AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రైల్వే స్టేషన్‌లో అయోమయంగా కనిపించిన ప్యాసింజర్.. అతని బ్యాగ్ చెక్ చేయగా..

అస్సలు భయం, భక్తి లేదు. కేటుగాళ్లు పోలీసులను పెద్ద సీరియస్‌గా తీసుకుంటున్నట్లు లేదు. ఏకంగా బస్సులు, రైళ్లలోనే అక్రమ కార్యకలాపాలు షురూ చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్‌లో ఓ నిందితుడు పట్టుబడ్డాడు.

Hyderabad: రైల్వే స్టేషన్‌లో అయోమయంగా కనిపించిన ప్యాసింజర్.. అతని బ్యాగ్ చెక్ చేయగా..
Secunderabad Railway Station
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2024 | 5:51 PM

Share

కొంచెం కూడా భయం లేదు. పోలీసులకు చిక్కితే కఠిన శిక్ష పడుతుంది అన్న బెరుకు లేదు. ఏదేచ్చగా అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారు కొందరు. తమకు పాడు పనులకు వాహకాలుగా ఆర్టీసీ బస్సులు, రైళ్లను వినియోగించుకోవడం విస్మయాన్ని కలిగించే విషయం. మొన్నటివరకు సార్వత్రిక ఎన్నికల హడావిడి ఉండటంతో.. పోలీసులు విసృత తనిఖీలు చేసేవారు. దీంతో గంజా పెడ్లర్లు జంకారు. కొన్నాళ్లు ఈ దందాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన 10 రోజుల తర్వాత నుంచి మళ్లీ రెచ్చిపోవడం మొదలెట్టారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడుతున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం.

తాజాగా సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీల్లో అంతర్‌ రాష్ట్ర గంజాయి రాకెట్‌ సభ్యుడిని అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.3.50 లక్షల విలువైన 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన బహన్ స్వల్‌సింగ్ (38) అనే నిందితుడు ఒడిశా నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తుండగా అరెస్టు చేసినట్లు జీఆర్‌పీ సికింద్రాబాద్ డివిజన్ డీఎస్పీ ఎస్‌ఎన్ జావేద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. బహన్‌తో పాటు వచ్చిన మరో నిందితుడు భరత్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వీరిద్దరూ బుధవారం ఒడిశాలోని మునిగూడ అటవీ ప్రాంతం నుంచి సికింద్రాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయించేందుకు ఓ వ్యక్తిని ఎండు గంజాయిని సేకరించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. రైళ్లలో మత్తు పదార్థాల రవాణాను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు డీఎస్పీ చెప్పారు. త్వరలో డాగ్ స్క్వాడ్‌కు ట్రైనింగ్ ఇచ్చి.. గంజాయి స్మగ్లర్ల బెండు తీస్తామని ఆయన చెప్పారు. (Source)

ఇక రాష్ట్రంలో డ్రగ్స్ నివారనే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. డ్రగ్స్ రవాణా, వినియోగంపైన ఉక్కుపాదం మోపాలని.. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. డ్రగ్స్ వెనక ఎంతటివారు వెనక్కి తగ్గొద్దని.. పోలీసులకు సీఎం క్లియర్‌గా చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