AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుపు, నలుపు రంగులో లింగాలు.. జలాభిషేకంతోనే కష్టాలు తీర్చి సుఖాలు ఇచ్చే శివాలయం.. ఎక్కడంటే

ఎవరి పనిలోనైనా ఆటంకాలు ఏర్పడుతుంటే.. ఏ పని చేసినా నష్టమే ఎదురవుతున్నట్లయితే రూపేశ్వర్ మహాదేవుని పూజించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఇక్కడ ఉన్న మహాదేవుడిని పూజిస్తే జీవితంలో వచ్చిన సమస్యలు తీరతాయి. పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కుటుంబేశ్వర మహాదేవ ఆలయానికి తూర్పు కుడివైపున మగర్ముహ నుంచి సింగ్‌పురికి వెళ్తుంటే ఈ పురాతన రూపేశ్వర మహాదేవ ఆలయం ఉంది

తెలుపు, నలుపు రంగులో లింగాలు.. జలాభిషేకంతోనే కష్టాలు తీర్చి సుఖాలు ఇచ్చే శివాలయం.. ఎక్కడంటే
Rupeshwar Mahadev Mandir
Surya Kala
|

Updated on: Jul 01, 2024 | 11:03 AM

Share

భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఎన్నో రకాల దేవుళ్ల ఆలయాలున్నాయి. అయితే కొండ కోనల్లో, అడవుల్లో నది నదాల్లో ఇల్లా ఎక్కువగా శివాలయాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాంటి మహామహిమాన్విత్వ ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. శక్తి వంతమైన 84 మంది మహాదేవుల ఆలయాల్లో 62వ స్థానంలో ఉన్న శ్రీ రూపేశ్వర మహాదేవుడి ఆలయం అత్యంత పురాతన ఆలయం. ఈ రూపేశ్వర మహాదేవ ఆలయంలో రెండు శివలింగాలు కూడా ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీని అందిస్తే మరొకటి నెగిటివిటీని నాశనం చేస్తుందని నమ్మకం.

ఎవరి పనిలోనైనా ఆటంకాలు ఏర్పడుతుంటే.. ఏ పని చేసినా నష్టమే ఎదురవుతున్నట్లయితే రూపేశ్వర్ మహాదేవుని పూజించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఇక్కడ ఉన్న మహాదేవుడిని పూజిస్తే జీవితంలో వచ్చిన సమస్యలు తీరతాయి. పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కుటుంబేశ్వర మహాదేవ ఆలయానికి తూర్పు కుడివైపున మగర్ముహ నుంచి సింగ్‌పురికి వెళ్తుంటే ఈ పురాతన రూపేశ్వర మహాదేవ ఆలయం ఉంది.

శ్రీ రూపేశ్వర ఆలయంలో నలుపు, తెలుపు రంగుల రాళ్లతో మలచబడిన శివుని రెండు శివలింగాలు ప్రతిష్టించబడ్డాయి. ఇక్కడ చెరువు మధ్య తెల్లటి ప్రకాశవంతమైన రాతితో చేసిన శివలింగం ఉంది. ఇది సానుకూల శక్తిని అందించే శివలింగం. దీని పక్కనే నల్ల రాయితో చేసిన శివలింగం ఉంటుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

కేవలం భగవంతుని దర్శనం చేసుకుంటే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని నమ్ముతారు. ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు జలాభిషేకం కూడా చేస్తారు. ఆలయంలో స్వామివారికి నిత్య హారతి, పూజలతో పాటు నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ రూపేశ్వర్ మహాదేవుడితో పాటు, పురాతన వరదానీ కూడా ఉంది. ఇక్కడ మహిషాసురమర్ధని రూపంలో కనిపిస్తుంది.

ఆలయంలో ఉన్న ఇతర ఆలయాలు

ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే ముందు పురాతన శివ-పార్వతి విగ్రహం ఉంది. వీటి సమీపంలో అవతారాల పురాతన విగ్రహాలు ఉన్నాయి. ఎదురుగా చెడిపోయిన రాయి మధ్యలో ఒక వృత్తం ఉంది. నేలపై విష్ణుమూర్తి విగ్రహం, ఒక దేవత విగ్రహం ఉన్నాయి. మిగిలిన గోడపై చాలా కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఐదున్నర అడుగుల ఎత్తైన మహిషాసుర మర్దినీ దేవి దివ్య విగ్రహం ఉంది. అమ్మవారు కవచం, విల్లు మొదలైన ఆయుధాలను ధరించి ఒకే తెల్లని రాతిపై ప్రతిష్టించబడి ఉంది. ఆలయ గొడవల రెండు వైపులా బ్రహ్మ విగ్రహాలు, శివ కుటుంబంతో పాటు విష్ణు తదితరులు చెక్కబడి ఉన్నారు.

పౌరాణిక కథ ఏమిటంటే

పురాణాల ప్రకారం మహాదేవుడు పద్మ కల్పంలో పార్వతీ దేవికి పద్మరాజు కథను వివరిస్తూ రాజు వేటాడుతూ తన సాహసంతో అడవిలోని జంతువులను చంపాడని చెప్పాడు. తర్వాత చాలా సుందరమైన అడవిలో ఆశ్రమంలో ఒంటరిగా ప్రవేశించాడు. అక్కడ అతను తపస్సు చేస్తున్న ఓ యువతిని చూశాడు. రాజు ఆ యువతి గురించి వివరాలు అడిగాడు. తను కణ్వ మహర్షిని తండ్రిగా భావిస్తున్నాను అని చెప్పింది రుషి కన్య. ముద్దుగా అందంగా ఉన్న ఆ అమ్మాయిని తన భార్యగా చేసుకోవాలని రాజు భావించాడు. పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు.

అమ్మాయి రాజుని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. అయితే తన తండ్రి ఋషి వచ్చే వరకు ఆగమని కోరింది. అప్పుడు రాజు ఆ అమ్మాయిని గాంధర్వ పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నాడు. కణ్వ ఋషి తిరిగి వచ్చిన తర్వాత తన ఆశ్రమంలో ఉన్న యువతిని, రాజును వైకల్యంతో జీవించమని శపించాడు. అయితే ఆ అమ్మాయి అప్పుడు రాజుని ఇష్టపడ్డానని.. భర్తగా ఎన్నుకున్నానని చెప్పింది. శాప విముక్తి కోసం కణ్వ ఋషి వారిద్దరినీ ఉజ్జయినిలో ఉన్న శివయ్య వద్ద పంపాడు. అక్కడ ఒక అందమైన లింగాన్ని దర్శనం చేసుకున్న అనంతరం వారిద్దరూ అందంగా మారారు. అప్పటి నుంచి లింగం రూపేశ్వర మహాదేవుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు