MISMUN 24 Debate Competition: మియాపూర్‌ ‘మెరు ఇంటర్నేషనల్ స్కూల్’లో డిబేట్‌ కాంపిటీషన్స్‌ షురూ.. నేటి నుంచి 3 రోజులపాటు వాడీవేడి చర్చలు

విద్యార్థులకు చట్టసభలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని దాని దృష్టిలో ఉంచుకొని మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో చట్టసభలపై, అంతర్జాతీయ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా మోడరన్ యునైటెడ్ నేషన్ (MISMUN 24) పేరిట పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ మేఘనా రావు జూపల్లి తెలిపారు. మియాపూర్ మెరు స్కూల్‌లో..

MISMUN 24 Debate Competition: మియాపూర్‌ 'మెరు ఇంటర్నేషనల్ స్కూల్'లో డిబేట్‌ కాంపిటీషన్స్‌ షురూ.. నేటి నుంచి 3 రోజులపాటు వాడీవేడి చర్చలు
MISMUN 24 Debate and Discussion Competition
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2024 | 5:09 PM

మియాపూర్, జూన్‌ 28: విద్యార్థులకు చట్టసభలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని దాని దృష్టిలో ఉంచుకొని మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో చట్టసభలపై, అంతర్జాతీయ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా మోడరన్ యునైటెడ్ నేషన్ (MISMUN 24) పేరిట పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ మేఘనా రావు జూపల్లి తెలిపారు. మియాపూర్ మెరు స్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బ్రిటిష్ కౌన్సిల్ హై కమిషనర్ మిస్టర్ గ్యారత్ ఒవెన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాదులో ఉన్న 40 పాఠశాలల నుంచి దాదాపు 300 విద్యార్థులు ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. మొత్తం మూడు రోజులు పాటు జరిగే ఈ డిబేట్ అండ్ డిస్కషన్ కాంపిటీషన్స్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విజేతలుగా నిర్ణయించి, పారితోషకం అందజేయనున్నట్లు మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ మేఘనా రావు తెలిపారు.

MISMUN 24 అనేది దౌత్యం, వైవిధ్యం కలిగిన చర్చావేదిక. వివిధ పాఠశాలలు, వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులను ఒకే చోట చేర్చి వైవిధ్యం, సమగ్రతను పెంపొందిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ శుక్రవారం (జూన్ 28) ఘనంగా ప్రారంభమైంది. స్కూ్‌ల్‌ ప్రిన్సిపల్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌తో ఈవెంట్‌ ప్రారంభమైంది. అనంతరం స్కూల్‌ ఫౌండర్‌ మేఘనా జి జూపల్లి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్ధులు విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా తమ ఆలోచనలు పంచుకోవాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ గారెత్ విన్ ఓవెన్ అంతర్జాతీయ సంబంధాల పట్ల తన అభిప్రాయాలను పంచుకున్నారు. దౌత్య విధానంలో యేళ్ల తరబడి పొందిన తన అనుభవాలను పంచుకున్నారు. చిన్నచిన్న వాటి కోసం ఎప్పటికీ రాజీపడకూడదని విద్యార్ధులను తన స్పూర్తిదాయకమైన మాటలతో ప్రేరేపించారు.

ఈ ఏడాది MISMUN 24లోని కమిటీలలో UNHRC, UNSC, ECOSOC, DISEC, WHO, NATO, లోక్‌సభ, CCC ఉన్నాయి. ఈ కార్యక్రమం జరిగే మూడు రోజుల్లో వివిధ అంశాలు చర్చించనున్నారు. ఈ చర్చలు డెలిగేట్‌లకు కఠినమైన చర్చలలో పాల్గొనడానికి, వినూత్న పరిష్కారాలను ప్రతిపాదించడానికి, ప్రపంచ సమస్యలపై పరిష్కారాలను కనుగొనడంలో సహకరించడానికి ఓ వేదికగా నిలవనున్నాయి. MISMUN 24 డిబేట్ అండ్ డిస్కషన్ కాంపిటీషన్స్‌ రేపటి యువతరంలో దౌత్యం, విమర్శనాత్మక దృక్పధం, సహకార నైపుణ్యాలను పెంపొందించడంలో తోడ్పాటునందిస్తుంది.

ఇవి కూడా చదవండి

కాగా మియాపూర్, తెల్లాపూర్‌లో ఉన్న మేరు ఇంటర్నేషనల్ స్కూల్.. విద్యార్ధుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చదిద్దడంలో పేరుగాంచిన ప్రముఖ విద్యా సంస్థ. అకడమిక్ ఎక్సలెన్స్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులను జీవితంలోని అన్ని అంశాలలో రాణించేలా కృషి చేస్తుంది. మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌లో నర్సరీ నుండి గ్రేడ్ 12 వరకు ఉంటుంది. ఇక్కడ విద్యార్ధులకు సీబీఎస్సీ, కేంబ్రిడ్జ్ సిలబస్‌ను బోధిస్తారు. ఇతర వివరాలు తెలుసుకోవడానికి మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే