- Telugu News Photo Gallery Hair Growth Tips: Mix Black Pepper And Cinnamon Powder With Curd And Put In On Hair For Hair Growth
Hair Growth Tips: పెరుగులో ఈ రెండు కలిపి జుట్టుకు పట్టిస్తే.. నెల రోజుల్లోనే పొడవాటి కురులు మీ సొంతం!
నల్లని, ఒత్తైన, పొడవాటి కురులు కోరుకోని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ ఎంత ప్రయత్నించినా అకారణంగా వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. దీంతో బట్టతల సంకేతాలు కొన్ని రోజుల్లోనే కనిపిస్తాయి. జుట్టు పెరుగుదలకు వేలకొద్దీ సౌందర్య సాధనాలు ఉపయోగించినా.. తలకు రకరకాల నూనెలు పట్టించినా.. జుట్టు పెరగకపోగా, వెంట్రుకలు రోజురోజుకీ మరింత ఊడిపోతుంటాయి..
Updated on: Jun 30, 2024 | 8:37 PM

నల్లని, ఒత్తైన, పొడవాటి కురులు కోరుకోని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ ఎంత ప్రయత్నించినా అకారణంగా వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. దీంతో బట్టతల సంకేతాలు కొన్ని రోజుల్లోనే కనిపిస్తాయి.

జుట్టు పెరుగుదలకు వేలకొద్దీ సౌందర్య సాధనాలు ఉపయోగించినా.. తలకు రకరకాల నూనెలు పట్టించినా.. జుట్టు పెరగకపోగా, వెంట్రుకలు రోజురోజుకీ మరింత ఊడిపోతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారం పెరుగులో దాగి ఉందంటున్నారు సౌందర్య నిపుణులు

పెరుగులో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి ప్రతిరోజూ తలకు పట్టిస్తే జుట్టు ఇట్టే పెరుగుతుందట. నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి. ఈ రెండు పదార్థాలను పెరుగుతో కలిపి జుట్టుకి అప్లై చేయడం వల్ల 3 నుంచి 4 వారాల్లో కొత్త జుట్టు పెరగడం ప్రారంభమవుతుందట. ఇలా చేస్తే బట్టతల సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.

ఒక గిన్నెలో 4 చెంచాల పుల్లని పెరుగు తీసుకుని, అందులో ఒక 1 చెంచా మిరియాల పొడి, మరో చెంచా దాల్చిన చెక్క పొడిని వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఆ తర్వాత గంటసేపు అలాగే ఉంచి తలస్నానం చేయాలి

ఈ విధంగా వారానికి కనీసం మూడు రోజులు చేయాలి. మిరియాలు, దాల్చినచెక్కలోని ఉద్దీపనలు ఫోలికల్స్‌ను ప్రేరేపిస్తాయి. దీంతో కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.




