AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Season: వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం ముఖ్యం.. రోజూ ఈ ఐదు వస్తువులను తినే ఆహారంలో చేర్చుకోండి..

వర్షాకాలంలో వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండటానికి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలనుకుంటే తినే ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టాలి. బలవర్ధకరమైన ఆహారాన్ని తినడం వలన రోగనిరోధక శక్తి అధికంగా  ఉంటుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు బాగా తగ్గుతాయి. కనుక రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి ఏఏ పదార్థాలు ఉపయోగకరమో ఈ రోజు తెలుసుకుందాం..

Monsoon Season: వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం ముఖ్యం.. రోజూ ఈ ఐదు వస్తువులను తినే ఆహారంలో చేర్చుకోండి..
Monsoon Health Tips
Surya Kala
|

Updated on: Jul 01, 2024 | 11:24 AM

Share

దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి.. అనేక ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా వివిధ ప్రదేశాలలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారింది. ఇన్ని రోజులు వేడి, ఉష్నోగ్రతలతో ఇబ్బంది పడిన ప్రజలు ఉపశమనం పొందారు. అయితే వర్షాలతో వాతావరణంలో తేమ పెరిగింది. అనేక చోట్ల నీరు నిల్వ అవుతుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం కూడా పెరిగింది. ప్రస్తుతం తేమతో కూడిన సీజన్‌లో మలేరియా, డెంగ్యూ, అలర్జీ, వైరల్‌ ఫీవర్‌, జలుబు, దగ్గు, ఫుడ్‌ పాయిజనింగ్‌ వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. కనుక పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం.

వర్షాకాలంలో వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండటానికి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలనుకుంటే తినే ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టాలి. బలవర్ధకరమైన ఆహారాన్ని తినడం వలన రోగనిరోధక శక్తి అధికంగా  ఉంటుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు బాగా తగ్గుతాయి. కనుక రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి ఏఏ పదార్థాలు ఉపయోగకరమో ఈ రోజు తెలుసుకుందాం..

పసుపు: వంటగదిలో ఉండే పసుపు వర్షాకాలంలో ఆరోగ్యానికి ఓ వరం. రోజూ తినే ఆహారంలో పసుపుని చేర్చుకోండి. పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు పసుపు వేసుకుని త్రాగాలి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాదు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

అల్లం: అల్లం ఎక్కువగా శీతాకాలంలో వినియోగిస్తారు. అయితే వర్షాకాలంలో కూడా దీనిని పరిమిత పరిమాణంలో తినవచ్చు. అల్లం యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండి హెర్బ్ లాగా పనిచేస్తుంది. వర్షాకాలంలో వచ్చే గొంతునొప్పి, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి అల్లం రక్షిస్తుంది.

తులసి: వర్షాకాలంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నాలుగు తులసి ఆకులను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అనేక వైరల్ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాదు జీవక్రియ కూడా పెరుగుతుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

అశ్వగంధ: ఆయుర్వేదంలో అశ్వగంధ చాలా శక్తివంతమైన మూలికగా పరిగణించబడుతుంది. వర్షాకాలంలో కూడా అశ్వగంధ తినవచ్చు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేయడంలో.. ఇన్ఫెక్షన్‌లతో పోరాడగలిగేలా చేయడంలో సహాయపడతాయి. అంతే కాదు అనేక వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.

దాల్చిన చెక్క: సుగంధ ద్రవ్యాలలో ఉపయోగించే దాల్చిన చెక్క లక్షణాల పరంగా కూడా అద్భుతమైనది. దీని వినియోగం వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడిని పాలలో కలుపుకుని తీసుకోవచ్చు లేదా చిన్న ముక్కను టీలో కలుపుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ బాధితులకు దాల్చినచెక్క వినియోగం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)