Varahi deeksha: పవన్ సంకల్పించిన వారాహి దీక్ష ఏంటి..? దీని ఫలితం ఎలా ఉంటుంది

హిందువులకు ముక్కోటి దేవతలు. అందులో కొద్ది మంది మాత్రమే బాగా పాపులర్‌. ఎంతో మహిమాన్వితమైనా.. వారాహి మాత గురించి చాలా తక్కువ మందికే తెలుసు. మన రోజువారీ జీవితంలో నిత్యం గుళ్లూ గోపురాలు తిరుగుతున్నా.. వారాహి అమ్మవారి గురించి తెలిసింది తక్కువే. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వారాహి మాత దీక్ష చేపట్టబోతున్నారు. ఎంతో నిష్టతో ఈ దీక్ష చేపట్టాల్సి ఉంటుంది. పవన్‌ దీక్షతో ఎక్కడ చూసినా వారాహి మాత గురించే చర్చ నడుస్తున్నది.

Varahi deeksha: పవన్ సంకల్పించిన వారాహి దీక్ష ఏంటి..? దీని ఫలితం ఎలా ఉంటుంది
Pawan Kalyan
Follow us

|

Updated on: Jun 25, 2024 | 6:41 PM

ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు వారాహి మాత పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆ అమ్మవారి దీక్షను చేపడుతుండటమే. జూన్‌ 26 నుంచి 11 రోజుల పాటు పవన్‌ వారాహి మాత దీక్షలో ఉండబోతున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్‌ కల్యాణ్‌ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది కూడా జూన్‌ నెలలో పవన్‌ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మకు పూజలు నిర్వహించారు. అప్పట్లో కూడా వారాహి మాత వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈ సారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ దీక్ష చేపడుతుండటం విశేషంగా మారింది.

అందరికి భిన్నంగా వారాహిని పూజ

పవన్‌ కల్యాణ్‌కు దైవభక్తి ఎక్కువే అంటారు. ఆయన అందరికి భిన్నంగా వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించటంతో ఈ ఏడాది కూడా వారాహి మాత దీక్షను కంటిన్యూ చేస్తున్నారు.

గతంలో పవన్‌ చాతుర్మాస దీక్ష

గతంలో కూడా పవన్‌ చాలా దీక్షలు చేపట్టారు. చాతుర్మాస దీక్ష చేశారు. నాలుగు నెలల పాటు ఈ దీక్షలో పవన్‌ కొనసాగారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం మాసాల్లో పవన్‌ దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో కూడా ఆహార నియమాలు పాటించారు. సాత్వికాహారం మాత్రమే తీసుకునేవారు. దీక్ష విరమించే సమయంలో హోమం కూడా నిర్వహించారు.

మనో అభీష్టాలను నెరవేర్చే వారాహి మాత

ఇంతకీ వారాహి మాత దీక్ష ఏమి ఆశించి చేస్తారు? ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? వీటి గురించి తెలుసుకుందాం.. మనో అభీష్టాలను నెరవేర్చే వారాహి అమ్మవారు అత్యంత శుభ ఫలితాలను ఇస్తారు. జూన్‌ నెలాఖరుతో మొదలై జూలై 9 వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు ముగుస్తాయి. ఈ సమయం గురించి ఎక్కువగా ప్రచారంలో లేదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. మన సంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి, శక్తిమంతమైనవి ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులు. ఎవరైతే ఈ నవరాత్రులు అత్యంత నిష్ఠతో, శ్రద్ధతో దీక్ష ఆచరిస్తారో వారి సమస్యలన్నీ అమ్మవారి అనుగ్రహంతో తీరిపోతాయనేది పెద్దల విశ్వాసం.

