TGPSC Group 1 Result Date: త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు.. 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక

తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు త్వరలో వెడుదలకానున్నాయి. ఫలితాల వెల్లడికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ప్రిలిమినరీ పరీక్షకు జూన్‌ 9న నిర్వహించగా.. ఇటీవల ఓఎంఆర్‌ ఇమేజింగ్‌ పత్రాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాత స్వీకరణ అనంతరం..

TGPSC Group 1 Result Date: త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు.. 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక
TGPSC Group 1 Result Date
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2024 | 5:49 PM

హైదరాబాద్‌, జూన్‌ 28: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు త్వరలో వెడుదలకానున్నాయి. ఫలితాల వెల్లడికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ప్రిలిమినరీ పరీక్షకు జూన్‌ 9న నిర్వహించగా.. ఇటీవల ఓఎంఆర్‌ ఇమేజింగ్‌ పత్రాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాత స్వీకరణ అనంతరం త్వరలోనే తుది కీ విడుదల చేసి, ఆ వెనువెంటనే అతి ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడించేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఇచ్చిన షెడ్యూలు ప్రకారం అక్టోబరులో మెయిన్‌ పరీక్షలు నిర్వహించేందుకు కనీసం మూడు నెలల గడువు ఉండేలా ప్రిలిమినరీ ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఆ ప్రకారంగా చూస్తూ జులై మొదటి వారంలో గ్రూప్‌ 1 ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తే మెయిన్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సరిపడా సమయం లభిస్తుందని కమిషన్‌ భావిస్తోంది.

కాగా మొత్తం 563 గ్రూప్1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో.. జూన్ 9న నిర్వహిమచిన ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది (74.86 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. దాదాపు లక్ష మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరుకాలేదు. ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల అనంతరం 1:50 చొప్పున మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్‌ పరీక్షకు మొత్తం 28,150 మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు అక్టోబర్‌ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు హైదరాబాద్‌ పరిధిలో జరగనున్నాయి. ప్రతి పేపర్‌కు మూడు గంటల వ్యవధి ఉంటుంది. ఒక్కోపేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు.

ఏపీ పీజీ సెట్‌ 2024 ఫలితాలు విడుదల.. ర్యాంకు కార్డు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీ పీజీసెట్‌-2024 ఫలితాలు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్, సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి శశిభూషణరావు విడుదల చేశారు. ఈసెట్‌ పరీక్షకు 33,865 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. వారిలో 29,908 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో 18,467 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 6,736 అబ్బాయిలు, 11,731 మంది అమ్మాయిలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఏపీ పీజీసెట్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ పీజీసెట్ 2024 ర్యాంక్‌ కార్డు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే