kalashtami: కాలాష్టమి రోజున ఈ ఐదు పరిహారాలు చేసి చూడండి.. శివయ్య అనుగ్రహంతో జీవితంలో ఇబ్బందులు ఉండవు..

పంచాంగం ప్రకారం జేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి శుక్రవారం జూన్ 28 సాయంత్రం 04:27 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు అంటే శనివారం జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 02:19 వరకు ఉండనుంది. నిశీధి ముహూర్తాన్ని జ్యేష్ట కాలాష్టమి వ్రతం కోసం శుభ ముహార్తంగా పరిగణిస్తారు. అందుకే జ్యేష్ట కాలాష్టమి ఉపవాసం జూన్ 28న మాత్రమే ఆచరిస్తారు. కాలాష్టమి ఉపవాసం రోజున కాలభైరవుడిని రాత్రి పూజిస్తారు. అయితే మంత్ర, తంత్ర సాధన కోసం నిశీధి కాలంలో కాల భైరవుడిని పూజిస్తారు.

kalashtami: కాలాష్టమి రోజున ఈ ఐదు పరిహారాలు చేసి చూడండి.. శివయ్య అనుగ్రహంతో జీవితంలో ఇబ్బందులు ఉండవు..
Kalashtami 2024
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2024 | 6:52 AM

హిందూ మతంలో కాలాష్టమి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని కాల భైరవాష్టమి అని కూడా అంటారు. ఈ రోజున శివుని భాగమైన కాలభైరవుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రజల కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం. పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణ పక్షంలోని అష్టమి తిథి రోజున కాలాష్టమి జరుపుకుంటారు. కాలాష్టమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే శివుడు భైరవుడిని కొలిచిన వారి కష్టాలన్నీ తొలగిస్తాడని విశ్వాసం. ఈ జేష్ఠ మాసంలోని కాలాష్టమి పండుగ జూన్ 28వ తేదీ శుక్రవారం రోజున జరుపుకోనున్నారు.

కాలాష్టమి తేదీ, శుభ సమయం

పంచాంగం ప్రకారం జేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి శుక్రవారం జూన్ 28 సాయంత్రం 04:27 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు అంటే శనివారం జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 02:19 వరకు ఉండనుంది. నిశీధి ముహూర్తాన్ని జ్యేష్ట కాలాష్టమి వ్రతం కోసం శుభ ముహార్తంగా పరిగణిస్తారు. అందుకే జ్యేష్ట కాలాష్టమి ఉపవాసం జూన్ 28న మాత్రమే ఆచరిస్తారు. కాలాష్టమి ఉపవాసం రోజున కాలభైరవుడిని రాత్రి పూజిస్తారు. అయితే మంత్ర, తంత్ర సాధన కోసం నిశీధి కాలంలో కాల భైరవుడిని పూజిస్తారు.

కాలాష్టమి రోజున ఈ 5 చర్యలు చేయండి

  1. కాలాష్టమి రోజున కాలభైరవుని ముందు ఆవనూనెతో దీపం వెలిగించి శ్రీ కాల భైరవాష్టకం పఠించండి. పారాయణం చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి.
  2. కాలాష్టమి రోజున శివుని పూజిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున శివునికి 21 బిల్వ పత్రాలను సమర్పించండి. ఈ బిల్వ ఆకులన్నింటిపై గంధంతో ఓం నమః శివా అని రాయాలి. ఇలా రాసిన పత్రాలను ఓం నమః శివాయ అంటూ సమర్పించండి. ఇలా చేయడం వలన కోరికలన్నీ నెరవేరుతాయి.
  3. కాలాష్టమి రోజున నల్ల కుక్కకు ఆహారాన్ని తినిపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా కాలభైరవుడితో పాటు శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఈ పరిహారం చేయడానికి ఎవరికైనా నల్ల కుక్క కనిపించక పొతే ఏ ఇతర కుక్కలకైనా ఆహారాన్ని అందించండి.
  4. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే కాలాష్టమి రోజున కాల భైరవుని ముందు 33 సుగంధ ధూపాలను వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వాసం.
  5. కాలాష్టమి రోజు నుంచి మొత్తం 40 రోజుల పాటు కాల భైరవుని ఆలయానికి వెళ్లి కాల భైరవుడిని దర్శనం చేసుకోండి. ఇలా చేయడం వలన కాలభైరవుడు సంతోషిస్తాడు. భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఈ నియమాన్ని కాలాష్టమి చాలీసా అంటారు.

కాలాష్టమి ప్రాముఖ్యత

కాలభైరవుడు శివుని రూపంలో జన్మించాడు. ఈ రోజున నియమ నిష్టల ప్రకారం పూజించడం ద్వారా కాల భైరవుడు సంతోషిస్తాడు. ఈ రోజున భక్తులు కాల భైరవుని శాంత రూపమైన బతుక్‌ను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉన్న భక్తుల బాధలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం . అంతే కాదు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కాలభైరవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.