AP SSC and Inter Supply Results: టెన్త్‌, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత.. మరో 4 రోజుల్లో మార్కుల మెమోలు

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 42.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,33,591 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 56,836 మంది పాసయ్యారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. బాలురు 72,508 మంది పరీక్షలు రాయగా.. 29,047 (40%) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 61,083 మంది పరీక్షలు రాయగా.. వారిలో 27,789 (45 శాతం) మంది..

AP SSC and Inter Supply Results: టెన్త్‌, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత.. మరో 4 రోజుల్లో మార్కుల మెమోలు
AP SSC and Inter Suplly Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 27, 2024 | 4:49 PM

అమరావతి, జూన్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 42.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,33,591 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 56,836 మంది పాసయ్యారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. బాలురు 72,508 మంది పరీక్షలు రాయగా.. 29,047 (40%) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 61,083 మంది పరీక్షలు రాయగా.. వారిలో 27,789 (45 శాతం) మంది పాసయ్యారు. ఇక జూన్‌ 18న వెలువరించిన సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 74,868 మంది (59 శాతం) ఉత్తీర్ణత పొందారు. 1,27,190 మంది సెకండియర్ పరీక్షలు రాశారు.

పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ కలిపి ఫస్టియర్‌లో 80 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందినట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. సప్లిమెంటరీ ఫలితాల్లో ఎవరికైనా సందేహాలు ఉంటే రీవెరిఫికేషన్‌కు అవకాశం ఇచ్చారు. సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌కు జూన్‌ 28 నుంచి జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్‌ బోర్డు అవకాశం ఇచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. జులై ఒకటి నుంచి షార్ట్‌ మెమోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 62 శాతం ఉత్తీర్ణత.. నాలుగు రోజుల్లోనే మార్కుల మెమోలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా మంత్రి నారా లోకేష్‌ బుధవారమే విడుదల చేశారు. టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,07,883 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 67,115 మంది పాసయ్యారు. 67,740 మంది బాలురు పరీక్షలు రాయగా.. 40,638 (59.99 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. బాలికలు 40,143 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 26,477 (65.96 శాతం) మంది పాసైయ్యారు. మరో నాలుగు రోజుల్లోనే మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఈ సందర్భంగా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 27 నుంచి జులై 1వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్త కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA