APPSC Group 2 Mains Exam: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాంటూ అభ్యర్థనలు.. కారణం ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సిలబస్‌లో మార్పులు చేయడంతోపాటు ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ అభ్యర్ధులు ఆందోళన చేపడుతున్నారు. పరీక్షకు సన్నద్ధమవడానికి..

APPSC Group 2 Mains Exam: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాంటూ అభ్యర్థనలు.. కారణం ఇదే!
APPSC Group 2 Mains Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2024 | 3:14 PM

అమరావతి, జూన్‌ 25: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సిలబస్‌లో మార్పులు చేయడంతోపాటు ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ అభ్యర్ధులు ఆందోళన చేపడుతున్నారు. పరీక్షకు సన్నద్ధమవడానికి మరికొంత కాలంపాటు వాయిదావేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం నిరుద్యోగుల అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోవాలంటూ ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అభ్యర్ధుల విజ్ఞప్తులపై ఏపీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సిందే.

కాగా మొత్తం 899 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించగా.. ఏప్రిల్‌ 10న ఫలితాలు వెలువడ్డాయి. 1:100 నిష్ఫత్తిలో మెయిన్స్‌కు మొత్తం 92,250 మంది అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఇక మెయిన్ పరీక్షకు సంబంధించి జూన్‌ 5 నుంచి 18 వరకూ పరీక్ష కేంద్రం, పోస్టు, జోనల్, జిల్లా ప్రిఫరెన్సులు సమర్పించాలని కమిషన్‌ కోరగా.. అభ్యర్ధులు ఆ మేరకు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. తీరా పరీక్ష సమీపిస్తున్న సమయానికి అభ్యర్ధులు మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేయాలంటూ డిమాండ్‌ చేయడం చర్చణీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!