Telangana: నాలుగేళ్ల బిడ్డతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. ఏం జరిగిందో?

జగిత్యాల జిల్లాలో ఘోర విషాదం జరిగింది. ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ నాలుగు యేళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘట జగిత్యాల జిల్లాసారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్పల్లి గ్రామానికి చెందిన బొండ్ల మౌనిక అనే వివాహిత నాలుగేళ్ల కూతురితో కలిసి బుధవారం రాత్రి ఊరిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య..

Telangana: నాలుగేళ్ల బిడ్డతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. ఏం జరిగిందో?
Telangana Crime
Follow us

|

Updated on: Jun 27, 2024 | 8:36 PM

జగిత్యాల, జూన్‌ 27: జగిత్యాల జిల్లాలో ఘోర విషాదం జరిగింది. ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ నాలుగు యేళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘట జగిత్యాల జిల్లాసారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్పల్లి గ్రామానికి చెందిన బొండ్ల మౌనిక అనే వివాహిత నాలుగేళ్ల కూతురితో కలిసి బుధవారం రాత్రి ఊరిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో తీవ్రంగా మనస్థాపం చెందిన మౌనిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో గురువారం ఉదయం మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మృతురాలు మౌనిక భర్తను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరో ఘటన.. బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో తల్లీ, కొడుకు మృతి!

ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు జిల్లాలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగి తల్లికొడుకు మృతి చెందారు. జిల్లాలోని ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గురువారం తడి బట్టలు తీగలపై ఆరేస్తుండగా పొరబాటున కరెంట్ వైర్లకు తడి బట్టలు తగిలాయి. దీంతో తల్లీ దొండపాటి నాగరత్నం, ఆమె కుమారుడు రామదాసు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పల్నాడు జిల్లాలో మరో ఘటన.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

పల్నాడు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వినుగొండ మండలం కొత్తపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో.. అందులో ఈ విషాదం జరిగింది. కారులో గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన టీటీడీ విశ్రాంత ఉద్యోగి సోమసి బాలగంగాధర్‌ శర్మ కుటుంబం ప్రయాణిస్తుంది. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలగంగాధర్‌ శర్మ, ఆయన భార్య యశోద, కారు డ్రైవర్‌ మృతి చెందగా.. బాల గంగాధర్‌ శర్మ కుమారుడు హెచ్‌ఎస్‌వై శర్మ, ఆయన భార్య నాగ సంధ్య, వీరి పిల్లలు కార్తిక్‌, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే