AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord shiva: ఈ ఆలయంలో శివలింగం రోజుకి ఐదు రంగులను మార్చుకుంటుంది.. శివయ్య అనుమతి లేనిదే ఆలయంలోకి అడుగు పెట్టలేం..

కళ్యాణసుందరేసర్ ఆలయం నల్లూరు లేదా తిరునల్లూరు తమిళనాడులోని కుంభకోణం శివార్లలోని నల్లూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. శివుడిని కళ్యాణసుందరేసర్‌గా భార్య పార్వతిని గిరిసుందరిగా పూజిస్తారు. ఈ ఆలయం త్రిమూర్తుల్లో లయకారుడైన శివుని నివాసం. ఈ ఆలయాన్ని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాదు ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పాలు, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా తమ జీవితంలో దర్శించుకోవాలని శివయ్య భక్తులు కోరుకుంటారు

Lord shiva: ఈ ఆలయంలో శివలింగం రోజుకి ఐదు రంగులను మార్చుకుంటుంది.. శివయ్య అనుమతి లేనిదే ఆలయంలోకి అడుగు పెట్టలేం..
Kalyanasundaresar Temple
Surya Kala
|

Updated on: Jun 26, 2024 | 9:25 AM

Share

అన్ని మతాలు, విశ్వాసాలకు ప్రధానమైన, పవిత్రమైన ప్రార్థనా స్థలం ఆలయం. దేవుని దర్శనం కోసం లేదా ప్రార్థన కోసం మాత్రమే వెళ్ళకుండా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి విలువైన, సురక్షితమైన ప్రదేశం దేవాలయం. మనసులో భక్తితో భగవంతుడిని ప్రార్థిస్తే ..మనలో ఉంటాడని నమ్మకం. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులను సంతృప్తి పరుస్తాడు. దేశంలోని మూల మూల్లో అంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు వివిధ రకాల దేవుళ్ల ఆలయాలు ఉన్నాయి. అయితే బహుశా దేశంలోనే అత్యధిక దేవాలయాలు శివాలయాలే. 12 జ్యోతిర్లింగ ఆలయాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో అద్భుత ఆలయాలు, శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇలాంటి శివాలయంలో కళ్యాణసుందరేశ్వర ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణంలో ఉంది. అయితే ఈ ఆలయం శివుడు నివాసం అని నమ్ముతారు. ఈ దేవాలయానికి సంబంధించిన అనేక అద్భుతమైన కథలు వాడుకలో ఉన్నాయి.

కళ్యాణసుందరేసర్ ఆలయం నల్లూరు లేదా తిరునల్లూరు తమిళనాడులోని కుంభకోణం శివార్లలోని నల్లూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. శివుడిని కళ్యాణసుందరేసర్‌గా భార్య పార్వతిని గిరిసుందరిగా పూజిస్తారు. ఈ ఆలయం త్రిమూర్తుల్లో లయకారుడైన శివుని నివాసం. ఈ ఆలయాన్ని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాదు ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పాలు, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఒక్కసారైనా తమ జీవితంలో దర్శించుకోవాలని శివయ్య భక్తులు కోరుకుంటారు. శివుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు. అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించిన ఇతర కారణాలు కూడా అనేకం ఉన్నాయి., అవి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..

ఈ ఆలయాన్ని సందర్శించడానికి మరొక కారణం దీని చారిత్రక ప్రాముఖ్యత. సాధారణంగా ఈ పవిత్ర స్థలం శివుడు, కార్తికేయుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని పాండ్య రాజవంశంలోని మొదటి చోళుడు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించాడు. ఈ పురాతన ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడింది. పునరుద్ధరించబడిందని చరిత్రకారుల కథనం. చాలా మందికి తెలియకపోవచ్చు ఈ ఆలయం ఉత్తరాన ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం వలె దక్షిణాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కళ్యాణసుందరేసర్‌ ఆలయాన్ని “బ్లాక్ పగోడా” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ రెండు నల్లరాతి లింగాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన గర్భగుడిలో ఉంది. ఇది బంగారంతో కప్పబడి ఉంటుంది. మరొకటి ఆలయ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం దగ్గర ప్రతిష్టంబడి ఉంది.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు రెండవ శివలింగాన్ని గంధపు పూతతో కప్పుతారు. ఉదయం 9 గంటలకు ఈ శివలింగం బంగారంలా కనిపిస్తుంది. ఈ ఆలయంలోని శివలింగం రోజుకు ఐదుసార్లు తన రంగుని మార్చుకుని వివిధ రూపాల్లో దర్శనం ఇస్తుందని చెబుతారు. అంటే ఇక్కడ శివలింగం తన రూపాన్ని ఐదుసార్లు మార్చుకుంటుంది. దీంతో ఈ శివలింగం ఇతర శివాలయాలకు భిన్నంగా ఉంటుంది.

ఉదయం (ఉదయం 8 నుండి 11 వరకు)

ఉదయం ఈ ఆలయంలో మహేశ్వరుడు బైద్యనాథుడుగా దర్శనం ఇస్తాడు. తలపై బంగారు కిరీటం, మూడు కళ్ళు ఉంటాయి. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో బాణం పట్టుకుని ఉంటాడు. నంది తోడుగా ఉంటుంది. భక్తులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు పుష్పాలు, చందనంతో పూజలు నిర్వహిస్తారు.

మధ్యాహ్నం ఆరాధన (మధ్యాహ్నం 12 నుండి 1 వరకు)

భక్తులు పూర్ణిమరోజున నీలకంఠ పురుషుడుగా పూజిస్తారు. గణేశ పురుషోత్తమ క్షీరసాగర శంభు (గంగా స్వామి), సర్వ శక్తి సిద్ధార్థి భగవత్ పురుషుడిని పుష్పాలు, గంధపు ముద్దతో మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు పూజిస్తారు.

ఐదు సార్లు రంగు మార్చే శివయ్య

ఇక్కడ లింగం ఉదయం పూజ సమయంలో నలుపు రంగులో (ఉదయం 8 నుండి 11 గంటల వరకు), మధ్యాహ్నం పూజ సమయంలో తెలుపు (మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు), సాయంత్రం పూజ సమయంలో ఎరుపు (మధ్యాహ్నం 3 నుండి 7 గంటల వరకు), రాత్రి సమయంలో పూజకు లేత నీలం (రాత్రి 8 నుండి 10 వరకు). pm)..చివరిగా అర్ధరాత్రి సమయంలో ప్రకాశవంతమైన ఆకుపచ్చగా మారుతుంది (11pm నుండి 12am).

ఈ అద్భుతం వెనుక శాస్త్రీయ కారణం ఏమిటంటే:

ఆలయంలో జరిగే ఈ వింత దైవిక ఘటన అని భక్తులు భావిస్తారు. ఈ మిస్టరీని చేధించడానికి శాస్త్రజ్ఞులు అనేక ప్రయత్నలు చేశారు. ఈ అద్భుత దృగ్విషయం వెనుక శాస్త్రీయ వివరణ లేదు. ఈ ఆలయం మహా మనిత్వం అని భక్తులు విశ్వసిస్తారు మహాదేవుడు ఇక్కడ తన రంగును మార్చుకుంటాడు. స్వయంగా రంగులు మార్చుకునే శివయ్యను ఎ రంగులో ఉండగా దర్శించుకోవాలనేది భక్తులే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేర్వేరు సమయాల్లో.. శివయ్యను ఐదు రంగుల్లో కనిపించే లింగాన్ని చూడొచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!