Sunita Williams: సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రలో కష్టాల పరంపర
సునీత విలియమ్స్ అంతిరక్ష యాత్ర ఆటంకాల మధ్య కొనసాగుతోంది. భూమికి తిరుగు ప్రయాణం ఎప్పుడన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. సాంకేతిక సమస్యల కారణంగా 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఆమె అంతరిక్షం లోనే ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ తిరిగి భూమి పైకి ఎప్పుడు చేరుకుంటారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జూన్ 26వ తేదీనే ఆమె తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం వాయిదా పడింది. అయితే సునీత విలియమ్స్ గురించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ..ISS కీలక సమాచారాన్ని వెల్లడించింది. అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో రష్యాకు చెందిన ఓ పనికిరాని ఉపగ్రహానికి చెందిన వంద శకలాలు పడిఉండడంతో యాత్రకు ఆటంకాలు కలుగుతున్నాయి.
బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ప్రయాణం
రష్యాకు చెందిన కాలం చెల్లిన శాటిలైట్ శకలాల కారణంగా సునీత విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి చిక్కుకుపోయారు. జూన్ 5వ తేదీన సునీత విలియమ్స్‌తో పాటు అమెరికాకు చెందిన మరో వ్యోమగామి విల్ మోర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకకు సాంకేతిక సమస్యలు రావడంతో సునీత, విల్‌మోర్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది. వ్యోమనౌకలో భారీగా హీలియం లీకేజ్ అవుతోంది. నాసా శాస్త్రవేత్తలు వ్యోమనౌకకు రిపేర్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి ఈనెల 14 వ తేదీన సునీత భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది. ఈ ప్రయాణం 26వ తేదీకి వాయిదా పడింది. కాని ఇప్పటికి కూడా టెక్నికల్ సమస్యకు పరిష్కారం రావడంతో ఇద్దరు వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది.
జులై 6వ తేదీన వచ్చే అవకాశం ఉందని కొత్త అప్‌డేట్
అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ ఎప్పుడు తిరిగి వస్తారన్న విషయంపై నాసా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. తాజాగా జులై 6వ తేదీన వచ్చే అవకాశం ఉందని కొత్త అప్‌డేట్ వచ్చింది. సునీత విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష యాత్ర. ఆమె 1998లో నాసాకు ఎంపికయ్యారు. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. 2012లో మరోసారి అంతరిక్షం లోకి వెళ్లి వచ్చారు. ఇప్పటివరకు ఆమె 50 గంటల 40 నిముషాల స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు అంతరిక్షం లోనే గడిపారు.
మూడోసారి అంతరిక్ష చేరుకున్న సునీత విలియమ్స్ అక్కడే ఉన్న ఏడుగురు వ్యోమగాములతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతా విలియమ్స్, టు బుచ్ విల్‌మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. వాళ్లు కచ్చితంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్‌లైనర్‌లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం.
స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు
స్టార్‌లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజులదాకా పొడిగించాలని భావిస్తున్నారు.. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది. కానీ, మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్, విల్‌మోర్ భూమిపైకి చేరుకొనే అవకాశం ఉంది.
సునీత రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దర్నీ రోదసిలోకి తీసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాయిదా పడింది. ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5 సురక్షితంగా స్పేస్‌కి పంపించింది.
వాస్తవానికి ఈ ళ్ల మిషన్ కేవలం 8 రోజులు మాత్రమే అంటే జూన్ 13 తిరిగి భూమికి రావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ జూన్ 26న తిరుగు ప్రయాణం అవుతారని నాసా చెప్పింది.. కానీ మళ్లీ అదే సమస్య స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం వాయిదా పడినట్టు నాసా ప్రకటించింది. వ్యోమనౌకలో హీలియం లీకేజీ సమస్య ఏర్పడటంతో దాన్ని సరిదిద్దే పనిలో స్టార్ లైనర్ ఇంజనీర్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా పరిష్కారం దొరకలేదు. దీంతో సునీతా విలియమ్స్, మరో వ్యామోగామి బుచ్ విల్ మోర్ ఎప్పుడు భూమికి తిరిగి వస్తారన్న విషయంలో స్పష్టత లేదు.