AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కదులుతున్న రైలుపై నీళ్లు చిమ్మిన ఆకతాయిలు.. ట్రైన్ ఆపి చితగ్గొట్టిన ప్రయాణికులు! వీడియో

చేతిలోకి ఫోన్‌ వచ్చిన తర్వాత ఓవర్ నైట్ స్టార్లు అయ్యేందుకు కొందరు ఆకతాయిలు చేసే పనులకు హద్దూ అదుపూ లేకుండాపోతుంది. తాజాగా కొందరు ఆకతాయిలు కాలువ పక్కనున్న రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న రైలుపై బైకుతో నీటిని చిమ్మారు. తామేం చేసినా రైలు ఆగదని భావించి తెగ సంబరపడిపోయారు. కానీ ఊహించని రీతిలో రైలు సెకన్ల వ్యవధిలో ఆగింది. ఆ తర్వాత జరిగింది చూస్తే నవ్వాగదు. ఈ విచిత్ర ఘటన..

Watch Video: కదులుతున్న రైలుపై నీళ్లు చిమ్మిన ఆకతాయిలు.. ట్రైన్ ఆపి చితగ్గొట్టిన ప్రయాణికులు! వీడియో
Youth Splash Water On Moving Train
Srilakshmi C
|

Updated on: Jun 28, 2024 | 8:30 PM

Share

ఇస్లామాబాద్‌, జూన్‌ 28: చేతిలోకి ఫోన్‌ వచ్చిన తర్వాత ఓవర్ నైట్ స్టార్లు అయ్యేందుకు కొందరు ఆకతాయిలు చేసే పనులకు హద్దూ అదుపూ లేకుండాపోతుంది. తాజాగా కొందరు ఆకతాయిలు కాలువ పక్కనున్న రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న రైలుపై బైకుతో నీటిని చిమ్మారు. తామేం చేసినా రైలు ఆగదని భావించి తెగ సంబరపడిపోయారు. కానీ ఊహించని రీతిలో రైలు సెకన్ల వ్యవధిలో ఆగింది. ఆ తర్వాత జరిగింది చూస్తే నవ్వాగదు. ఈ విచిత్ర ఘటన పాకిస్థాన్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

పాకిస్థాన్‌లో ఓ కాలువ వద్ద కొందరు యవకులు తక్కువలోతున్న కాలవలో బైక్‌ను స్టార్ట్‌ చేసి రైల్వే ట్రాక్‌పైకి నీళ్లు చిమ్మేలా సెట్‌ చేశారు. అనంతరం అటుగా వచ్చిన రైలు పట్టాలపై నుంచి దూసుకుపోసాగింది. ఫ్రాంక్‌ కోసం వీడియో తీస్తున్న ఆకతాయిలు నీళ్లు నేరుగా రైలులోని ప్రయాణికులపై పడేలా సెట్‌ చేశారు. రైలు ఆగదని భావించి తాము చేస్తున్న పనికి గంతులు వేస్తూ సంబరపడ్డారు. కానీ అనూహ్యంగా రైలు ఆగడంతో వారి ప్లాన్‌ బెడిసికొట్టింది. రైలు ఇంజిన్‌పై నీరు పడటంతో ప్రమాదకరంగా భావించిన సిబ్బంది రైలును నిలిపివేశారు. రైలు ఉద్యోగులతోపాటు ఆగ్రహించిన ప్రయాణికులు రైలు దిగి పారిపోతున్న ఆకతాయిలను పట్టుకుని దేహశుద్ధి చేశారు. రైలులోని పోలీసులు బైకును స్వాధీనం చేసుకుని అదే ట్రైన్‌లో ఎక్కించుకుని చక్కాపోయారు.

ఇవి కూడా చదవండి

కొంతసేపటి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది. యువకుల్లో పిల్లలు కూడా ఉన్నారు. తమ బైకును రైలులో తీసుకుపోతున్న పోలీసులను ఏమీ చేయలేక.. తీర రైలు కదలిన తర్వాత ఉక్రోషంతో రళ్లు విసిరి కోపాన్ని ప్రదర్శించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.