AP TET 2024 Results Out: ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ 2024 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్‌) - 2024 పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్ 25) మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్‌ పరీక్షలో 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తం 1,37,904 మంది అభ్యర్థులు..

AP TET 2024 Results Out: ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ 2024 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి
AP TET 2024 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2024 | 2:49 PM

అమరావతి, మార్చి 14:  ఆంధ్రప్రదేశ్‌ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్‌) – 2024 పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్ 25) మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్‌ పరీక్షలో 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తం 1,37,904 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. టెట్ లో అర్హత సాధించని వారికి మళ్లీ టెట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. వీరితోపాటు డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన వారికి కూడా త్వరలో టెట్ నిర్వహిస్తామని, తద్వారా వీరంతా డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ల్యాంగ్వేజ్‌ పండిట్‌ టెట్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సంబంధించి రెస్పాన్స్ షీట్లను ఏపీ విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. అభ్యర్ధనలను స్వీకరించిన అనంతరం ఫైనల్ కీలను సిద్ధం చేసి, తుది ఫలితాలను వెల్లడించింది.

ఏపీ టెట్‌ – 2024 పరీక్షల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పుట్టిన తేదీలను నమోదు చేసి తుది ఫలితాలను తెలుసుకోవచ్చు. కాగా టెట్‌లో సాధించిన మార్కులకు జీవితకాల వ్యాలిడిటీ ఉంటుంది. ఏపీ డీఎస్సీలో ఈ టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

టెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • ముందుగా టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.
  • అనంతరం హోమ్ పేజీలో ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 ఫలితాల లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • లాగిన్ పేజీలో అభ్యర్ధుల వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి
  • వెంటనే స్క్రీన్‌పై ఏపీ టెట్‌ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. భవిష్యత్తు అవసరాల కోసం మార్కులను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున టెట్‌ పరీక్షలు జరిగాయి. ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,67,559 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొదటి సెషన్‌ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరిగాయి. మొత్తం 120 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 2.35లక్షల మంది దీనికి హాజరయ్యారు. టెట్ ఫలితాలు ఈ ఏడాది మార్చి 14న విడుదల కావాల్సి ఉండగా, ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడింది. కొత్త సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ఇన్నాళ్లకు ఫలితాలను వెలువరించారు. జూన్ 1న 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.