Watch Video: ఆ రెండు ఇళ్లను హోమ్ టూర్ చేద్దాం.. టీడీపీ నేతలకు మాజీ మంత్రి సవాల్..
వైసీపీ ఆఫీస్‌లకు ప్రభుత్వ నోటీసులపై పేర్ని నాని స్పందించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్నీ కీలక అంశాలను ప్రస్తావించారు. పార్టీలకు 33ఏళ్లకు భూమి లీజు అన్నది ఒకప్పటి టీడీపీ ప్రభుత్వ జీవో అని చెప్పారు. అదే క్రమంలో టీడీపీ ఆఫీసులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్రకార్యాలయానికి 99ఏళ్లకు లీజు ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు.

వైసీపీ ఆఫీస్‌లకు ప్రభుత్వ నోటీసులపై పేర్ని నాని స్పందించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్నీ కీలక అంశాలను ప్రస్తావించారు. పార్టీలకు 33ఏళ్లకు భూమి లీజు అన్నది ఒకప్పటి టీడీపీ ప్రభుత్వ జీవో అని చెప్పారు. అదే క్రమంలో టీడీపీ ఆఫీసులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్రకార్యాలయానికి 99ఏళ్లకు లీజు ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. 2018లో ప్రభుత్వం మారేముందు 10జిల్లాలో భూములిస్తూ జీవో ఇవ్వలేదా అని అడిగారు మాజీ మంత్రి పేర్నినాని. గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం టీడీపీ ఆఫీసులన్నీ ప్రభుత్వ భూముల్లో జరిగిన నిర్మాణాలు కాదా అని ప్రశ్నించారు.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలకు పేర్ని నాని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని సీఎం చంద్రబాబు ఇంటిని, అలాగే జగన్ ఇంటిని హోమ్ టూర్ చేద్దామని చెప్పారు. దీనిపై రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆడిట్‌కు మీరు సిద్దమా అని సవాల్ విసిరారు. అనుమతులు తీసుకునే పార్టీ కార్యాలయాలు కట్టామని స్పష్టం చేశారు. జగన్ క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్ తీసుకెళ్లమంటే తీసుకెళ్లడం లేదని ఈ సందర్భంగా తెలిపారు. ఒకవేళ తీసుకెళ్లని పక్షంలో ఫర్నీచర్‌కు డబ్బులు కట్టమంటే కడతామని తాము చెబుతున్నట్లు వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..