TGPSC Group 1 OMR Answer Sheet: టీజీపీఎస్సీ గ్రూప్1 ఓఎంఆర్ ఆన్సర్‌ షీట్లు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ గ్రూప్-1 ఓఎంఆర్ ఇమేజింగ్‌ పత్రాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి లాగిన్లో వివరాలు నమోదు చేసి ఎంఆర్ ఇమేజింగ్‌ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ ఆన్సర్లను సరిచూసుకోవడానికి ఈ మేరకు కమిషన్‌ సమాధాన పత్రాలను..

TGPSC Group 1 OMR Answer Sheet: టీజీపీఎస్సీ గ్రూప్1 ఓఎంఆర్ ఆన్సర్‌ షీట్లు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి
TGPSC Group 1 OMR Answer Sheet
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2024 | 4:43 PM

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ గ్రూప్-1 ఓఎంఆర్ ఇమేజింగ్‌ పత్రాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి లాగిన్లో వివరాలు నమోదు చేసి ఎంఆర్ ఇమేజింగ్‌ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ ఆన్సర్లను సరిచూసుకోవడానికి ఈ మేరకు కమిషన్‌ సమాధాన పత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష 2024 ఓఎమ్‌ఆర్‌ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 563 పోస్టులతో వెలువడిన గ్రూప్1 ఉద్యోగ ప్రకటనకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్ 9న గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 3,02,172 మంది అంటే 74.86 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. దాదాపు లక్ష మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరుకాలేదు. త్వరలోనే ప్రిలిమినరీ పరీక్ష తుది ఆన్సర్‌ కీ రూపొందించి ఫలితాలు ప్రకటించనున్నారు. 1:50 చొప్పున మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు అక్టోబర్‌ 21 నుంచి నిర్వహించనున్నారు. మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్‌ పరీక్షకు మొత్తం 28,150 మందిని ఎంపిక చేయనున్నట్లు కమిషన్‌ వెల్లడంచింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.