ఒక కిడ్నీ చెడిపోతే.. మరొకటి ఎంతకాలం పని చేస్తుంది ??
మానవ శరీరంలో కిడ్నీ చాలా ముఖ్యమైన అవయవం. మన శరీరంలో రెండు కిడ్నీలు ఉంటాయి. అందుకే వీటి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు కిడ్నీలలో ఒకటి చెడిపోతే ఆ వ్యక్తి సజీవంగా ఉండగలడు. అయితే ఇది అతనికి చాలా సమస్యలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఒక కిడ్నీపై ఎంతకాలం జీవించగలడు అనేది అతిపెద్ద ప్రశ్న. మరి దీనికి నిపుణుల సమాధానమేంటి? కిడ్నీ ఫెయిలైనవారిలో చాలా మంది ఒక కిడ్నీపైనే సాధారణ జీవితం గడుపుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మానవ శరీరంలో కిడ్నీ చాలా ముఖ్యమైన అవయవం. మన శరీరంలో రెండు కిడ్నీలు ఉంటాయి. అందుకే వీటి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు కిడ్నీలలో ఒకటి చెడిపోతే ఆ వ్యక్తి సజీవంగా ఉండగలడు. అయితే ఇది అతనికి చాలా సమస్యలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఒక కిడ్నీపై ఎంతకాలం జీవించగలడు అనేది అతిపెద్ద ప్రశ్న. మరి దీనికి నిపుణుల సమాధానమేంటి? కిడ్నీ ఫెయిలైనవారిలో చాలా మంది ఒక కిడ్నీపైనే సాధారణ జీవితం గడుపుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక కిడ్నీ పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే అది రెండు కిడ్నీల పని చేస్తుంది కానీ, అందరికీ అలా ఉండదు. మూత్రపిండాలపై అధిక లోడ్ పడినప్పుడు దాని నష్టం మరింత పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి తన జీవితాంతం ఒక కిడ్నీపై జీవించగలడా? అంటే.. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం.. చిన్నతనంలో పిల్లల కిడ్నీని తొలగించినట్లయితే, అతనికి జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ అతని జీవితం కూడా సాధారణంగా కొనసాగుతుంది. ఒక కిడ్నీపై జీవించడానికి, సరైన జీవితాన్ని గడపడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఒక కిడ్నీతో జీవించినా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే మరో కిడ్నీ కూడా పాడై మరణం సంభవించే అవకాశం ఉందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ భవనాలు కూడా కూల్చేస్తాం.. వైసీపీ ఆఫీసులకు నోటీసులు
IT Jobs: ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరుగుతుంది ??
TOP 9 ET News: పవన్ డిప్యూటీ cm అయిన వేళ యూత్‌కు చిరు సందేశం