వామ్మో.. ఇంతపెద్ద పుట్టగొడుగా !! ఎప్పుడూ చూసి ఉండరు

అప్పుడప్పుడూ మనం కూరగాయలు సాధారణ సైజుకంటే పెద్ద సైజులో పెరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తరచూ అలాంటివి మనకు నెట్టింట దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా అతి పెద్ద పుట్టగొడుగు ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు బాహుబలి పుట్టగొడుగు అని నెట్టింట చూశాం. కానీ ఇది మాత్రం బాహుబలి-2 అన్నట్టుగా ఉంది. అవును, అనంతపురం జిల్లాలోని ఓ రైతు పొలంలో ఈ అతిపెద్ద పుట్టగొడుగు పెరిగింది.

వామ్మో.. ఇంతపెద్ద పుట్టగొడుగా !! ఎప్పుడూ చూసి ఉండరు

|

Updated on: Jul 01, 2024 | 6:33 PM

అప్పుడప్పుడూ మనం కూరగాయలు సాధారణ సైజుకంటే పెద్ద సైజులో పెరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తరచూ అలాంటివి మనకు నెట్టింట దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా అతి పెద్ద పుట్టగొడుగు ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు బాహుబలి పుట్టగొడుగు అని నెట్టింట చూశాం. కానీ ఇది మాత్రం బాహుబలి-2 అన్నట్టుగా ఉంది. అవును, అనంతపురం జిల్లాలోని ఓ రైతు పొలంలో ఈ అతిపెద్ద పుట్టగొడుగు పెరిగింది. నిజానికి ఇప్పటి వరకూ ఇంత పెద్ద పుట్టగొడుగును ఎక్కడా చూసి ఉండరు. అక్షరాల ఐదు కేజీల బరువు ఉన్న పుట్టగొడుగు ఒకటి.. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జానంపల్లికి చెందిన వడ్డే హనుమంతరాయుడు అనే రైతు పొలంలో పుట్టింది. పొలంలోని పుట్టనుంచి బయటకు పుట్టుకొచ్చిన పుట్టగొడుగును తవ్వి తీసిన రైతు హనుమంతురాయుడు ఆ పుట్టగొడుగు సైజు చూసి షాక్ అయ్యాడు. రెండు అడుగుల వెడల్పుతో ఐదు కిలోల బరువు ఉన్న పుట్టగొడుగు చూసి స్థానికులు, చుట్టుపక్క రైతులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ భారీ పుట్టగొడుగు చూసేందుకు హనుమంతరాయుడు ఇంటికి జనం క్యూ కట్టారు. అరుదైన ఈ భారీ పుట్టగొడుగును కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పరిశోధనకు తరలించారు. సాధారణంగా వర్షాలు పడే సమయంలో వ్యవసాయ పొలాల్లో పుట్టగొడుగులు పుట్టుకు రావడం సహజమే… కానీ ఇంత భారీ పుట్టగొడుగు పెరగడం స్థానికంగా చర్చినీయాంశమైంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీల్స్‌ కోసం టెర్రస్‌ పైకి వెళ్లిన బాలిక..రెప్పపాటులో ??

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

4 బెడ్రూమ్‌ ఫ్లాట్‌ ధర రూ.15 కోట్లు.. ఎక్కడంటే ??

ఒక కిడ్నీ చెడిపోతే.. మరొకటి ఎంతకాలం పని చేస్తుంది ??

Follow us