వారాహి మాత ధాన్య దేవత

సప్తమాతృకలలో వారాహి మాత ఒకరు. ఈమె లలితా పరమేశ్వరి సర్వ సైన్యాధ్యక్షురాలు. మహాలక్ష్మి ప్రతిరూపం, సర్వ మంగళ స్వరూపం. దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణకు అమ్మవారు ఆయుధాలు ధరించి ఉంటారు. చూడటానికి ఉగ్రరూపంగా కనిపించినప్పటికీ ఆమె చాలా కరుణామయి. అయితే వారాహి ఆరాధన అందరూ చేయకూడదన్న అపోహ ఉండటం వల్ల చాలా మందికి వారాహి మాత గురించి పెద్దగా తెలియదు. కానీ ఇది సత్యదూరం. ఎవరైనా వారాహి మాతను పూజించవచ్చు. అరిషడ్వర్గాలు అమ్మ అధీనంలో ఉంటాయి. కామ,క్రోధ, మద, మోహ, మాత్సర్యాల నుంచి అమ్మవారు మనల్ని రక్షిస్తుందని అనుభవజ్ఞుల మాట. మన మనస్సును నియంత్రిస్తుంది. వారాహి మాత భూదేవి నాగలిని, రోకలిని ధరించిన ధాన్య దేవత కూడా. పంటలు సరిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి రైతు వారాహి మాత ఆరాధాన చేయాలని చెబుతారు.

భూ సమస్యలు పరిష్కారమవుతాయి

వారాహి మాత దీక్ష శ్రద్ధతో చేసిన వారికి వారు కోరుకున్నవన్నీ జరుగుతాయి. భూ సమస్యలు పరిష్కారమవుతాయి. భూ తగాదాలు, కోర్టు కేసులు, శత్రు సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు, జీవితంలో స్థిరత్వం లేకున్నా. మనకు రక్షణ కావాలన్నా, ఇంట్లో తరచూ అశుభాలు జరుగుతున్నా, ఆర్థిక స్థిరత్వం లేకున్నా, అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలన్నా వారాహి మాత దీక్ష చేస్తే చాలు ఎలాంటి సమస్య అయినా ఇట్టే పరిష్కారమైపోతుందంటారు.

మద్య, మాంసాలకు దూరం.. నేలపైనే పడుకోవాలి

వారాహి మాత దీక్ష చేపట్టేవారు రోజూ ఉదయాన్నే లేచి తలస్నానం చేశాక దీక్షా వస్త్రాలు ధరించాలి. అలా వీలు కాని వారు మెడలో దీక్షగా ఒక కండువాను తొమ్మిది రోజుల పాటు ధరించాలి. నిత్యం వారాహి మాత అష్టోత్తర నామాలు, కానీ సహస్ర నామాలు కాని చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎర్రటి పూలతో పూజించాలి. దానిమ్మ గింజలను నైవేద్యంగా పెట్టాలి. దీక్షలో ఉన్నన్ని రోజులు పాదరక్షలు ధరించరాదు. మద్య,మాంసాలకు దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలని, నేలపైనే చాప పరిచి పడుకోవాల్సి ఉంటుందని పండితులు పూజా క్రతువును వివరించారు. వినటానికి ఎలా ఉన్నా ఆచరించటానికి మాత్రం ఇది కాస్త కఠినంగానే ఉంటుందని చెప్తారు. అయితే అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఈ మాత్రం చేయలేరా? పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడీ కఠిన దీక్షను చేపట్టనున్నారు.

ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే వారాహి మాత

వారాహి మాతను నేపాల్‌లో బరాహి అంటారు రాజస్థాన్‌, గుజరాత్‌లలో ఆమెను దండినిగా కొలుస్తారు. హిందూ దేవతైన వారాహి మాత మూలాలు బౌద్ధ దేవతలైన వజ్రవరాహి, మరీచిలో ఉన్నాయి. వరాహం కేవలం హిందూ పురాణాలకే పరిమితం కాలేదు. ఇది సెల్టిక్‌, జపనీస్‌, చైనీస్‌, గ్రీక్‌, అమెరికన్‌, ఇండియన్‌, ఈజిప్షియన్‌ సంస్కృతులలో కూడా ఉన్నది. చైనాలో వరాహం అటవీ సంపదను సూచిస్తుంది. జపాన్‌లో వరాహం ధైర్యానికి ప్రతీక. మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహి మాత ధైర్యం, నిర్భయతకు గుర్తుగా చూస్తారు. వారాహి మాతను ధ్యానించడం లేదా ఆరాధించటం అనేది మనలో అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుందని అనుభవజ్ఞులు చెబుతారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!