Passenger Train Crash: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి నదిలో పడిపోయిన 9 రైలు బోగీలు! వీడియో వైరల్
రష్యాలో బుధవారం (జూన్ 26) ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ కోమి ప్రాంతంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. 9 భోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 70 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్యాసింజర్ రైలు ఆర్కిటిక్ సర్కిల్‌కు ఎగువన ఉన్న మైనింగ్ పట్టణమైన వోర్కుటా నుంచి..
రష్యా, జూన్ 27: రష్యాలో బుధవారం (జూన్ 26) ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ కోమి ప్రాంతంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. 9 భోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 70 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్యాసింజర్ రైలు ఆర్కిటిక్ సర్కిల్‌కు ఎగువన ఉన్న మైనింగ్ పట్టణమైన వోర్కుటా నుంచి దక్షిణ రష్యాలోని నోవోరోసిస్క్ నల్ల సముద్రపు ఓడరేవుకు వెళుతోంది. కోమి రిపబ్లిక్‌లోని ఇంటా అనే చిన్న పట్టణం సమీపంలోకి రాగానే రైలు పట్టాలు తప్పింది. దీంతో తొమ్మిది బోగీలు కోమి నదిలోకి పడిపోయాయి.
ప్రమాద సమయంలో ట్రైన్‌లో మొత్తం 215 మంది ప్రయాణికులు ఉన్నారు. 70 మంది గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కోమి రీజియన్ గవర్నర్ వ్లాదిమిర్ ఉయ్బా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రమాద సమయంలో నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రైలు ట్రాక్‌పై నుంచి బోగీలు.. ట్రాక్‌పక్కన చెల్లాచెదురుగా పడిపోయి ఉండటం చూడవచ్చు.
Passenger train derails in northwestern Russia, leaving 70 injured@KremlinRussia_E #Russia #RussiaTrain #TrainAccident #northwestern #Komi #RIAnewsagency pic.twitter.com/BlIyOqAQJh
— ANAND SHUKLA (@anandshlive) June 26, 2024
ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సంఘటన స్థలంలోని రైలు మార్గంలో భద్రతా ప్రమాణాలను అధికారులు తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాల ధాటికి సంభవించిన వరదల కారణంగా రైలు పట్టాలు కోతకు గురైనట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. రైలు ప్రమాదానికి కారణం ఇదేనని ప్రాధమికంగా విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియా నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.