AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడటమంటే ఇదే.. ‘చెల్లితో భర్త జంప్‌! భర్త తండ్రితో తల్లి జంప్‌’

చేతుల్లో ఏడాది వయసున్న చిన్నారి.. కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు. పుట్టింటికి వచ్చి తల్లికి తన కష్టం చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటే.. అత్తింటి వారి నిర్వాకాన్ని కడిగిపారేస్తానంటూ విసురుగా వెళ్లిన ఆమె తల్లి ఎన్నాళ్లైనా తిరిగి రాలేదు. తల్లి, చెల్లి, భర్త.. ఈ ముగ్గురూ ఏమైపోయారో తెలియక కంగారు పడుతున్న ఆ ఇల్లాలికి ఊహించని ట్విస్టులు ఒకటి తర్వాత ఒకటిగా అందాయి. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో తెలియక చివరకు..

Viral News: కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడటమంటే ఇదే.. 'చెల్లితో భర్త జంప్‌! భర్త తండ్రితో తల్లి జంప్‌'
Woman Complains About Her Husband, Sister And Mother
Srilakshmi C
|

Updated on: Jun 24, 2024 | 6:47 PM

Share

బీహార్, జూన్‌ 24: చేతుల్లో ఏడాది వయసున్న చిన్నారి.. కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు. పుట్టింటికి వచ్చి తల్లికి తన కష్టం చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటే.. అత్తింటి వారి నిర్వాకాన్ని కడిగిపారేస్తానంటూ విసురుగా వెళ్లిన ఆమె తల్లి ఎన్నాళ్లైనా తిరిగి రాలేదు. తల్లి, చెల్లి, భర్త.. ఈ ముగ్గురూ ఏమైపోయారో తెలియక కంగారు పడుతున్న ఆ ఇల్లాలికి ఊహించని ట్విస్టులు ఒకటి తర్వాత ఒకటిగా అందాయి. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో తెలియక చివరకు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణలో పోలీసులకు తెలిసిన నిజం మరో బిగ్‌ బ్రేకింగ్‌ అయ్యింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సక్ర థానా ప్రాంతంలో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఫరీద్‌పూర్ గ్రామానికి చెందిన సుధా కుమారి అనే మహిళకు బోచాహన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరాజీ భగత్ కుమారుడు ఛోటూ అనే యువకుడితో 2021లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కూతురు ఉంది. వివాహానంతరం వీరి కాపురం కొంతకాలంపాటు సజావుగానే సాగింది. గత కొన్ని నెలలుగా హఠాత్తుగా భర్త ఛోటూ సుధా కుమారితో సోదరితో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించాడు. కానీ అలా ఫోన్లలో మాట్లాడుకుంటూ వీరిరువురు ప్రేమలో పడ్డారు. గమనించిన సుధ క్యాజువల్‌గా తీసుకుంది. వీరి సంబంధం ఇంత దూరం వెళ్తుందని ఆమె ఊహించలేదు. కానీ ఓ రోజూ భర్త ఛోటు, సోదరి ఉన్నట్టుండి కనబడకుండా పోయారు.

ఆ తర్వాత ఆరా తీయగా.. భర్త ఛోటూ జూన్‌ 2వ తేదీన తన సోదరిని వివాహం చేసుకుని, ఇద్దరూ కలిసి పారిపోయాడని తెలిసి అవాక్కైంది. దీంతో పుట్టింటికి వెళ్లి తల్లి తల్లి ఫూల్ కుమారికి విషయం చెప్పింది. సంగతేంటో తెలుసుకోవడానికి సుధ తల్లి ఫూల్ కుమారి.. ఆమె అత్తవారింటికి వెళ్లి అసలు సంగతేంటో తేల్చుకుని వస్తానని చెప్పి వెళ్లింది. ఇక్కడే కథలో మరో ట్వి్స్ట్‌ చోటు చేసుకుంది. అలా వెళ్లిన తల్లి ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో సుధ ఆందోళన చెందింది. తల్లి కోసం వెదుక్కుంటూ మెట్టింటికి వెళ్లగా అక్కడ స్థానికులు చెప్పింది విని ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎందుకంటే.. సుధ తల్లి తన మామ బిరజి భగత్‌తో కలిసి గ్రామం విడిచి పారిపోయిందని తెలిసింది. వీరిద్దరు కూడా ఢిల్లీలో నివసిస్తున్నట్లు ఎలాగో తెలుసుకుంది. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి, కట్టుకున్న భర్త ఇద్దరికీ ఫోన్లు చేస్తుంటే ఎవరూ స్పందించడం లేదని.. తన గతేంకానంటూ రోధించింది. తన ఏడాది వయసున్న కూతురితో కలిసి ఇంటింటికి తిరుగుతున్నానని, దయచేసి తనకు సాయం చేయాలని పోలీసులను అభ్యర్ధించింది.

ఇవి కూడా చదవండి

ఇక ఇదంతా విన్న పోలీసులు అవాక్కయ్యారు. సుధా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో వారికి మరో షాకింగ్‌ విషయం తెలిసింది. ఓ ఈవెంట్‌లో పోలీసులకు తారసపడిన చోటూ చెప్పిన మాటలు విని పోలీసులు మరింత ఆశ్చర్యపోయారు. తన భార్య సుధ సోదరిని పెళ్లి చేసుకోమని తన అత్తగారు పదేపదే బలవంతం చేసిందని, అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నానని, బదులుగా కారును కూడా బహుమతిగా ఇస్తానని చెప్పాడు. ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో రాజుకుమార్‌పాల్‌ మీడియాకు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్