Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanwar Yatra 2024: కన్వర్ యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ యాత్ర విశిష్టత.. నియమాలు ఏమిటంటే..

శ్రావణ మాసంలో శివభక్తులు గంగానది వద్దకు వెళ్లి నదిలోని గంగా జలాన్ని కలశంలో నింపి కావిడి కట్టి తమ భుజాలపై వేలాడదీసుకుని తమ తమ ప్రాంతాల్లోని శివాలయానికి తీసుకొచ్చి శివలింగానికి గంగాజలాన్ని సమర్పిస్తారు. గ్రంధాల ప్రకారం పరశురాముడు ఈ కన్వర యాత్రను మొదట ప్రారంభించాడు. పరశురాముడు గర్హ్ ముక్తేశ్వర్ ధామ్ నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చాడు .. ఈ గంగాజలంతో యుపిలోని బాగ్‌పత్ సమీపంలో ఉన్న 'పుర మహాదేవుడిని అభిషేకించాడని నమ్మకం.

Kanwar Yatra 2024: కన్వర్ యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ యాత్ర విశిష్టత.. నియమాలు ఏమిటంటే..
Kanwad Yatra 2024
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2024 | 10:55 AM

హిందూ మతంలో శ్రావణ మాసానికి విశిష్ట స్థానం ఉంది. పూజలు తీర్ధయత్రాలతో పాటు పెళ్ళిళ్ళు వంటి ఫంక్షన్లకు కూడా శ్రావణ మాసం వేదిక అని చెప్పవచ్చు. శ్రావణ మాసం ప్రరంభంతోనే ఉత్తరాదిలో కన్వర యాత్ర ప్రారంభమవుతుంది. కన్వర యాత్ర వస్తుందంటే చాలు శివభక్తుల్లోనూ అత్యుత్సాహం నెలకొంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది కన్వాడీలు హరిద్వార్ నుంఛి గంగాజలం తీసుకుని తమ ప్రాంతంలోని శివాలయాలకు వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేస్తారు. కన్వర యాత్రకు సంబంధించి అనేక ముఖ్యమైన నియమాలు గ్రంధాలలో పేర్కొనబడ్డాయి.ఈ యాత్రా సమయంలో పాటించాల్సినవి నియమాలు చాలా ముఖ్యమైనవి. కన్వర యాత్ర నియమాలలో ఎటువంటి సడలింపు లేదు. వీటిని ఉల్లంఘిస్తే ఆ భక్తులు శివుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే అని అంటారు.

కన్వర యాత్రను పూర్తి చేసిన భక్తులపై భోలాశంకరుడు ప్రత్యేక ఆశీస్సులు కురుస్తాయని నమ్ముతారు. వేల్లల్లో కాదు లక్షల్లో ప్రజలు కావిడిను తీసుకొని కాలినడకన కన్వర యాత్రకు బయలుదేరి వెళ్తారు. గంగానది నుంచి నీరు తెచ్చి శివునికి నీరు సమర్పిస్తారు. ఈ సంవత్సరం కన్వర యాత్ర 22వ తేదీ జూలై 2024 నుండి ప్రారంభమవుతుంది. ఈ యాత్ర శ్రావణ శివరాత్రి 2 ఆగస్టు 2024న ముగుస్తుంది. కావిడి యాత్ర ఒక తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. ఈ యాత్ర కోసం భక్తులు ఏడాది పొడవునా వేచి ఉంటారు.

కన్వర యాత్ర ఎలా ఉంది? శ్రావణ మాసంలో శివభక్తులు గంగానది వద్దకు వెళ్లి నదిలోని గంగా జలాన్ని కలశంలో నింపి కావిడి కట్టి తమ భుజాలపై వేలాడదీసుకుని తమ తమ ప్రాంతాల్లోని శివాలయానికి తీసుకొచ్చి శివలింగానికి గంగాజలాన్ని సమర్పిస్తారు. గ్రంధాల ప్రకారం పరశురాముడు ఈ కన్వర యాత్రను మొదట ప్రారంభించాడు. పరశురాముడు గర్హ్ ముక్తేశ్వర్ ధామ్ నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చాడు .. ఈ గంగాజలంతో యుపిలోని బాగ్‌పత్ సమీపంలో ఉన్న ‘పుర మహాదేవుడిని అభిషేకించాడని నమ్మకం. అప్పటి నుంచి ఈ  కన్వర యాత్ర చేసే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

కన్వర యాత్ర నియమాలు కన్వర యాత్ర చేపట్టే భక్తులను కన్వరియా అంటారు. కన్వర్ యాత్రకు వెళ్లే భక్తులు ఈ కాలంలో ప్రత్యేక నియమాలను పాటించాలి. ఈ కాలంలో శివభక్తులందరూ కాలినడకన ప్రయాణించాలి. యాత్రలో భక్తులు సాత్విక ఆహారం తీసుకోవాలి. అలాగే విశ్రాంతి తీసుకునేటప్పుడు కావిడిని నేలపై ఉంచవద్దు. ఇలా చేస్తే కన్వర్ యాత్ర అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

కన్వర యాత్ర సమయంలో భక్తులు ఎలాంటి మత్తు, మాంసం, మద్యం లేదా తామసిక ఆహారాన్ని తినకూడదు. కన్వర యాత్ర పూర్తిగా కాలినడకన జరుగుతుంది. ప్రయాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు కాలినడకనే ప్రయాణం సాగుతుంది. ప్రయాణంలో ఎలాంటి వాహనం ఉపయోగించరు. కావిడి లోని కలశాల్లో గంగా లేదా ఏదైనా పవిత్ర నది నుండి మాత్రమే నీరు తీసుకుని రావాల్సి ఉంటుంది. అంతేకాదు కావిడిని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి.

కన్వర యాత్ర సమయంలో కావడిని నేలపై లేదా ఏ వేదికపైనైనా ఉంచకూడదని గుర్తుంచుకోవాలి. కావిడిని ఎల్లప్పుడూ స్టాండ్ లేదా కొమ్మకు వేలాడదీయండి. పొరపాటున కన్వర్‌ను నేలపై ఉంచినట్లయితే.. కన్వర్‌ను మళ్లీ పవిత్ర జలంతో నింపాలి. కన్వర్ యాత్రలో ప్రయాణిస్తున్నప్పుడు దారి పొడవునా ఓం నమ శివాయ అని జపిస్తూ ఉండాలి. అలాగే, కన్వర్‌ని ఎవరుబడితే వారు మోయకూడదని గుర్తుంచుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.