AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Soil: అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన చైనా.. జాబిల్లికి ఆవలివైపు నుంచి మట్టి, శిథిలాలను తీసుకొచ్చిన చాంగే-6

అంతరిక్ష రంగంలో ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా చరిత్ర సృష్టించింది. జాబిల్లికి ఆవలివైపు నుంచి మట్టి, శిథిలాలను భూమిపైకి మోసుకొచ్చింది చైనా వోమనౌక చాంగే-6. ఇది ప్రపంచంలోనే తొలిసారి.  జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్‌ హస్తం సాయంతో సేకరించింది.

Moon Soil: అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన చైనా.. జాబిల్లికి ఆవలివైపు నుంచి మట్టి, శిథిలాలను తీసుకొచ్చిన చాంగే-6
Chang'e 6 Mission
Surya Kala
|

Updated on: Jun 26, 2024 | 6:28 AM

Share

అంతరిక్ష రంగంలో ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా చరిత్ర సృష్టించింది. చంద్ర మండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి అవతలివైపు నమూనాలను సేకరించి, వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండోవైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకొని లూనార్‌ ల్యాండర్‌ చాంగే-6 వ్యోమనౌక భూమి మీదకు చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగోలియన్‌ ప్రాంతంలో ఇది సురక్షితంగా ల్యాండయినట్లు డ్రాగన్‌ వెల్లడించింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి..దాదాపు 53 రోజులపాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. జూన్‌ 2న జాబిల్లి అవతలివైపు సౌత్‌ పోల్‌- అయిట్కిన్‌ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌లో సురక్షితంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకింది.

ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్‌ అనే నాలుగు భాగాలు ఉన్నాయి. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్‌ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుని భూమికి వచ్చేసింది. చాంగే-6 తీసుకొచ్చిన నమూనాల్లో 2.5 మిలియన్‌ సంవత్సరాల పురాతన అగ్నిపర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ నమూనాలను అధ్యయనం చేస్తే చంద్రుడికి రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విశ్వాసంగా ఉన్నారు. చందమామలో ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. ఇవతలి భాగాన్ని నియర్‌ సైడ్‌, అవతలి భాగాన్ని ఫార్‌ సైడ్‌గా పిలుస్తారు. ఇప్పటివరకు అమెరికా, సోవియెట్‌ యూనియన్‌తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్‌ సైడ్‌ నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చాయి. అవతలి భాగం నుంచి మట్టి, శిథిలాలను తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు