Zika Virus: పూణేలో వ్యాపిస్తున్న జికా వైరస్.. 6 కేసులు నమోదు.. డాక్టర్, ఆమె కుమార్తెకు పాజిటివ్
పూణేలోని ఎరంద్‌వానే, ముంద్వాలో జరిపిన విచారణలో ఆరుగురు రోగుల్లో జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారించబడిందని ఒక అధికారి తెలిపారు. జికా వైరస్ సోకిన తొలి కేసు ఎరంద్‌వానేలో వెలుగులోకి వచ్చిందని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఇక్కడ 46 ఏళ్ల డాక్టర్ నివేదికకు జికా పాజిటివ్‌గా వచ్చింది. డాక్టర్ 15 ఏళ్ల కుమార్తెకు కూడా వ్యాధి సోకింది. అలాగే ముంద్వాలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో 47 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువకుడు ఉన్నారు.
మానవాళిపై వైరస్ లు పగబట్టాయి. రకరకాల వైరస్ లు వెలుగులోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మళ్ళీ మన దేశంలో జికా వైరస్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. పూణేలోని ఎరంద్‌వానే, ముంద్వాలో జరిపిన విచారణలో ఆరుగురు రోగుల్లో జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారించబడిందని ఒక అధికారి తెలిపారు.
జికా వైరస్ సోకిన తొలి కేసు ఎరంద్‌వానేలో వెలుగులోకి వచ్చిందని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఇక్కడ 46 ఏళ్ల డాక్టర్ నివేదికకు జికా పాజిటివ్‌గా వచ్చింది. డాక్టర్ 15 ఏళ్ల కుమార్తెకు కూడా వ్యాధి సోకింది. అలాగే ముంద్వాలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో 47 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువకుడు ఉన్నారు.
జికా వైరస్ సోకిన నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తం
జికా వైరస్ సోకిన మొత్తం ఆరుగురు రోగుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోగుల శరీరంపై ఎర్రటి మచ్చలు, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం జికా వైరస్ ఈడిస్ దోమ కాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సంక్రమణ గుణం ఉండటం వల్ల మరింత ప్రమాదకరం. అయితే ఈ వైరస్ సోకిన రోగిలో మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు.
జికా వైరస్ ఎప్పుడు వెలుగులోకి వచ్చిదంటే
ఈ వైరస్ మొదటి కేసు 1947 లో వెలుగులోకి వచ్చింది. ఉగాండాలోని కోతులకు ఈ వైరస్ సోకింది. అయితే మానవులలో జికా వైరస్ మొదటి కేసు 1952లో నమోదైంది. గత కొన్నేళ్లుగా వివిధ దేశాల్లో జికా కేసులు నమోదవుతున్నాయి. అక్టోబర్ 2015, జనవరి 2016 మధ్య బ్రెజిల్‌లో వేల సంఖ్యలో జికా కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో 4000 మంది పిల్లలకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
జికా వైరస్ లక్షణాలు, నివారణ ఏమిటంటే
వైద్యులు ప్రకారం జికా వైరస్ సోకిన రోగులకు జ్వరం ఉంటుంది. రోగులు తలనొప్పి, కీళ్ల నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కళ్లు ఎర్రబడతాయి. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. కనుక ఇంటి చుట్టూ నీరు పేరుకుపోనివ్వవద్దు. రక్షణ కోసం పూర్తి చేతులను కవర్ చేసే విధంగా దుస్తులు ధరించండి. వ్యాధి సోకిన రోగులు నివసించే ప్రాంతాలకు వెళ్లవద్దు. తినే ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..