వెరైటీ దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు
సాధారణంగా దొంగలు ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడటం చూశాం. బంగారం, నగదు లేదా విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం మనకు తెలుసు. కానీ లైబ్రరీలో దొంగతనానికి పాల్పడటం ఎప్పుడైనా చూశారా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గ్రంథాలయం తాళాలు పగలగొట్టి.... అడ్డొచ్చిన వాచ్‌మెన్ ని బెదిరించి గ్రంథాలయాన్ని దోచుకున్నారు.
సాధారణంగా దొంగలు ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడటం చూశాం. బంగారం, నగదు లేదా విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం మనకు తెలుసు. కానీ లైబ్రరీలో దొంగతనానికి పాల్పడటం ఎప్పుడైనా చూశారా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గ్రంథాలయం తాళాలు పగలగొట్టి…. అడ్డొచ్చిన వాచ్‌మెన్ ని బెదిరించి గ్రంథాలయాన్ని దోచుకున్నారు. గ్రంథాలయంలో దోచుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా? ఇంకేముంది పాత పుస్తకాలు, చిత్తు కాగితాలతోపాటు… కుర్చీలు, ఫర్నిచర్, ఫ్యాన్లు ఎత్తుకెళ్లిపోయారు. దొంగలు చోరీకి గ్రంథాలయాన్నే ఎందుకు ఎంచుకున్నారో పోలీసులకు అర్థం కావడం లేదు. ఈ వెరైటీ దొంగతనంపై గ్రంథాలయం ఇన్చార్జి జయరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్తు కాగితాలను దొంగిలించిన దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన గురించి తెలిసిన స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుందా ?? నిజమెంత ??
రీల్స్ పిచ్చి తో స్టంట్స్ చేసిన స్కూలు విద్యార్ధినిలు.. చివరికి ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

