Andhra Pradesh: చిట్టితల్లికి కొండంత కష్టం! పసిప్రాణం ఖరీదు రూ.16 కోట్లు.. గుండెల్ని పిండేసే వ్యథ
ఆ పాప వయస్సు తొమ్మిది నెలలు... చూడటానికి చక్కగా, బొద్దుగా ఉంది. ఆ చిరునవ్వు చూస్తే ఎవరైనా ముచ్చట పడాల్సిందే. అటువంటి చిన్నారి పాలు తాగలేకపోతుంది. సరిగా కూర్చోలేకపోతుంది. దీంతో ఆ తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఏమయిందో ఏమోనని అందరి డాక్టర్ల వద్దకు తిరిగారు. విజయవాడ, గుంటూరులో వ్యాధి ఏంటో నిర్థారణ కాలేదు. దీంతో బెంగళూరులోని బాపిస్టు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ..
గుంటూరు, జూన్ 24: ఆ పాప వయస్సు తొమ్మిది నెలలు… చూడటానికి చక్కగా, బొద్దుగా ఉంది. ఆ చిరునవ్వు చూస్తే ఎవరైనా ముచ్చట పడాల్సిందే. అటువంటి చిన్నారి పాలు తాగలేకపోతుంది. సరిగా కూర్చోలేకపోతుంది. దీంతో ఆ తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఏమయిందో ఏమోనని అందరి డాక్టర్ల వద్దకు తిరిగారు. విజయవాడ, గుంటూరులో వ్యాధి ఏంటో నిర్థారణ కాలేదు. దీంతో బెంగళూరులోని బాపిస్టు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ పాపకు స్పైనల్ మస్కులర్ అట్రోపి ఉన్నట్లు నిర్ధారించారు. వివరాల్లోకెళ్తే..
గుంటూరులో నివసించే గాయత్రికి రాజమండ్రికి చెందిన ప్రీతమ్‌తో 2022లో వివాహమైంది. వీరికి తొమ్మిది నెలల పాప ఉంది. పాప పేరు హితైషి అని పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా పాప సరిగా పాలు తాగడం లేదని గాయత్రి గ్రహించింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వీరిద్దరూ పాపని డాకర్ల వద్దకు తీసుకెళ్లారు. అనేక వైద్య పరీక్షల అనంతరం పాపకు ఎస్ఎంఏ ఉందని నిర్ధారించారు. జన్యుపరమైన లోపం వలన ఈ వ్యాధి వస్తుందని చెప్పారు. క్రోమోజోమ్ 5లో సర్వయివల్ మోటార్ న్యూరాన్ మ్యుటేషన్ జరగడంతో ఎస్ఎంఏ ప్రోటీన్ ఉత్పత్తిలో లోపం తెలెత్తుతుంది. దీంతో మోటార్ న్యూరాన్ కణాలు చనిపోయి కండరాలు సరిగా పనిచేయవు. దీంతో మింగలేకపోవడం, నడవలేకపోవడం, కూర్చోలేకపోవడం జరుగుతోందని తెలిపారు.
దాతలు ముందుకు వచ్చి ఈ కింది అకౌంట్ నంబర్ ద్వారా సాయం చేయవచ్చు..
అయితే ఈ వ్యాధికి చికిత్స ఉందని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు సంతోష పడ్డారు. చికిత్స అయితే ఉందని అయితే అందుకు పదహారు కోట్ల రూపాయలు ఖర్చువుతుందని తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు సంతోషం ఆవిరైంది. లక్షల్లో అయితే వైద్యం చేయించుకోగల స్తోమత ఉన్న వీరికి ఏకంగా పదహారు కోట్లు ఖర్చవుతుందని తెలియడంతో వీరి బాధ మరింత పెరిగిపోయింది. తమ బిడ్డకు వైద్యం చేయించుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. తొమ్మిది నెలలున్న పాపకు దాతలు సహకరించి చిరంజీవిగా చేయాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.