AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: హనుమకొండలో రోడ్డుపై స్కూల్‌ బస్‌ బోల్తా.. సమయస్పూర్తితో తప్పించుకున్న విద్యార్ధులు! వీడియో వైరల్

హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో గురువారం సాయంత్రం ఏకశిలా పాఠశాలకు చెందిన స్కూలు బస్సు పిల్లలతో వెళ్తుంది. స్కూల్‌ సమయం ముగియడంతో పిల్లలను దించడానికి వెళ్తుంది. ఈ క్రమంలో కమలాపూర్‌ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై యూటర్న్‌ తీసుకుంటుంది. ఇంతలో అనుకోని రీతిలో అటుగా ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. బస్సు వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు దానిని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా..

Watch Video: హనుమకొండలో రోడ్డుపై స్కూల్‌ బస్‌ బోల్తా.. సమయస్పూర్తితో తప్పించుకున్న విద్యార్ధులు! వీడియో వైరల్
School Bus Accident At Hanamkonda
Srilakshmi C
|

Updated on: Jun 28, 2024 | 8:31 PM

Share

మియాపూర్, జూన్‌ 28: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై యూ టర్న్‌ తీసుకుంటున్న స్కూల్‌ బస్సును వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు రోడ్డుకు అడ్డుగా పడిపోయింది. ఇందుకు సంబంధించిన షాకింగ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే..

హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో గురువారం సాయంత్రం ఏకశిలా పాఠశాలకు చెందిన స్కూలు బస్సు పిల్లలతో వెళ్తుంది. స్కూల్‌ సమయం ముగియడంతో పిల్లలను దించడానికి వెళ్తుంది. ఈ క్రమంలో కమలాపూర్‌ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై యూటర్న్‌ తీసుకుంటుంది. ఇంతలో అనుకోని రీతిలో అటుగా ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. బస్సు వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు దానిని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వెంటనే బస్సు ముందు వైపు ఉన్న అద్దాలు పగలగొట్టేందుక ప్రయత్నించాడు. ఇంతలో బస్సు కిటికీల్లోంచి దూకిన ఇద్దరు విద్యార్థులు అతనికి సహాయం చేయడంతో అద్దం పగిలింది. దీంతో ముందు అద్దం తొలగించి.. బస్సులో ఉన్న మిగతా విద్యార్థులు ఒక్కొక్కరికిగా బయటకు వచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలినవారంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు బస్సును ఢీకొట్టిన కారులోని ప్రయాణికులు ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాద సమయంలో రోడ్డుకి సమీపంలో ఉన్న ఓ షాప్‌లోని సీసీటీవీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.