Youtube: యూట్యూబ్‌ వీడియోలను ఆడియోగా మార్చుకోవచ్చు.. ఎలాగో తెలుసా.?

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్నారన్న విషయం తెలిసిందే. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే యూట్యూబ్‌కు ఇంతటి ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉంటే యూట్యూబ్‌లో వచ్చే కొన్ని వీడియోలకు సంబంధించి ఆడియో ఫైళ్లగా సేవ్ చేసుకుంటే భలే ఉంటుంది కదూ! అయితే ఇందుకు కూడా మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..

Narender Vaitla

|

Updated on: Jun 30, 2024 | 7:53 PM

 యూట్యూబ్‌లో ఒక మంచి పాట కనిపిస్తుంది. అయితే దానికి ఎంపీ3 వెర్షన్‌ ఉండదు. కానీ ఆ పాటను ఆడియో ప్లేయర్స్‌లో వింటే బాగుంటుందనే భావన కలుగుతుంది. మరి అలాంటి సమయాల్లో ఉపయోగపడే వెబ్‌సైట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

1 / 5
4కే యూట్యూబ్‌ టు ఎంపీ3: రోజుకు ఉచితంగా 15 కన్వర్జన్లను ఈ వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు. యూట్యూబ్‌ వీడియోలను చాలా సులభంగా ఆడియోలకు మార్చేస్తుంది. యూట్యూబ్‌ వీడియో యూఆర్‌ఎల్‌ను పేస్ట్‌ చేస్తే చాలు. వెంటనే కన్వర్షన్‌ అవుతుంది. విండోస్‌, మ్యాక్‌ రెండింటిలోనూ ఈ వెబ్‌సైట్ సపోర్ట్‌ చేస్తుంది.

2 / 5
ఈ వెబ్‌సైట్స్‌ ద్వారా యూట్యూబ్‌ వీడియోలను ఆడియో ఫైల్స్‌గా సేవ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. యూట్యూబ్‌ లింక్‌ ద్వారా నేరుగా ఆడియో ఫార్మట్‌లోకి మార్చుకోవచ్చు. ఇంతకీ ఆ వెబ్‌సైట్స్‌ ఏంటి.? వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
ఏస్‌థింకర్‌.కామ్‌: ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి అనంతరం సెర్చ్‌ బాక్స్‌లో యూట్యూబ్‌ వీడియో లింక్‌ను పేస్ట్ చేయాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్‌ బటన్‌ను నొక్కితే ఆ పాట పేరు డిస్‌ప్లే అవుతుంది. అనంతరం కింద ఉండే డౌన్‌లోడ్‌ బటన్‌ మీద క్లిక్‌ చేసి సేవ్‌ చేసుకుంటే సరిపతోతుంది. ఇక సౌండ్‌ క్వాలిటీని కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.

4 / 5
 డిర్పీ.కామ్‌: ముందుగా ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం ఎంటర్‌ వీడియో యూఆర్‌ఎల్‌ ఆర్‌ సెర్చ్‌ టర్మ్‌ అని ఉండే బాక్కులో యూట్యూబ్‌ వీడియో లింక్‌ను పేస్ట్‌ చేయాలి. తర్వాత పక్కనే ఉండే డిర్పీ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. రికార్డ్‌ ఆడియోలోకి వెళ్లి ఎంపీ3 ఫార్మాట్‌ను సెలక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా క్వాలిటీని ఎంచుకొని రికార్డ్ ఆడియో బటన్‌ను క్లిక్‌ చేస్తే వెంటనే ఎంపీ3 ఫైల్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది.

5 / 5
Follow us