Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eyestrain: ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ వినియోగంతో కళ్ళు అలసిపోతున్నయా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం

కళ్ళకు అల‌స‌ట‌గా అనిపిస్తే దానిని విస్మరించ‌కూడ‌దు. చిన్న చిన్న విష‌యాల‌ పట్ల కేరింగ్ తీసుకున్నా క‌ళ్లు రిలాక్స్‌గా ఉంటాయి. స్క్రీన్‌ని నిరంతరం చూస్తూ పని చేస్తూ ఉంటే లేదా ఎక్కువగా చదివి కళ్ళకు తగిన విశ్రాంతి ఇవ్వకపోతే కంటి చూపు బలహీనంగా మారవచ్చు. కనుక ఈ రోజు కంటికి రిలాక్స్ ఇచ్చే కొన్ని సాధారణ చిట్కాలను గురించి తెలుసుకుందాం..వీటిని అనుసరించడం ద్వారా కళ్లలో తాజాదనాన్ని పొందవచ్చు.

Eyestrain: ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ వినియోగంతో కళ్ళు అలసిపోతున్నయా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం
Eyestrain
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2024 | 8:41 AM

ఇంద్రియాల్లో కళ్ళు ప్రధానం అన్నారు పెద్దలు. కనుక కళ్లకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని వెంటనే గమనించడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో ఎక్కువ సమయం లాప్ టాప్ ముందు గడుపుతున్నారు. అంతేకాదు ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయడం, నిరంతరం ఏదైనా చదవడం, ఎండలో లేదా వేడి వాతావరణంలో ఉండటం వంటి అనేక కారణాల వలన కొన్నిసార్లు కళ్ళు బాగా అలసిపోతాయి. దీని కారణంగా కళ్ళు పొడిబారడం, చికాకుగా అనిపించవచ్చు. కొన్ని సార్లు కళ్ళు ఎరుపు రంగులోకి మారడం ప్రారంభమవుతాయి. ఈ నేపధ్యంలో కొన్ని సాధారణ చిట్కాల సహాయంతో పని చేస్తున్నప్పుడు కూడా కళ్లకు విశ్రాంతినివ్వ వచ్చు

కళ్ళకు అల‌స‌ట‌గా అనిపిస్తే దానిని విస్మరించ‌కూడ‌దు. చిన్న చిన్న విష‌యాల‌ పట్ల కేరింగ్ తీసుకున్నా క‌ళ్లు రిలాక్స్‌గా ఉంటాయి. స్క్రీన్‌ని నిరంతరం చూస్తూ పని చేస్తూ ఉంటే లేదా ఎక్కువగా చదివి కళ్ళకు తగిన విశ్రాంతి ఇవ్వకపోతే కంటి చూపు బలహీనంగా మారవచ్చు. కనుక ఈ రోజు కంటికి రిలాక్స్ ఇచ్చే కొన్ని సాధారణ చిట్కాలను గురించి తెలుసుకుందాం..వీటిని అనుసరించడం ద్వారా కళ్లలో తాజాదనాన్ని పొందవచ్చు.

కళ్ళకు మసాజ్

ఇవి కూడా చదవండి

పని చేస్తున్నప్పుడు కళ్ళు అలసిపోయినట్లు అనిపిస్తే, 20 నుండి 30 సెకన్ల విరామం తీసుకోండి. కళ్ళు మూసుకుని కను రెప్పల మీద వేళ్లతో తేలికపాటి వృత్తాకార కదలికలలో మసాజ్ చేయండి. మీ అరచేతులను ఒకదానితో ఒకటి రుద్దండి. వాటిని కళ్ళపై కొద్దిసేపు ఉంచండి. ఇలా చేయడం కంటి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చాలా విశ్రాంతిని పొందుతారు.

విశ్రాంతి తీసుకోండి,స్వచ్ఛమైన గాలిలోకి వెళ్లండి

కంప్యూటర్‌ దగ్గర ఎక్కువ సమయం పని చేస్తున్నప్పుడు.. ఎక్కువ కాంతి కళ్లపై పడుతుంది. దాని కారణంగా కళ్ళు అలసిపోతాయి. దీని నుంచి ఉపశమనం పొందడానికి విశ్రాంతి తీసుకోండి. బహిరంగ ప్రదేశంలో స్వచ్చమైన గాలిని పీల్చుకోవడానికి.. సహజ కాంతిలో బయటకు వెళ్లండి.

20-20-20 నియమాన్ని అనుసరించండి

పని చేస్తున్నప్పుడు మధ్యలో కళ్ళకు విశ్రాంతి ఇవ్వడం కూడా ముఖ్యం. దీని కోసం ప్రతి 20 నిమిషాల తర్వాత, మీ దృష్టిని కంప్యూటర్ నుండి పక్కకు పెట్టి కనీసం 20 అడుగుల దూరంలో ఉంచిన వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. దీని తరువాత కనురెప్పలను రెప్ప వేయండి. ఇలా చేయడం వలన దృష్టి మెరుగుపడుతుంది. కంటి అలసటను కూడా తొలగిస్తుంది.

కోల్డ్ కంప్రెస్ ఉపశమనం

మీరు పని నుండి వచ్చిన తర్వాత కళ్ళు చాలా అలసిపోయినట్లు అనిపిస్తే కోల్డ్ కంప్రెస్ దీని కోసం ఉపయోగించవచ్చు. మీకు కావాలంటే జెల్ ఐస్ ప్యాక్‌లను తీసుకోవచ్చు లేదా చల్లటి నీటిలో మెత్తని గుడ్డను ముంచి, దానిని కళ్ళపై కొద్దిసేపు ఉంచవచ్చు. రెగ్యులర్ వ్యవధిలో రెండు మూడు సార్లు బట్టలు మార్చండి. ఇలా చేయడం వలన చాలా ఉపశమనం కలిగుతుందని నిపుణులు చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..