AP Mega DSC 2024 District Wise Vacancy: జూన్ 30న ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. జిల్లాల వారీగా ఖాళీలు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో వెలువడనుంది. డీఎస్సీతో పాటు మరోమారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారితోపాటు ఈ ఏడాది కొత్తగా బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కూడా డీఎస్సీ రాసేందుకు అర్హత కల్పించాలనే..
అమరావతి, జూన్ 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో వెలువడనుంది. డీఎస్సీతో పాటు మరోమారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారితోపాటు ఈ ఏడాది కొత్తగా బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కూడా డీఎస్సీ రాసేందుకు అర్హత కల్పించాలనే ఉద్దేశ్యంతో మళ్లీ టెట్ నిర్వహించేందుకు సర్కార్ నిర్ణయించింది. అయితే టెట్ కమ్ డీఎస్సీ నిర్వహిస్తుందా.. లేదంటే టెట్, మెగా డీఎస్సీ వేర్వేరుగా నిర్వహిస్తుందా అనే దానిపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. నోటిఫికేషన్లు మాత్రం ఒకటేసారి వెలువరించి.. కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్ జూన్ 30 లేదా జులై 1న వెలువడే ఛాన్స్ ఉంది. జగన్ సర్కార్ ఎన్నికల ముందు జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేసిన ఎన్‌డీఏ కూటమి సర్కార్.. కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా వెలువడనున్న డీఎస్సీకి ప్రత్యేకంగా రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగే ఐదేళ్లపాటు ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం సమీక్షలు చేస్తోంది. ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తే బాగుంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు సైతం సూచిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై వేచిచూడాల్సిందే.
ఏపీ మెగా డీఎస్సీ 2024కి భర్తీ చేయనున్న పోస్టుల జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
- శ్రీకాకుళం జిల్లాలో పోస్టుల సంఖ్య: 543
- విజయనగరం జిల్లాలో పోస్టుల సంఖ్య: 583
- విశాఖపట్నం జిల్లాలో పోస్టుల సంఖ్య: 1134
- తూర్పు గోదావరి జిల్లాలో పోస్టుల సంఖ్య: 1346
- పశ్చిమ గోదావరి జిల్లాలో పోస్టుల సంఖ్య: 1067
- కృష్ణా జిల్లాలో పోస్టుల సంఖ్య: 1213
- గుంటూరు జిల్లాలో పోస్టుల సంఖ్య: 1159
- ప్రకాశం జిల్లాలో పోస్టుల సంఖ్య: 672
- నెల్లూరు జిల్లాలో పోస్టుల సంఖ్య: 673
- చిత్తూరు జిల్లాలో పోస్టుల సంఖ్య: 1478
- కడప జిల్లాలో పోస్టుల సంఖ్య: 709
- అనంతపురం జిల్లాలో పోస్టుల సంఖ్య: 811
- కర్నూలు జిల్లాలో పోస్టుల సంఖ్య: 2678
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.