AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఏ అంశపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం’.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

నీట్ పేపర్ లీకేజీపై శుక్రవారం పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. సభా కార్యక్రమాలు ముందుకు సాగలేదు. రూల్ 267 కింద చర్చకు ప్రతిపక్షం పట్టుబడింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను నిలదీసింది. విపక్షాలు సభా సాంప్రదాయలను గౌరవిస్తూ వ్యవహరిస్తే ఏ అంశపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.

'ఏ అంశపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం'.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan
Srikar T
|

Updated on: Jun 28, 2024 | 5:26 PM

Share

నీట్ పేపర్ లీకేజీపై శుక్రవారం పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. సభా కార్యక్రమాలు ముందుకు సాగలేదు. రూల్ 267 కింద చర్చకు ప్రతిపక్షం పట్టుబడింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను నిలదీసింది. విపక్షాలు సభా సాంప్రదాయలను గౌరవిస్తూ వ్యవహరిస్తే ఏ అంశపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలు ప్రతిపక్షాల మాటలతో వాడివేడిగా జరిగాయి. ఒక సమయంలో సభ పూర్తిగా స్తంభించింది. సభ ప్రారంభమైన వెంటనే నీట్‌ పేపర్‌ లీక్‌పై విపక్షాల ఎంపీలు రచ్చ చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో, లోక్‌సభ, రాజ్యసభ సభ రెండింటినీ పదేపదే వాయిదా వేయవలసి వచ్చింది.

అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఈ చర్చ సభా సాంప్రదాయలకు అనుగుణంగా జరగాలని అన్నారు. ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. దేశం పట్ల, యువత పట్ల ఇలాంటి అంశాలపై చర్చించడం తమ బాధ్యత అని గుర్తు చేశారు. మొదటి నుంచి ఇదే అంశాన్ని చెబుతున్నామని తెలిపారు. ఇప్పటికే నీట్ పరీక్షకు సంబంధించిన లీకేజీలపై చర్యలు ప్రారంభమయ్యాయని, సీబీఐ దీనిపై దర్యాప్తు చేపట్టిందన్నారు. ఇందులో ఎంతటి వారున్నప్పటికీ ఎవ్వరినీ విడిచిపెట్టబోమని విద్యార్థులకు భరోసా ఇస్తున్నానని ఆయన హామీ ఇచ్చారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

ఈ అంశాన్ని రాజకీయాలకు దూరంగా..

దీంతో పాటు సభలో శాంతిభద్రతలు కాపాడాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. దీనిపై విచారణ సాగుతోందని.. దీంతో పాటు ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు దూరంగా ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్ష నేతను కూడా కోరుతున్నానన్నారు. అయితే సభలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొనడంతో లోక్‌సభ కార్యకలాపాలను రోజంతా వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఆ రూల్ ప్రకారం చర్చ జరగాలని ప్రతిపక్షాల పట్టు..

ఇదిలా ఉంటే అంతకుముందు లోక్ సభలో ప్రభుత్వ నిబంధన 267 ప్రకారం పేపర్ లీక్‌పై సభలో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పేపర్ లీకేజీపై ప్రభుత్వంతో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభ రెండు సభల్లో ఇదే అంశంపై రోజంతా రగడ నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..