AP ECET 2024 Counselling: ఏపీ ఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ రేపట్నుంచి (జూన్‌ 26) ప్రారంభంకానుంది. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఈసెట్‌ కౌన్సెలింగ్‌ జూన్‌ 26 నుంచి ప్రారంభించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ ఈ సందర్భంగా ప్రకటించింది. జూన్‌ 26 నుంచి 30 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించినట్లు ఈ సందర్భంగా సాంకేతిక విద్యా శాఖ వెల్లడించింది..

AP ECET 2024 Counselling: ఏపీ ఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
AP ECET 2024 Counselling
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2024 | 5:20 PM

అమరావతి, జూన్ 25: ఆంధ్రప్రదేశ్‌లో ఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ రేపట్నుంచి (జూన్‌ 26) ప్రారంభంకానుంది. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఈసెట్‌ కౌన్సెలింగ్‌ జూన్‌ 26 నుంచి ప్రారంభించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ ఈ సందర్భంగా ప్రకటించింది. జూన్‌ 26 నుంచి 30 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించినట్లు ఈ సందర్భంగా సాంకేతిక విద్యా శాఖ వెల్లడించింది. జూన్‌ 27 నుంచి జులై 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 1 నుంచి 4 వరకు కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాలు ఇచ్చుకోవల్సి ఉంటుంది. జులై 5న వెబ్‌ ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం కల్పిస్తారు. జులై 8న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 9 నుంచి 15వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. జులై 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. డిప్లొమో ఇన్‌ ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల విద్యార్థులకు ప్రత్యేకంగా మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్‌ ప్రక్రియ పూర్తి కానందు వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

కాగా ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలు మే 30న విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.

‘ఆ ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలపండి..’ తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఏర్పడిన ఖాళీలను తాజాగా సర్కార్‌ వెలువరించిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలపాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలపాలంటూ నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలు, స్టడీ హాళ్ల వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో ప్రదర్శన ఇస్తూ నినాదాలు చేశారు. అలాగే ఇటీవల వెలువడిన టెట్‌ ఫలితాల్లో కొత్తగా టెట్‌ పాసైన వాళ్లకు డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు వీలుగా జులైలో నిర్వహించే పరీక్షలను కనీసం 40 రోజులపాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రేవంత్‌ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..