రీల్స్‌ కోసం టెర్రస్‌ పైకి వెళ్లిన బాలిక..రెప్పపాటులో ??

బీహార్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. వ‌ర్షం ప‌డుతున్న స‌మ‌యంలో ఇన్‌స్టా రీలు కోసం పొరుగింటి వారి టెర్రస్‌పైకి ఎక్కిన ఓ బాలిక‌ పిడుగుపాటు నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీతామర్హి ప‌రిధిలోని పరిహార్‌లోని సిర్సియా బజార్‌లో సానియా కుమారి అనే బాలిక‌ తన పొరుగున ఉండే దేవనారాయణ్ భగత్ ఇంటి టెర్రస్‌పై వర్షంలో డ్యాన్స్ చేస్తోంది. ఆమె స్నేహితురాలు దాన్ని వీడియో తీస్తోంది.

రీల్స్‌ కోసం టెర్రస్‌ పైకి వెళ్లిన బాలిక..రెప్పపాటులో ??

|

Updated on: Jul 01, 2024 | 6:31 PM

బీహార్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. వ‌ర్షం ప‌డుతున్న స‌మ‌యంలో ఇన్‌స్టా రీలు కోసం పొరుగింటి వారి టెర్రస్‌పైకి ఎక్కిన ఓ బాలిక‌ పిడుగుపాటు నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీతామర్హి ప‌రిధిలోని పరిహార్‌లోని సిర్సియా బజార్‌లో సానియా కుమారి అనే బాలిక‌ తన పొరుగున ఉండే దేవనారాయణ్ భగత్ ఇంటి టెర్రస్‌పై వర్షంలో డ్యాన్స్ చేస్తోంది. ఆమె స్నేహితురాలు దాన్ని వీడియో తీస్తోంది. ఇంత‌లోనే సానియా డాన్స్‌ చేస్తున్న సమీపంలోనే పెద్ద పిడుగు పడింది. అదృష్టవశాత్తూ ఆమెకు నేరుగా ఆ పిడుగు ప్రభావం తగలకపోవడంతో ఎలాంటి ప్రమాదం జ‌ర‌గ‌లేదు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. బీహార్‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పిడుగుపాటు ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో బీహార్‌లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుతో కనీసం 8 మంది చ‌నిపోయినట్లు బుధ‌వారం అధికారులు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

4 బెడ్రూమ్‌ ఫ్లాట్‌ ధర రూ.15 కోట్లు.. ఎక్కడంటే ??

ఒక కిడ్నీ చెడిపోతే.. మరొకటి ఎంతకాలం పని చేస్తుంది ??

Follow us