AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ఈ రైల్వే స్టాక్‌ హాట్ కేక్.. ఏకంగా 27శాతం వడ్డీతో టాక్ ఆఫ్ ది మార్కెట్..

కొంతమంది నిపుణులు మాత్రం ఏ స్టాక్ పుంజుకుంటుంది? ఏ స్టాక్ లో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయన్న అంశాలను లెక్కించి సూచనలు చేస్తుంటారు. అలాగే ప్రస్తుతం భారతీయ రైల్వేకు ఫైనాన్సింగ్ చేసే ఓ కంపెనీకి ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఇది దీర్ఘకాలం సస్టైన్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Stock Market: ఈ రైల్వే స్టాక్‌ హాట్ కేక్.. ఏకంగా 27శాతం వడ్డీతో టాక్ ఆఫ్ ది మార్కెట్..
Stock Trading
Madhu
|

Updated on: Jun 28, 2024 | 5:47 PM

Share

ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక రాబడినిచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయంటే అది షేర్, స్టాక్ మార్కెట్లని కచ్చితంగా చెప్పొచ్చు. అయితే వాటిల్లో ఎంత రాబడి ఉంటుందో.. అంతే స్థాయిలో రిస్క్ కూడా ఉంటుంది. పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయి. మార్కెట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం, అర్థం చేసుకోవడం అంత సులభమైంది ఏమి కాదు. అయితే దానిపైనే ఉండే కొంతమంది నిపుణులు మాత్రం ఏ స్టాక్ పుంజుకుంటుంది? ఏ స్టాక్ లో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయన్న అంశాలను లెక్కించి సూచనలు చేస్తుంటారు. అలాగే ప్రస్తుతం భారతీయ రైల్వేకు ఫైనాన్సింగ్ చేసే ఓ కంపెనీకి ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఇది దీర్ఘకాలం సస్టైన్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ స్టాక్ ఏంటి? దాని పరిస్థితి ఏంటి? తెలుసుకుందాం రండి..

రైల్వే పీఎస్‌యూ స్టాక్ ఐఆర్‌ఎఫ్‌సీ..

రైల్వే పీఎస్‌యూ స్టాక్ ఐఆర్‌ఎఫ్‌సీని దీర్ఘకాలానికి కొనుగోలు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. రైల్వేల నుంచి కంపెనీలకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని.. రైల్వే కంపెనీల నిధుల అవసరాలను ఈ ఐఆర్ఎఫ్సీ తీరుస్తుందని వివరిస్తున్నారు. ఇది చాల పెద్ద సంస్థని, దేశ వ్యాప్తంగా చేపట్టే రైల్వే ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేయడంలో ఈ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని చెబుతున్నారు..ఈ కంపెనీ ఎన్‌సీఎ పూర్తిగా శూన్యం. ఇటీవల ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇది కూడా పెద్ద సానుకూలాంశం. కంపెనీకి బలమైన ఫండమెంటల్స్ ఉన్నాయి. కంపెనీ భవిష్యత్తులో వృద్ధికి మంచి అవకాశం ఉంది. కొనుగోలు స్టాక్‌లో 9 నుంచి 12 నెలల వరకూ పెట్టుబడులు పెట్టొచ్చు. దీనిలో 27 శాతం కంటే ఎక్కువ రాబడులు ఊహించవచ్చని చెబుతున్నారు.

మార్కెట్లో జోష్..

మార్కెట్ అస్థిరత కారణంగా భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు భారీగా ముగిశాయి. సెన్సెక్స్ 131 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 77,341 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 23,537 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 147 పాయింట్లు (0.27 శాతం) పెరిగి 55,577 వద్దకు చేరుకుంది. అయితే, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 18 పాయింట్లు (0.10 శాతం) పడిపోయి 18,217 వద్దకు చేరుకుంది. సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్యూమర్ ఇండెక్స్‌లు అత్యధికంగా లాభపడ్డాయి. పీఎస్ యూ బ్యాంక్, మెటల్, మీడియా, హెల్త్‌కేర్ ఇండెక్స్‌లు వెనుకబడి ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..