Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన ఆ ప్రభుత్వం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా ఉండటంతో వాహనదారులకు భారంగానే ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు ఎన్నికల పూర్తియిపోయి మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెట్రోల్‌,డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన ఆ ప్రభుత్వం
Petrol Price
Follow us
Subhash Goud

|

Updated on: Jun 28, 2024 | 5:13 PM

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా ఉండటంతో వాహనదారులకు భారంగానే ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు ఎన్నికల పూర్తియిపోయి మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెట్రోల్‌,డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు కానుకగా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. ముంబై ప్రాంతంలో డీజిల్‌పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో డీజిల్ ధర లీటరుకు రూ.2 తగ్గనుంది. పెట్రోల్‌పై పన్ను 26 శాతం నుండి 25 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల ముంబై, నవీ ముంబై, థానే సహా ముంబై ప్రాంతంలో పెట్రోల్ ధరలు 65 పైసలు తగ్గుతాయి.

డీజిల్ ధర రూ.2 తగ్గనుంది

మహారాష్ట్రలో బడ్జెట్‌ను సమర్పిస్తూ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ ముంబై ప్రాంతంలో డీజిల్‌పై పన్నును 24% నుంచి 21%కి తగ్గిస్తున్నామని, దీనివల్ల డీజిల్ ధర లీటరుకు రూ.2 తగ్గుతుందని చెప్పారు. ముంబై ప్రాంతంలో పెట్రోల్‌పై పన్ను 26% నుండి 25%కి తగ్గించబడుతోందని, దీని వలన పెట్రోల్ ధరలు లీటరుకు 65 పైసలు తగ్గుతాయని తెలిపారు.

జూన్ 28న పెట్రోలు ధర

జూన్ 28న ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.92.15గా ఉంది. బడ్జెట్‌లో ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న పవార్, 2024-25 రాష్ట్ర బడ్జెట్‌లో 21 నుండి 60 సంవత్సరాల వయస్సు గల అర్హులైన మహిళలకు నెలవారీ రూ. 1,500 భత్యం ఇచ్చే ఆర్థిక సహాయ పథకాన్ని కూడా ప్రకటించారు.

అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగంలో పవార్ మాట్లాడుతూ అక్టోబర్‌లో రాష్ట్ర ఎన్నికలకు నాలుగు నెలల ముందు, జూలై నుండి ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకానికి వార్షిక బడ్జెట్‌లో రూ.46,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి, ‘ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన’ కింద అర్హులైన కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు లభిస్తాయని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి