Yogini Ekadashi: యోగిని ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. శ్రీ హరి అనుగ్రహం మీ సొంతం
యోగినీ ఏకాదశి రోజున రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. యోగినీ ఏకాదశి రోజున త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం జూలై 2 ఉదయం 5:27 నుంచి మరుసటి రోజు జూలై 3 ఉదయం 4:40 వరకు ఉంటుంది. త్రిపుష్కర యోగం జూలై 2 ఉదయం 8:42 నుండి జూలై 3 ఉదయం 4:40 వరకు ఉండనుంది. జ్యోతిష్య విశ్వాసం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగంలో చేసే ఏ పని అయినా విజయవంతమవుతుంది. దీనితో పాటు త్రిపుష్కర యోగ సమయంలో పూజలు, దానములు, యాగాలు లేదా మరేదైనా శుభ కార్యాలు చేయడం వల్ల మూడు రెట్లు ఫలితాలు లభిస్తాయి.

హిందూ మతంలో యోగిని ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి వ్రతం శ్రీమహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే జేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది. జేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలో యోగినీ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున ఉపవాసం, విష్ణువును పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, సిరి సంపదలు లభిస్తాయని విశ్వాసం. యోగినీ ఏకాదశిని నిర్జల ఏకాదశి తర్వాత.. దేవశయని ఏకాదశి ముందు జరుపుకుంటారు. ఈ ఏకాదశి నాడు దానం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆయనను పూజించడం వల్ల పాపాలు నశిస్తాయి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మోక్షం లభిస్తుందని నమ్మకం.
పంచాంగం ప్రకారం జేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి జూలై 1 ఉదయం 10:26 గంటలకు ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి జూలై 2న ఉదయం 8:34 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం యోగిని ఏకాదశి వ్రతం 2 జూలై 2024న ఆచరిస్తారు. అదే సమయంలో జూలై 3న ఉదయం 5:28 నుండి 7:10 గంటల వరకు యోగిని ఏకాదశి ఉపవాసం కొనసాగుతుంది.
సంతోషకరమైన యాదృచ్చికం
యోగినీ ఏకాదశి రోజున రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. యోగినీ ఏకాదశి రోజున త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం జూలై 2 ఉదయం 5:27 నుంచి మరుసటి రోజు జూలై 3 ఉదయం 4:40 వరకు ఉంటుంది. త్రిపుష్కర యోగం జూలై 2 ఉదయం 8:42 నుండి జూలై 3 ఉదయం 4:40 వరకు ఉండనుంది.
జ్యోతిష్య విశ్వాసం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగంలో చేసే ఏ పని అయినా విజయవంతమవుతుంది. దీనితో పాటు త్రిపుష్కర యోగ సమయంలో పూజలు, దానములు, యాగాలు లేదా మరేదైనా శుభ కార్యాలు చేయడం వల్ల మూడు రెట్లు ఫలితాలు లభిస్తాయి. త్రిపుష్కర యోగ సమయంలో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆరాధించడం అత్యధిక ఫలాన్ని ఇస్తుంది.
యోగినీ ఏకాదశి రోజున వీటిని దానం చేయండి
- ఆహారం: పేదవారి ఆకలిని తీర్చడానికి అన్న వితారణ గొప్ప మార్గం. ఈ రోజున ఆహారాన్ని అందించడం ద్వారా మహా విష్ణువు సంతోషిస్తాడు. ఆనందం,శ్రేయస్సును ప్రసాదిస్తాడు.
- బట్టలు: పేదవారికి సహాయం చేయడానికి బట్టలు దానం చేయడం గొప్ప మార్గం. ఈ రోజున వస్త్రదానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. పుణ్యం వస్తుంది.
- నెయ్యి: నెయ్యి దేవతల ఆహారంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నెయ్యి దానం చేయడం వల్ల తెలివి తేటలు పెరుగుతాయి. జ్ఞానం పెరుగుతుంది.
- నువ్వులు: నువ్వులను శివునికి ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు. ఈ రోజు నువ్వులను దానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.
- పండ్లు: పండ్లను దానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజున పండ్లను దానం చేయడం వలన రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యాన్ని అందిస్తుంది.
- దక్షిణ: బ్రాహ్మణులకు మరియు పేదలకు దక్షిణను దానం చేయాలి. ఈ రోజున దక్షిణ దానం చేయడం వల్ల జ్ఞానము.. తెలివి తేటలు లభిస్తాయి.
- గోదానం: ఆవుని దానం చేయడం అత్యంత పుణ్య దానంగా పరిగణించబడుతుంది. ఈ రోజు గో దానం చేయడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది.
- యోగినీ ఏకాదశి రోజున శక్తి మేరకు చేసే దానాలకు శ్రీ మహా విష్ణువు ప్రసన్నుడై సుఖం, శాంతి, శ్రేయస్సును ప్రసాదిస్తాడని విశ్వాసం.
యోగినీ ఏకాదశి ప్రాముఖ్యత
యోగినీ ఏకాదశి శ్రీహరి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఆయనను ఆరాధించడం వలన విశేష ఆశీర్వాదాలు లభించి కోరిన కోరికలు నెరవేరుతాయి. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ నశించి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండటం, విష్ణువును పూజించడం ద్వారా ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి పొందుతారు. యోగినీ ఏకాదశి మోక్షానికి మార్గం. ఈ రోజున ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.