Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్ మెట్రోలో అధునాతన టికెటింగ్ విధానం అమలులోకి రాబోతోంది. అవును.. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ.. విదేశాల్లో మాదిరి ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ(OTS)ను తీసుకురాబోతోంది. ఈ విధానంలో మెట్రో రైలు ఎక్కే ముందు టికెట్ తీసుకోవాల్సిన పనిలేదు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ వసూలు చేస్తారు. కొత్త విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనే ప్రణాళికలో మెట్రోరైలు సంస్థ ఉంది.
హైదరాబాద్ మెట్రోలో అధునాతన టికెటింగ్ విధానం అమలులోకి రాబోతోంది. అవును.. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ.. విదేశాల్లో మాదిరి ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ(OTS)ను తీసుకురాబోతోంది. ఈ విధానంలో మెట్రో రైలు ఎక్కే ముందు టికెట్ తీసుకోవాల్సిన పనిలేదు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ వసూలు చేస్తారు. కొత్త విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనే ప్రణాళికలో మెట్రోరైలు సంస్థ ఉంది. అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ప్రజారవాణాలో టికెట్లు, వాటికి చెల్లింపు పద్ధతులపై ఇటీవల గణనీయమైన మార్పులు వచ్చాయి. కౌంటర్లలో సిబ్బంది విక్రయించే టికెట్లు మొదలు.. టికెట్ వెండింగ్ యంత్రాల ద్వారా పొందే విధానం, స్మార్ట్‌కార్డులు, మొబైల్ నుంచి వాట్సాప్‌లో టికెట్ పొందే వీలు.. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల వ్యవస్థల ద్వారా వాటిని అనుమతించడం వరకు హైదరాబాద్ మెట్రోలో ఇప్పటివరకు చూశాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: