Pumpkin Seeds: గుమ్మడి గింజలు తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో.. ఈ రేసిపీ ట్రై చేయండి..

సమతుల్య ఆహారంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపవచ్చు. ఒక వైపు తినే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, వివిధ రకాల పప్పులు, సలాడ్‌లను చేర్చుకోవచ్చు. దీనితో పాటు తినే ఆహారంలో గుమ్మడి గింజలను కూడా చేర్చుకోవచ్చు. గుమ్మడికాయ గింజలు వాటి పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. వీటిని వివిధ మార్గాల్లో తినే ఆహారంలో చేర్చుకోవచ్చు.

Pumpkin Seeds: గుమ్మడి గింజలు తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో.. ఈ రేసిపీ ట్రై చేయండి..
రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులను తగ్గిస్తాయి. గుమ్మడి గింజలు చూడడానికి చిన్నవిగా అనిపించినా అందులో దాగి ఉన్న పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మంచి నిద్రకు దోహదపడుతుంది.
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2024 | 8:38 AM

గుమ్మడికాయ గింజలు అనేక పోషకాల నిధిగా పరిగణించబడుతున్నాయి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు గుమ్మడి గింజలలో ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కనుక రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చుకోవడం వలన బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన గుండె వంటి అనేక ప్రయోజనాలను పొందుతారు. గుమ్మడికాయ గింజలు వాటి పోషక లక్షణాలతో ప్రసిద్ధి చెందాయి. అందుకే గుమ్మడి గింజలను ప్రతిరోజూ తినే ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడి గింజలతో అనేక రకాలుగా తినవచ్చు. అంతే కాదు గుమ్మడి గింజలతో చాలా రుచికరమైన వంటకాలు కూడా తయారు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కొత్త పద్ధతులను అనుసరించడం ప్రారంభించారు. ఇందులో వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషక ఆహారం ఉన్నాయి. సమతుల్య ఆహారంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపవచ్చు. ఒక వైపు తినే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, వివిధ రకాల పప్పులు, సలాడ్‌లను చేర్చుకోవచ్చు. దీనితో పాటు తినే ఆహారంలో గుమ్మడి గింజలను కూడా చేర్చుకోవచ్చు. గుమ్మడికాయ గింజలు వాటి పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. వీటిని వివిధ మార్గాల్లో తినే ఆహారంలో చేర్చుకోవచ్చు.

వేయించిన గుమ్మడికాయ గింజలు

తినే ఆహారంలో వేయించిన గుమ్మడికాయ గింజలను చేర్చుకోవచ్చు. దీని కోసం బాణలిలో నూనె వేయండి. కొంచెం నూనె వేడి అయ్యాక అందులో సొరకాయ గింజలు వేసి తక్కువ మంట మీద వేయించండి. ఇలా వేయించుకున్న గుమ్మడి గింజలపై కొంచెం ఉప్పు చల్లి వాటిని చిరుతిండిగా తినవచ్చు.

ఇవి కూడా చదవండి

గుమ్మడికాయ గింజలతో స్మూతీ తయారీ

గుమ్మడి గింజలను అరటి పండ్లు, పాలతో కలపడం ద్వారా ఆరోగ్యకరమైన స్మూతీని తయారు చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత పిస్తా, ఇతర డ్రై ఫ్రూట్స్ వేసి తినవచ్చు. ఈ స్మూతీ మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఈ స్మూతీ జంక్ ఫుడ్ తినకుండా చేయడమే కాదు అతిగా తినకుండా చేస్తుంది.

గుమ్మడి గింజల చట్నీ

గుమ్మడి గింజల చట్నీ చేయడానికి.. ముందుగా ఈ గింజలను బాగా వేయించండి. ఇప్పుడు బ్లెండర్‌లో వేయించిన గుమ్మడి గింజలు, టొమాటో, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కారం పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోండి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..