయి. బోర్నో స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (SEMA) తెలిపిన ప్రకారం.. దాదాపు18 మంది మరణించగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో పిల్లలు, గర్భిణీలు, మహిళలు ఉన్నారని ఏజెన్సీ అధిపతి బార్కిండో సైదు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది క్షతగాత్రులను రాజధాని మైదుగురికి తరలించారు. మరో 23 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

గ్వోజాలోని సెక్యూరిటీ చెక్ పోస్టు దగ్గర మరో దాడి జరిగింది. ఈ దాడిలో మిలీషియా సభ్యుడు, అతని ఇద్దరు సహచరులు, ఓ సైనికుడు మరణించారు. అయితే అధికారులు ఈ మరణాలను అధికారికంగా ధృవీకరించలేదు. 2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలోని గ్వోజాను బోకోహరం తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. 2015లో నైజీరియా భద్రతా బలగాలు తిరిగి గ్వోజాను తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.

బోకో హరామ్ అంటే ఏమిటి?

బోకో హరామ్ నైజీరియాలో దివంగత ముస్లిం మతపెద్ద మహమ్మద్ యూసుఫ్ ఆధ్వర్యంలో 2002లో ఏర్పడిన జిహాదీ ఉగ్రవాద సంస్థ. 2009లో ఇది నైజీరియా ప్రభుత్వం, దాని భద్రతా దళాలు, పౌరులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. 2014లో బోకో హరామ్ ఈశాన్య నైజీరియాలోని బెల్జియం పరిమాణంలో ఉన్న గ్వోజాను స్వాధీనం చేసుకుంది. 2015లో నైజీరియా భద్రతా బలగాలు తిరిగి గ్వోజాను తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి బోకోహరం తీవ్రవాదులు గ్వోజాపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఈ దాడుల్లో 40 వేల మంది చనిపోగా, 20 లక్షల మంది వరకు నిరాశ్రయులయ్యారు. వీరి వివాదం పొరుగున ఉన్న నైజర్, కామెరూన్, చాద్‌లకూ వ్యాపించింది. తీవ్రవాదులతో పోరాడటానికి ప్రాంతీయ సైనిక సంకీర్ణాన్ని ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి

బోకో హరామ్‌కు నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే..

ప్రధానంగా దోపిడీలు, దోపిడీలు, కిడ్నాప్, బ్యాంకు దోపిడీలు, పశువుల దొంగతనం, కిరాయి హత్యలు వంటి నేర కార్యకలాపాల ద్వారా నిధులు సమకూర్చుకుంటూ ఉంటారు. నైజీరియన్ మిలిటరీ నుంచి వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైతం ఎత్తుకుపోతుంటారు. వీటితోపాటు స్థానిక బ్లాక్ మార్కెట్ నుంచి కూడా తమకు కావల్సిన అధునితన ఆయుధాలను సమకూర్చుకుంటుంది. బోకో హరామ్ గ్వోజా కోల్పోయినప్పటికీ జిహాదీలు నైజీరియాలోని గ్రామీణ వర్గాలపై దాడి చేస్తూనే ఉన్నాయి. బోకోహరమ్‌ ముఠాకు చెందిన యువతులు, బాలికలను ఆత్మాహుతి దాడులకు ఉపయోగిస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.